.
( ఇక్ష్వాకు వంశము. )
.
లేదా సూర్య వంశము భారతదేశాన్ని ఏలిన పౌరాణిక రాజవంశము. సూర్య వంశం గురించి పురాణాల లో అనేక మార్లు చెప్పబడింది. సూర్యవంశీయుల కులగురువు వశిష్ట మహర్షి. అయోధ్యను రాజధానికి ఏలిన వీరి వంశ క్రమములో
హరిశ్చంద్రుడు,
దిలీపుడు,
రఘువు,
శ్రీరాముడు వంటి చక్రవర్తుల పాలన అనుసరణీయం అని పురాణాల ద్వారా తెలుస్తోంది.. ఈ వంశమునకు
.
ఆదిపురుషుడు వివస్వంతుడు.
రెండవ వాడు వైవస్వత మనువు,
మూడవ వాడు ఇక్ష్వాకుడు.
ఈయన పేరు మీదుగానే వంశానికి ఇక్ష్వాకు వంశమని పేరు వచ్చింది. ఈ ఇక్షవాకుల వంశంలో జన్మించిన శ్రీరాముడు దేవుడుగా మానవాళికి అనుసరనీయుడుగా పూజలు అందుకుంటున్నాడు. త్రిమూర్తులలో ఒకరు.. స్థితి కారుడైన విష్ణుమూర్తి మానవుడిగా జన్మించి.. మానవ జన్మ విశిష్టతను.. ప్రపంచానికి చాటి చెప్పాడు. కొడుకుగా, అన్నగా, భర్తగా రాజ్య పాలకుడుగా రాముడు చేసిన ప్రయాణం.. అనుసరణీయం.. అందుకే మానవుడైన శ్రీరాముడు… గుడి లేని వీధి ఉండదు అంటే అతిశయోక్తి కాదు.. అటువంటి రాముడు జన్మించిన వంశ వృక్షం గురించి వశిష్టుల వారు సీత స్వయంవరంలో చెప్పినది.. తెలుసుకుందాం..
.
అవ్యక్త స్వరూపమునందు పరబ్రహ్మము వుండేది
ఆ పరబ్రహ్మము అంటే విష్ణువు నాభి నుంచి “చతుర్ముఖ బ్రహ్మ” వచ్చారు.
ఆ బ్రహ్మ నుండి
“మరీచి ”
మరీచి నుండి “
కస్యపుడు”
ఈయన ప్రజాపతిగా ప్రసిద్ధి
కస్యపుడు నుండి”
సూర్యనారయణ “మూర్తి అప్పటినుంచి ఈ వంశానికి సూర్య వంశం అనే పేరువచ్చింది.
.
సూర్యుడు కొడుకు మనువు.
మనువు కొడుకు ఇక్ష్వాకువు (ఈయనే మొట్టమొదటి సారిగా అయోద్యా నగరాన్ని రాజధానిగా పరిపాలన ప్రారంభించాడు. అప్పటి నుంచి ఈ వంశాన్ని ఇక్ష్వాకు వంశం అని కూడ అంటారు)
.
ఇక్ష్వాకువు కొడుకు కుక్షి.
కుక్షి కొడుకు వికుక్షి.
వికుక్షి కొడుకు బాణుడు.
బాణుడు కొడుకు అనరణ్యుడు.
అనరణ్యుడు కొడుకు పృధువు.
పృధువు కొడుకు త్రిశంఖుడు.
త్రిశంఖుడు కొడుకు దుంధుమారుడు.(లేదా యువనాశ్యుడు)(త్రిశంఖు స్వర్గ స్థాపనకు కారకుడు)
దుంధుమారుడు కొడుకు మాంధాత.(గొప్పగా పాలించి చక్రవర్తి అయ్యాడు)
మాంధాత కొడుకు సుసంధి.
సుసంధి కొడుకు ధృవసంధి.
ధృవసంధి కొడుకు భరతుడు.
భరతుడు కొడుకు అశితుడు.
అశితుడు కొడుకు సగరుడు.
సగరుడు కొడుకు అసమంజసుడు.
అసమంజసుడు కొడుకు అంశుమంతుడు.
అంశుమంతుడు కొడుకు దిలీపుడు. (గొప్ప చక్రవర్తి)
దిలీపుడు కొడుకు భగీరధుడు. (పరమ పావనీ గంగ ని భువి కి దింపిన గొప్పవాడు. ఈయన పేరు విన్నంత మాత్రాన పాపం నశిస్తుంది. అందుకే గంగని “భాగీరధీ” అని కూడా అంటారు )
భగీరధుడు కొడుకు కకుత్సుడు.
కకుత్సుడు కొడుకు రఘువు. (ఈయన పేరు మీదే రఘు వంశం అని కూడా పిలుస్తారు)
రఘువు కొడుకు ప్రవుర్ధుడు.
ప్రవుర్ధుడు కొడుకు శంఖనుడు.
శంఖనుడు కొడుకు సుదర్శనుడు.
సుదర్శనుడు కొడుకు అగ్నివర్ణుడు.
అగ్నివర్ణుడు కొడుకు శ్రీఘ్రవేదుడు.
శ్రీఘ్రవేదుడు కొడుకు మరువు.
మరువు కొడుకు ప్రశిష్యకుడు.
ప్రశిష్యకుడు కొడుకు అంబరీశుడు.
అంబరీశుడు కొడుకు నహుషుడు.
నహుషుడు కొడుకు యయాతి.
యయాతి కొడుకు నాభాగుడు.
నాభాగుడు కొడుకు అజుడు.
అజుడు కొడుకు ధశరథుడు.
ధశరథుడు కొడుకు రాముడు.
రాముడి కొడుకు లవ కుశలు]
కుశుని ద్వారా రఘువంశము విస్తరించినది. ఇది రాముడి వంశ వృక్షం..
ఈ శ్రీ రాముడి వంశ పరంపర విన్నా చదివినా , పుణ్యం అని పెద్దలు చెబుతారు.
.