నేను నా ప్రస్థానము

-బాలిశెట్టి పావన నరసింహమూర్తి

ముందు మాట

     మనిషి పుట్టుక నుండి మరణము దాక సాగే ప్రయాణమే జీవితం. చూడడానికి ఓ అద్బుతములా, చదవడానికి ఓ చరిత్రలా వుంటుంది జీవితం.జీవ ప్రపంచములోనే తెలివితేటలు ఉన్న అత్యున్నత జీవి మనిషి. ఈ తెలివి తేటలవలన అన్ని జీవులను స్వాధీనం చేసుకోగలిగినాడు. కాని అతి తెలివి తేటలు తన వినాశనానికి దారి చూపుతున్నాయి.
కులం, మతం, వర్గం, వర్ణం,ఆశ, నిరాశ, దురాశ, దుఃఖం, సంతోషం ఇలా అనేకం మనిషిని ప్రభావితం చేస్తూ,మనిషిని ఇష్టము వచ్చినట్లు ప్రవర్త్రించేలా చేస్తున్నాయి.
     మన దేవుళ్లందరూ మానవాకారాల్లోనే ఎందుకున్నారో తెలిసుముందాము.జీవ పరిణామ సిద్ధాంతం ప్రకారం జీవి నీటిలో పుట్టింది. నీటిలో పెరిగింది. మెల్లగా భూమిపైకి వచ్చింది. ఉభయ చరంగా బతికింది. నేల మీద పాకింది. గాల్లో ఎగిరింది. చెట్ల మీద విహరించింది. గుహల్లో చేరి సమాజాలు ఏర్పరుచుకుంది. హిందూ పురాణ గ్రంథాల ప్రకారం దేవుడికి పది అవతారాలు ఉన్నాయి. మత్య్సావతారం, కూర్మావతారం, వరాహావతారం, నృసింహా వతారం, పరశురామావతారం, వామనావతారం, రామావతారం, కృష్ణావతారం, బుద్దావతారం, కలికావతారం. వీటిని పరిశీలిస్తే దేవుల్లు మానవాకారములో ఎందుకున్నారో అవగతమవుతుంది.
     ప్రతి ఒక్కరిలోనూ స్వార్థం అనేది ఉంటుంది. అయితే శ్రుతిమించితే ప్రమాదం. స్వార్థంగా మారితే ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది. అయిన వారినీ దూరం చేస్తుంది.మీరు ఇలాగే ప్రవర్తిస్తుంటే.. మీ చర్యలతోనే వారు మిమ్మల్ని దూరమవుతారని అర్థం చేసుకోండి. మీకు వారిపై ప్రేమ ఉన్నప్పటికీ.. వారి ఇష్టానికి తగ్గట్టు కొంత సమయాన్ని గడిపే స్వేచ్ఛనూ ఇవ్వండి. ఇది మీ అనుబంధాన్ని పెంచుతుంది. మీ స్వార్థాన్ని దూరం చేస్తుంది.
     ద్వేషంతో మనం చేసే పనిలో విజయం సాధించలేం. ప్రపంచాన్ని జయించలేం. అంతెందుకు మనల్ని మనం జయించలేం.
ద్వేషం.. బయటికి కనిపించని శత్రువు. మనసులో గూడు కట్టుకుని మనుష్యుల మధ్య అడ్డుగోడలు కడుతుంది.ద్వేషం.. పైకి మనిషిని మనిషిగానే ఉంచుతుంది. కానీ, లోపల మానవత్వాన్ని చంపేస్తుంది. దీనికి విరుగుడు మంత్రం- రెండక్షరాల ప్రేమ.
ద్వేషాన్ని జయించే ఏకైక అహింసా ఆయుధం.. ఈ ప్రపంచంలో ‘ప్రేమ’ ఒక్కటే. దీనితో లోకాన్ని జయించవచ్చు. మనం చేసే పనిలో విజయం సాధించవచ్చు. మనల్ని మనం జయించవచ్చు.
     అసూయ అన్నది ఒక బలహీనత, ఒక వక్రగుణం. అసూయతో మనుషులు కృంగిపోతారు.అసూయ విషంలాగా పనిచేసి మానసిక అరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.అసూయ సుగుణాలన్నింటినీ, నాశనం చేస్తుంది. లక్ష్మీ, సర్వస్వతి, పార్వతిమాతలు, మహాపతివ్రత అయిన అనసూయపై ఈర్ష్య అసూయ ద్వేషాలను పెంచుకున్నారు.దుర్యోధనునిలో బలం, ఉత్సాహం, శక్తి సామర్థ్యం, ప్రజ్ఞ ఉన్నా అసూయ అనే దుర్గణం వాటన్నింటినీ నాశనం చేసింది. అసూయవల్ల మనిషికి చిత్తశాంతి ఉండదు

మనిషి స్వార్థము,ద్వేషము మరియు అసూయలను ఎప్పుడైతే జయిస్తాడో అప్పుడే మనిషి దేవుడుగా మారుతాడు. అందు వలన మన పుట్టుకకు ఒక సార్థకత ఉండాలి. మనిషి పుట్టుక  బ్రతకాడానికి అనుభవించడానికి యిచ్చిన జన్మ కాదు. . నలుగురికి ఆదర్శప్రాయంగా, సమాజశ్రేయస్సుకు ఉపయోగకారిగ వుండాలి. అప్పుడే మానవుడిగా పుట్టినందుకు మన జన్మ తరిస్తుంది.

బాల్యం

          ప్రతి మనిషికీ బాల్యం... కౌమారం... యవ్వనం... వృద్ధాప్యం- అనేవి జీవితంలో ప్రధాన దశలు. బాల్యం ఓ తీపి జ్ఞాపకం...ఓ పూల వనం ప్రతి మనిషి జీవితానికి బాల్యం ఉదయించే సూర్యుని తొలిపద్దులాంటిది. ఈ చిన్న పసి హృదయములో పడే ముద్రలే భవిష్యత్తుకు పునాది. భాల్య దశ నిర్మలమైనది మరియు అద్భుతమైనది. మొక్కగా వున్నప్పుడే వంచాలి. అలగే చెట్టు అయిన తర్వాత వంచడం ఎవరి వలన వీలుకాదు.పిల్లల పెంపకములో తల్లి పాత్ర చాలా గొప్పది.

         నా జీవితముపై అమ్మ ముద్ర పడింది.నాన్న ఉద్యోగరీత్య తిరగడము వలన ,అతని ప్రభావము తక్కువే.

         మా అమ్మ పేరు నరసమ్మ,తండ్రిగారి పేరు నరసింహులు. మాది కడప .నేను 27-02-1962 న నేను రెండవ సంతానముగా జన్మించాను. మా కులదైవము పావన నరసింహస్వామి కావడంతో నా పేరు కూడ స్వామి పేరు కలిసేలా పావన నరసింహమూర్తి అని పెట్టారు. అందువలననే ఆ స్వామి ప్రభావము కూడా ఎక్కువ. ప్రస్తుతము ఆయన సేవే నా జీవితము,ఊపిరి. నా భాల్యం ఎక్కువ భాగము కడప పట్టములో గడిచింది.

విద్యాభ్యాసము

నా బాల్యం ఎక్కువ భాగం కడపలోను,నాన్న గారి ఉద్యోగరీత్య పులివెందులకు పోవలసి వచ్చింది. అక్కడకూడ కొంత కాలం వున్నాము. అందువలన నా విద్య ఒకట తరగతి నుంచి పదవ తరగతి వరకు ఈ రెండు పట్టణాలలో గడిచింది. తర్వాత ఐ.టి.ఐ.చేశాను. ఐ.టి.ఐ. తరువాత సి.టి.ఐ. చేశాను. హరినాధ్ గారు( ప్రస్తుతము జిల్లా జడ్జిగా వున్నారు) మంచి మిత్రులు. చదువులో పోటిపడేవారం. పులివెందులలొ వున్నపుడు గూడురు చలమయ్య గారు మంచి మిత్రుడయ్యాడు. అమ్మ అనారోగ్యముగా వున్న సమయములో చాలా సేవలందించారు. వారి రుణం తీర్చుకోలేనిది.అలాగే దస్తగిరి(ACTO),గురుమూర్తి (Junior College Principal),వెంకట సుబ్బారెడ్డి (వైద్యులు) మరియు జయరాజులు నాకు బాల్యంలో మంచి మిత్రులు. ఇప్పటికి కూడా మంచి మిత్రులుగా వున్నాము.

ఉద్యోగ ప్రస్థానం

     బనగానపల్లెలోని ఐ.టి.ఐ.లో instructor గా చేరాను. అక్కడ అప్పటికి ఎవరు పరిచయము లేరు . ప్రిన్సిపాల్ లక్ష్మినారాయణరెడ్డి ఇల్లు చూసుకునే వరకు అతని ఇంట్లొ వుండమన్నారు. క్లర్కుగా పనిచేస్తున్న ప్రసాదరావు ఇల్లు చూపించారు. అలా రంగయ్యశెట్టితొ కూడ పరిచయము అయ్యింది. ఆ పరిచయము మరింత బలపడి 1986 నుంచి ఇప్పటివరకు కొనసాగుతునేవున్నది.
     అక్కడ పనిచేస్తున్న సమయములోనే MA, B.Ed పూర్తి చేసి, ప్రభుత్వ పాఠశాలలొ ప్రధానోపాధ్యాయులుగా పనిచేశాను. నాకు శిశువు పుట్టక మునుపే గతించడం, కొంతకాలానికి భార్య వియోగము తర్వాత తండ్రిగారు కూడ కాలం చేశారు. మరో వివాహము చేసుకోకుండ తల్లి గారిని సేవ చేసుకుంటూ కాలం గడపసాగాను. నా ముక్కుసూటి వ్యవహారము వలన నేను ఎక్కడ యిమడలేకపోయాను. పరిస్థితులకు అనుగునంగా మారలేకపోయాను.ఉద్యోగాలకు రాజీనామా చేసి, అటు వంటి సమయములొ దైవం పట్ల పూర్తిగా ఆకర్షితుడై, పావన నరసింహస్వామికి పరమ భక్తునిగా మారాను. ఉద్యొగరీత్య బనగానపల్లెకు వచ్చి,బనగానపల్లెతొ విడదీయరాని అనుబంధాన్ని పెంచుకున్నాను. భార్య,తల్లిదండ్రులు స్వర్గస్థులైన తర్వాత ఒంటిరైపోయాను. అప్పుడు నరసింహస్వామికి మరింత చేరువయ్యాను. బనగానపల్లె వదిలి ఎక్కడెక్కడొ తిరిగాను. మరల ఒక బలమైన సంకల్ప దీక్షతో తిరిగి వచ్చాను.

దేవాలయ నిర్మాణ భీజము

     నేను తరచు అహోబిలం నరసింహస్వామిని దర్శించుకుంటువుంటాను. అలాగే మా ఇలవేల్పు పాములేటి పావన నరసింహస్వామిని కూడ పాములేటికి పోయి దర్శించుకుంటువుంటాను. ఈ యననే పాములేటయ్య అని కూడా వాడుకలో పిలుస్తున్నారు. ఒకసారి యిలాగే పాములేటికి వెళ్ళి స్వామిని దర్శించుకొని తిరుగు ప్రయాణమయ్యాను.ఆ సంధర్బములోనే పాములేటయ్య స్వామి సన్నిధిలో నా మనస్సులో స్వామివారికి గుడికట్టాలన్న ఒక భీజము పడింది. అప్పుడు నాతో ఒక అజ్ఞాత వ్యక్తి పరిచయమయ్యాడు. సామాన్యముగా నేను అందరిని పలకరిస్తుంటాను. నాకు తెలిసింది నవ్వుతూనే సమాదానము యిస్తుంటాను. అలాగే నాకు నచ్చని విషయము ఏది చేయను. ఆ కోవలోనే ఆ వ్యక్తితో మాటమాట కలిసింది. అలా మాట్లాడుకుంటూ నడుచుకుంటువస్తున్నాము.

     ఎన్నో విషయాలు మా మధ్య చర్చకు వచ్చాయి. ఆ సందర్భములోనే నా మనసులోని సంకల్ప భీజాన్ని చెప్పాను. అందుకు ఆ వ్యక్తి మంచి పనికి ఆలస్యమెందుకు పని ప్రారంభించు అంతా ఆ నరసింహస్వామియే చూసుకుంటాడని గట్టిగ చెప్పాడు. కాని,సంశయము నన్ను వెంటాడుతునేవుంది. గుడి కట్టడమంటే మాట కాదు. స్థలము కావాలి. ఏ ఊరులో నిర్మాణము చేయాలి? దానికి కావలసిన ధనం సమకూర్చుకోవాలి. నాకా! ఉద్యోగముతో వచ్చే జీతము తప్ప, సంపాదన పరంగా వేరే వనరులు లేవు. ఏదో పెద్దలు యిచ్చిన ఆస్తి అమ్ముకొని,దానిమీదవచ్చే బ్యాంకు వడ్డితో జీవనము సాగిస్తున్నాను. ఇలా యీ ఆలోచనలు నా మెదడును తొలుస్తున్నాయి. మళ్ళీ ఆ అజ్ఞాత వ్యక్తి ఆలోచనలు దైవం మీద బారం వేసి వెంటనే కార్యముఖున్నికామని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు.

స్థలాన్వేషణ

     స్వామిపై పూర్తి భారం వేశాను. రంగాన్ని సిద్ధముచేసుకున్నాను. బనగానపల్లెతో ఏర్పడిన అనుబందము కారణంగా ఇక్కడే గుడి నిర్మాణము చేయాలని తీర్మానించుకున్నాను. స్థలాన్వేషణలో పడ్డాను. ఈ విషయమై చాలా మంది పెద్దలు,మిత్రులను సంప్రదించాను. బ్రహ్మగారు కాలజ్ఞానము రాసిన రవ్వలకొండను సూచించారు. నేను కూడ ఆవైపు మొగ్గుచూపాను. స్థలసేకరణకు MRO ను కలిసాను. పట్టువదలని విక్రమార్కుడిలా వెంటపడి కొంత స్థలాన్ని పొందగలిగాను. ఇక గుడి నిర్మాణానికి శ్రీకారం చుట్టాను. ఎందరొ నా వెంట నడిచారు. నిర్మాణ కార్యక్రమములో తమ వంతు సాయం చేశారు. చివరికి నరసింహస్వామి తన ప్రేరణతో గర్బగుడి నిర్మాణము పూర్తిచేయించుకున్నాడు. నాతో నడిచింది,నా సంకల్పానికి ధైర్యాన్నిచ్చింది ఎవరో కాదు ఆ అజ్ఞాతవ్యక్తి రూపములో వచ్చింది సాక్షాతు పాములేటి పావన నరసింహస్వామియేయని నాకు అపుడనిపించింది.

దైవకార్యము

     అప్పుడు మిత్రులు కూడా ప్రోత్స హించడం తో 06-02-2014 న రథ సప్తమి నాడు డాక్టర్ వై.వి. సూర్య ప్రకాష్ రెడ్డి గారు మరియు డాక్టర్ సి.శ్రీనివాసులు గారు,శ్రీ. జి.వెంకట కృష్ణ య్య,మరియు వారి ధర్మ పత్ని శ్రీమతి సుశీల గారు,శ్రీ గోపాల్ దాస్ గారు & శ్రీ పెరుసోముల రామమోహన్ స్వామి గారి సమక్షం లో సుజాతమ్మ గారి సమక్షములో,పుట్టు శిల బయట పడటం,పాము పుట్ట,అందులో ఎనిమిది అడుగుల పాము, మూడు అడుగుల పాము, కనిపించడం, నిర్మాణం మొదలవగానే రాళ్ళు తోలు ట్రాక్టర్ డ్రైవర్ మొదట భగవానుని చేత సురక్షితముగా అనుగ్రహి హింప బడటం , తక్కువ లోతు లోనే బోరు లో నీరు పడటం , పుట్టుశిల ను దర్శించు కొను వారికి వారి వారి ఇష్ట దైవం లా వారికి కనిపించడం, అంధు రాలికి చూపు రావడం, నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, సంతాన భాగ్యం కల్పించడం భూమి పూజ నుండే అఖండ జ్యోతి తో పూజ లందు కొంటూ ప్రతిష్టకు ముందే ఎందరికో ఎన్నో విధములు గా స్వామి వారు మహిమలు చూపి అనుగ్రహించారు.19-08-2017 న స్థిర ప్రతి ష్టు లైనారు.అజ్ఞానవ్యక్తి మాటల చైతన్యముతోను, స్వామివారి ఆశీర్వాధబలం,భక్తులు,దాతల సహకారముతో నేను ప్రారంభించిన యజ్ఞము పూర్తిచేయగలిగాను

పుట్టుశిల

ఇక్కడ మనం ప్రత్యేక విశేషము తెలుసుకోవాలి.. గుడి నిర్మాణ సమయములో త్రవ్వకాలలొ ఒక పెద్దశిల బయటపడింది. ఇది సుజాతమ్మగారు గమనించారు. ఆ శిలలో తమ మనసులోని ఇష్టరూపములు కనిపించడము స్వామివారి లీలగా అందరు చెప్పుకున్నారు. అలా అప్పటినుంచి అందరిని ఆకర్షిస్తూ స్వామివారి లీల విశేషంగా నిలిచింది.

స్వామిగారికి జరుగు ప్రత్యేక పూజా కార్యక్రమాలు

19-08-2019 న ప్రతిష్ట అయినప్పటి నుంచి ఈ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి.
1. ప్రతి స్వాతికి స్వామివారికి ప్రత్యేక పూజలు మరియు అన్నదాన కార్యక్రమము జరుగుతున్నది.
23-08-2019 కృష్ణాష్టమి రొజున 'రవ్వలకొండ శ్రీశ్రీశ్రీ చెంచులక్ష్మీ సమేత పావన నరసింహస్వామి స్వాతి మనొభీష్ట పూజ ' అనే విశిష్ట పూజను స్వామివారి కృపతో భక్తులకు పరిచయము చేస్తున్నాము. ఈ విశేష పూజావ్రతాన్ని ప్రతి స్వాతికి సామూహికముగా నిర్వహిస్తాము. ఈ పూజా విదానాన్ని పుస్తకరూపములో భక్తులకొరకు అందుబాటులోకి తీసుకువస్తున్నాము. భక్తులు ఈ పూజా విదానాన్ని యీ పుస్తక సయాయముతో ఇంటిలోనే నిర్వహించుకోవచ్చును.
2. 17-08-2018 న ధ్వజస్థంభ ప్రతిష్ఠ మరియు ప్రథమ శ్రీ వారి కళ్యాణోత్సవము అంగరంగ వైభవముగా జరిగినది.
ప్రతి సంవత్సరము ఆగష్తులో స్వామివారి కళ్యాణము నిర్వహిస్తున్నాము.
3. అంతేకాకుండ భక్తుల అభీష్టముమేరకు వారి వారికి సంబందించిన పుట్టినరోజు,వివాహదినము మొదలగు ప్రత్యేక రోజూలలో స్వామివారికి ప్రత్యేక పూజలు అన్నదానము జరుగుతున్నాయి.