తిరుప్పావై 2 వ పాశురం 

వ్రత నియామాలు

ధనుర్మాసం లో గోదాదేవి 30 పాశురాలలో రెండవ రోజు

ఆండాళ్ తిరువడిగలే శరణం :

మరి మొదటి పాటలో తామేమి పొందదలచి ఈ వ్రతం చేయడలచుకున్నారో,ఈ వ్రతము నకు సాయపడు వారు ఎవరో, ఆ వ్రతమును జేయుటకు తమకుగా అధికారమేమో వివరించినారు. ఈ దిన ఒక కార్యము చేయ దలచుకున్నప్పుడు ముందుగా తెలుసుకోవల సినవి ఆ మూడే. ఏ ఫలము కాంక్షించి ఈ కార్యము చేయుచున్నామో తెలిసి ఫలము తప్పక పొందదగినదేఅని తెలిసిన కాని కార్యమునందేవరికిని ప్రవృత్తి కలగదు. ఆ ఫలము మంచిదే అని తెలిసిననూ చేయగలమా ,చేయలేమా , మద్యలో శక్తి లేక మాని నవ్వులపాలగుదురు. దానికి కావలసిన పరికరాలు సమకుర్చుకో గలమో లేమో నిర్ణయించుకోవాలి ఆ కార్యము చేయుటకు తనకు గల అధికారాన్ని తెలుసుకోవాలి .

ఇవన్నీ సమకుర్చగలది కేవలము కృష్ణుడే అని తెలిసిన నీకు అన్ని సమకురినట్లే.దీనికి శ్రీ కృష్ణుడే ఉపాయం , శ్రీ కృష్ణుని పాడుటమే ఫలము విశ్వసించి వానిని కై0కర్యము రుచిగాగల నియమాలుందున ? అసలు నియమాలు పాటించాలా? వారు గొల్లపిల్లలు కదా ? వారికి నియమాలు ఎలా తెలియును?వీటన్నిటికీ ఒకటే ఉపాయమున్నది. భగవంతునిపై భక్తి , పరిసుద్దమైన మనసు కలిగిన చాలు .కాని భక్తులు భాగాత్స మ్రుద్దికి భగవద్భక్తులు ఆనందముగా కొన్ని నియమాలు పాటి0చుదురు.
వానిని ఈ పాశురములో వివరించుదురు.

పాశురం

వైయత్తు వాళ్ వీర్గాళ్! నాముం నం పావైక్కు
శెయ్యుం కిరిశైగళ్ కేళీరో పాఱ్కడలుళ్
పైయత్తుయిన్ఱ పరమనడి పాడి
నెయ్యుణ్ణోం పాలుణ్ణోం నాట్కాలే నీరాడి
మైయిట్టెళుదోం మలరిట్టు నాం ముడియోమ్
శెయ్యాదన శెయ్యోం తీక్కుఱళై చ్చెన్ఱోదోమ్
ఐయముం పిచ్చైయుం ఆందనైయుం కైకాట్టి
ఉయ్యుమాఱెణ్ణి ఉగందేలోర్ ఎమ్బావాయ్

తాత్పర్యము :

శ్రీ కృష్ణుడు అవతరించిన కాలములో పుట్టి దుః ఖమగు ఈ ప్రపంచములో కుడా ఆనందమునే అనుభావిమ్చుచున్న వారలారా ! మేము మావ్రతమునకు చేయు క్రియాకలాపము వినుడు:-

పాలసముద్రములో ద్వానికాకుండా మెల్లగా పడుకోనివున్న ఆ పరమ పురుషుని పాదములకు మంగళము పాడదేము . ఈ వ్రతసమయములో నేతిని కాని పాలను కాని మేము ఆరగింపము . తెల్లవారు జామున స్నానములు చేసెదము . కంటికి కాటుక పెట్టుకోము . కొప్పులో పువ్వులు ముడువము. మా పెద్దలు ఆచరించని పనులు మేము ఆచరించము . ఇతరులకు బాద కలిగించెపనులు మేము చేయము. అసత్యాలాడము. ఎచ్చటా పలుకము.ఙానులకు అధిక ధన ధాన్యాధులు తో సత్కరించుదుము. బ్రహ్మచారులకు సన్యాసులకు భిక్షలను ఉంచుధుము. మీము ఉజ్జీవించు విధముగానీ పర్యాలోచన చేసికొనెదము. దీనిని అంతావిని మీరానదింప కోరుచున్నము.

అవతారిక :

ఈ మాలికలో గోదాదేవి వ్రతమును చేయటా నికి కొన్ని నియమాలను వివరిస్తోంది. శ్రీ కృష్ణునికి అంకితంకావటమే ముఖ్యమైన నియమం. భక్తిలేనిదే వ్రతం చేసినా ఫలం దక్కదు. శ్రీకృష్ణునికి అంకితం కావటం ఆయన అనుగ్రహం మాత్రమే కోరటం, ఇవే ముఖ్యం. ప్రత్యేకమైన విధులూ, నియమా లూ అంటూ ఏమీలేవు. శ్రీ కృష్ణుని యందు ప్రీతితో యేది చేస్తే అవేనియమాలు అంటుంది గోద.

2వ మాలిక

(మధ్యమావతి రాగము - ఆదితాళము)

ప.. వినుడోయమ్మ! వినుడు
భూమిని సుఖముల బడయ దలచిన
భాగ్యవతులార! వినుడు
వినుడోయమ్మ!వినుడు
అ..ప.. మన నోముకుచేయదగిన కృత్యముల మేము చెప్పెదము వినుడు
వినుడోయమ్మ వినుడు
1. చ.. పాలకడలిపై పవళించిన స్వామి - పరమాత్ముని పాదముల కామించి 
పాడిపాడి ఉజ్జీవించు విధమెరిగి - పరమ పవిత్రులె కావలె వినుడు
2. చ... పూజ్యులకు భిక్ష, పేదకు దానము - పొసగ జేయవలె నిరతమును
సృతమానము, పాలను ద్రావము - పగటుగా కనుక కాటుక దీర్పము
3 చ.. ప్రాతఃకాలము నీరాడుదుము - పగటుగా కనుక కాటుక దీర్పము
పూవులతోడ కురులనే ముడువము
పెద్దలు చేయని పనులను చేయము
మిత్రం చేయగరాని పనలనే చేయము
చేటు మాటలను చెప్పగబోము
చేరదలచు నా గమ్యము వీడము
చేరగ శ్రీ పతి వేడుకొందుము
వినుడోయమ్మ! వినుడు

విశెషార్ధము:- తమతో వ్రతమునకు రాబోవుచున్న గోపికలను మన్నారాయణఉద్దెసించి తామీ వ్రతములొ చెయవలసినవి , చెయకుడనివి ఇందు వివరించుకున్నరు.

*ధనుర్మాసం లో గోదాదేవి 30 పాశురాలలో రెండవ రోజు*

*తిరుప్పావై 2 వ పాశురం -వ్రత నియామాలు*

*ఆండాళ్ తిరువడిగలే శరణం 

మరి మొదటి పాటలో తామేమి పొందదలచి ఈ వ్రతం చేయడలచుకున్నారో ,ఈ వ్రతమునకు సాయపడు వారు ఎవరో, ఆ వ్రతమును జేయుటకు తమకుగా అధికారమేమో వివరించినారు. ఈ దిన ఒక కార్యము చేయ దలచుకున్నప్పుడు ముందుగా తెలుసుకోవలసినవి ఆ మూడే. ఏ ఫలము కాంక్షించి ఈ కార్యము చేయుచున్నామో తెలిసి ఫలము తప్పక పొందదగినదేఅని తెలిసిన కాని కార్యమునందేవరికిని ప్రవృత్తి కలగదు. ఆ ఫలము మంచిదే అని తెలిసిననూ చేయగలమా ,చేయలేమా , మద్యలో శక్తి లేక మాని నవ్వులపాలగుదురు. దానికి కావలసిన పరికరాలు సమకుర్చుకో గలమో లేమో నిర్ణయించుకోవాలి ఆ కార్యము చేయుటకు తనకు గల అధికారాన్ని తెలుసుకోవాలి .

ఇవన్నీ సమకుర్చగలది కేవలము కృష్ణుడే అని తెలిసిన నీకు అన్ని సమకురినట్లే.దీనికి శ్రీ కృష్ణుడే ఉపాయం , శ్రీ కృష్ణుని పాడుటమే ఫలము విశ్వసించి వానిని కై0కర్యము రుచిగాగల నియమాలుందున ? అసలు నియమాలు పాటించాలా? వారు గొల్లపిల్లలు కదా ? వారికి నియమాలు ఎలా తెలియును?వీటన్నిటికీ ఒకటే ఉపాయమున్నది. భగవంతునిపై భక్తి , పరిసుద్దమైన మనసు కలిగిన చాలు .కాని భక్తులు భాగాత్స మ్రుద్దికి భగవద్భక్తులు ఆనందముగా కొన్ని నియమాలు పాటి0చుదురు.
వానిని ఈ పాశురములో వివరించుదురు.

*పాశురం:-*

వైయత్తు వాళ్ వీర్గాళ్! నాముం నం పావైక్కు
శెయ్యుం కిరిశైగళ్ కేళీరో పాఱ్కడలుళ్
పైయత్తుయిన్ఱ పరమనడి పాడి
నెయ్యుణ్ణోం పాలుణ్ణోం నాట్కాలే నీరాడి
మైయిట్టెళుదోం మలరిట్టు నాం ముడియోమ్
శెయ్యాదన శెయ్యోం తీక్కుఱళై చ్చెన్ఱోదోమ్
ఐయముం పిచ్చైయుం ఆందనైయుం కైకాట్టి
ఉయ్యుమాఱెణ్ణి ఉగందేలోర్ ఎమ్బావాయ్

*తాత్పర్యము 

శ్రీ కృష్ణుడు అవతరించిన కాలములో పుట్టి దుః ఖమగు ఈ ప్రపంచములో కుడా ఆనందమునే అనుభావిమ్చుచున్న వారలారా ! మేము మావ్రతమునకు చేయు క్రియాకలాపము వినుడు:-
పాలసముద్రములో ద్వానికాకుండా మెల్లగా పడుకోనివున్న ఆ పరమ పురుషుని పాదములకు మంగళము పాడదేము . ఈ వ్రతసమయములో నేతిని కాని పాలను కాని మేము ఆరగింపము . తెల్లవారు జామున స్నానములు చేసెదము . కంటికి కాటుక పెట్టుకోము . కొప్పులో పువ్వులు ముడువము. మా పెద్దలు ఆచరించని పనులు మేము ఆచరించము . ఇతరులకు బాద కలిగించెపనులు మేము చేయము. అసత్యాలాడము. ఎచ్చటా పలుకము.ఙానులకు అధిక ధన ధాన్యాధులు తో సత్కరించుదుము. బ్రహ్మచారులకు సన్యాసులకు భిక్షలను ఉంచుధుము. మీము ఉజ్జీవించు విధముగానీ పర్యాలోచన చేసికొనెదము. దీనిని అంతావిని మీరానదింప కోరుచున్నము.

*అవతారిక 

ఈ మాలికలో గోదాదేవి వ్రతమును చేయటానికి కొన్ని నియమాలను వివరిస్తోంది. శ్రీ కృష్ణునికి అంకితంకావటమే ముఖ్యమైన నియమం. భక్తిలేనిదే వ్రతం చేసినా ఫలం దక్కదు. శ్రీకృష్ణునికి అంకితం కావటం ఆయన అనుగ్రహం మాత్రమే కోరటం, ఇవే ముఖ్యం. ప్రత్యేకమైన విధులూ, నియమాలూ అంటూ ఏమీలేవు. శ్రీ కృష్ణుని యందు ప్రీతితో యేది చేస్తే అవేనియమాలు అంటుంది గోద.

*2వ మాలిక*

(మధ్యమావతి రాగము - ఆదితాళము)

ప.. వినుడోయమ్మ! వినుడు
భూమిని సుఖముల బడయ దలచిన
భాగ్యవతులార! వినుడు
వినుడోయమ్మ!వినుడు
అ..ప.. మన నోముకుచేయదగిన కృత్యముల మేము చెప్పెదము వినుడు
వినుడోయమ్మ వినుడు
1. చ.. పాలకడలిపై పవళించిన స్వామి - పరమాత్ముని పాదముల కామించి 
పాడిపాడి ఉజ్జీవించు విధమెరిగి - పరమ పవిత్రులె కావలె వినుడు
2. చ... పూజ్యులకు భిక్ష, పేదకు దానము - పొసగ జేయవలె నిరతమును
సృతమానము, పాలను ద్రావము - పగటుగా కనుక కాటుక దీర్పము
3 చ.. ప్రాతఃకాలము నీరాడుదుము - పగటుగా కనుక కాటుక దీర్పము
పూవులతోడ కురులనే ముడువము
పెద్దలు చేయని పనులను చేయము
మిత్రం చేయగరాని పనలనే చేయము
చేటు మాటలను చెప్పగబోము
చేరదలచు నా గమ్యము వీడము
చేరగ శ్రీ పతి వేడుకొందుము
వినుడోయమ్మ! వినుడు

*విశెషార్ధము:-*

తమతో వ్రతమునకు రాబోవుచున్న గోపికలను ఉద్దెసించి తామీ వ్రతములొ చెయవలసినవి , చెయకుడనివి ఇందు వివరించుకున్నరు.

?? *జై శ్రీ మన్నారాయణ* ??

Image may contain: 2 people