ఓం నమోనారయణాయ మంత్రం.mp3

విదేశీయుడు: స్వామి క్రిస్టియానిటీ స్థాపకులు ఎవరు?

స్వామి చిన్మయానంద: జీసస్

విదేశీయుడు: ఇస్లాం స్థాపకుడు ఎవరు?

స్వామి చిన్మయానంద: మహమ్మద్

విదేశీయుడు: హిందూ మత స్థాపకులు ఎవరు?

స్వామి చిన్మయానంద: సమాధానం ఇవ్వలేదు. మౌనంగా వుండిపోయారు.

విదేశీయుడు: అదేమిటి స్వామి మీ మతానికి స్థాపకులంటూ ఎవ్వరూ లేరా?

స్వామి చిన్మయానంద: హిందూ ధర్మానికి ప్రత్యేకించి ఒక్క స్థాపకుడు అంటూ ఎవరూ వుండరు. అందుకే ఇది మతం కాదు జీవన విధానం, ధర్మం., ఎందుకంటే ఇది వ్యక్తుల నుండి వచ్చిన జ్ఙ్ఞానం కాదు. నీవు అడిగినటువంటిదే నేను అడుగుతాను. సమాధానం చెప్పగలవా. కెమిస్ట్రీ స్థాపకులు ఎవరు, జువాలజీ స్థాపకులు ఎవరు? దీనికి నీ వద్ద ఖచ్చితమైన సమాధానం వుందా? వుండదు. అలాగునే ఈ సనాతన హిందూ ధర్మం కూడా ఎంతో మంది సైంటిస్టుల పరిశోధనల ఫలితమే. ఆ పరిశోధకులే మన ఋషులు, మునులు.

విదేశీయుడు: అపరాధభావంతో మిన్నకుండిపోయాడు.

స్వామి చిన్మయానంద: నువ్వు ఒక క్రిస్టియన్ ని అడిగితే బైబిల్ ఇస్తాడు. ఒక ముసల్మాను సోదరున్ని అడిగితే ఖురాన్ ఇస్తాడు. అదే హిందువుని అడిగితే తన గ్రంధాలయానికి ఆహ్వానిస్తాడు.
ఎందుకంటే ఇక్కడ వున్నది మితం కాదు… అనంతం…
హిందూ ఒక మతం కాదు ....భారతీయుల జీవన విధానం
హిందూ ధర్మం సనాతనమైనది

🙏👇సృష్టి రహస్య విశేషాలు👇🙏
-------------------------------------
1 సృష్టి ఎలా ఏర్పడ్డది
.
2 సృష్టి కాల చక్రం ఎలా నడుస్తుంది
.
3 మనిషిలో ఎన్ని తత్వాలున్నాయి
.
( సృష్ఠి ) ఆవిర్బావము
.
1 ముందు (పరాపరము) దీనియందు శివం పుట్టినది
2 శివం యందు శక్తి
3 శక్తి యందు నాధం
4 నాధం యందు బిందువు
5 బిందువు యందు సదాశివం
6 సదాశివం యందు మహేశ్వరం
7 మహేశ్వరం యందు ఈశ్వరం
8 ఈశ్వరం యందు రుద్రుడు
9 రుద్రుని యందు విష్ణువు
10 విష్ణువు యందు బ్రహ్మ
11 బ్రహ్మ యందు ఆత్మ
12 ఆత్మ యందు దహరాకాశం
13 దహరాకాశం యందు వాయువు
14 వాయువు యందు అగ్ని
15 ఆగ్ని యందు జలం
16 జలం యందు పృథ్వీ.
పృథ్వీ యందు ఓషధులు
17 ఓషదుల వలన అన్నం
18 ఈ అన్నము వల్ల నర మృగ పశు పక్షి స్థావర జంగమాదులు పుట్టినవి.

.
( సృష్ఠి ) కాల చక్రం
.
పరాశక్తి ఆదీనంలో నడుస్తుంది.
ఇప్పటివరకు ఏంతో మంది శివులు ఏంతోమంది విష్ణువులు ఏంతోమంది బ్రహ్మలు వచ్చారు ఇప్పటివరకు 50 బ్రహ్మలు వచ్చారు.ఇప్పుడు నడుస్తుంది 51 వాడు.
1 కృతాయుగం
2 త్రేతాయుగం
3 ద్వాపరయుగం
4 కలియుగం
నాలుగు యుగాలకు 1 మహయుగం.
71 మహ యుగాలకు 1మన్వంతరం.
14 మన్వంతరాలకు ఒక సృష్ఠి (ఒక కల్పం.)
15 సందులకు ఒక ప్రళయం (ఒక కల్పం)
1000 యుగాలకు బ్రహ్మకు పగలు (సృష్ఠి) .
1000 యుగాలకు ఒక రాత్రి (ప్రళయం.)
2000 యుగాలకు ఒక దినం.
ఇప్పుడు బ్రహ్మ వయస్సు 51 సం.
ఇప్పటివరకు 27 మహ యుగాలు గడిచాయి.
1 కల్పంకు 1 పగలు 432 కోట్ల సంవత్సరంలు.
7200 కల్పాలు బ్రహ్మకు 100 సంవత్సరములు.
14 మంది మనువులు.
ఇప్పుడు వైవస్వత మనువులో ఉన్నాం. శ్వేతవరాహ యుగంలో ఉన్నాం.
5 గురు భాగాన కాలంకు 60 సం
1 గురు భాగాన కాలంకు 12 సం
1 సంవత్సరంకు 6 ఋతువులు.
1 సంవత్సరంకు 3 కాలాలు.
1 రోజుకు 2 పూటలు పగలు రాత్రి
1 సం. 12 మాసాలు.
1 సం. 2 ఆయనాలు
1సం. 27 కార్తెలు
1 నెలకు 30 తిధులు
27 నక్షత్రాలు - వివరణలు
12 రాశులు
9 గ్రహాలు
8 దిక్కులు
108 పాదాలు
1 వారంకు 7 రోజులు
పంచాంగంలో 1 తిధి. 2 వార. 3 నక్షత్రం. 4 కరణం. 5 యోగం.
.
సృష్ఠి యావత్తు త్రిగుణములతోనే ఉంటుంది
.
దేవతలు జీవులు చెట్లలో అన్ని వర్గంలలో మూడే గుణములు ఉంటాయి.
1 సత్వ గుణం
2 రజో గుణం
3 తమో గుణం
.
( పంచ భూతంలు ఆవిర్భావం )
,
1 ఆత్మ యందు ఆకాశం
2 ఆకాశం నుండి వాయువు
3 వాయువు నుండి అగ్ని
4 అగ్ని నుండి జలం
5 జలం నుండి భూమి అవిర్బవించాయి.
.
5 ఙ్ఞానేంద్రియంలు
5 పంచ ప్రాణంలు
5 పంచ తన్మాత్రలు
5 ఆంతర ఇంద్రియంలు
5 కర్మఇంద్రియంలు = 25 తత్వంలు
.
1 ( ఆకాశ పంచికరణంలు )
.
ఆకాశం - ఆకాశంలో కలవడం వల్ల ( జ్ఞానం )
ఆకాశం - వాయువులో కలవడం వల్ల ( మనస్సు )
ఆకాశం - అగ్నిలో కలవడం వల్ల ( బుద్ది )
ఆకాశం - జలంతో కలవడంవల్ల ( చిత్తం )
ఆకాశం - భూమితో కలవడంవల్ల ( ఆహంకారం ) పుడుతుతున్నాయి

2( వాయువు పంచీకరణంలు )
.
వాయువు - వాయువుతో కలవడం వల్ల ( వ్యాన)
వాయువు - ఆకాశంతో కలవడంవల్ల ( సమాన )
వాయువు - అగ్నితో కలవడంవల్ల ( ఉదాన )
వాయువు - జలంతో కలవడంవల్ల ( ప్రాణ )
వాయువు - భూమితో కలవడంవల్ల ( అపాన ) వాయువులు పుడుతున్నాయి.

3 ( అగ్ని పంచీకరణములు )
.
అగ్ని - ఆకాశంతో కలవడంవల్ల ( శ్రోత్రం )
అగ్ని - వాయువుతో కలవడంవల్ల ( వాక్కు )
అగ్ని - అగ్నిలో కలవడంతో ( చక్షువు )
అగ్ని - జలంతో కలవడంతో ( జిహ్వ )
అగ్ని - భూమితో కలవడంతో ( ఘ్రాణం ) పుట్టెను.

4 ( జలం పంచికరణంలు )
.
జలం - ఆకాశంలో కలవడంవల్ల ( శబ్దం )
జలం - వాయువుతో కలవడంవల్ల ( స్పర్ష )
జలం - అగ్నిలో కలవడంవల్ల ( రూపం )
జలం - జలంలో కలవడంవల్ల ( రసం )
జలం - భూమితో కలవడం వల్ల ( గంధం )పుట్టెను.

5 ( భూమి పంచికరణంలు )
.
భూమి - ఆకాశంలో కలవడంవల్ల ( వాక్కు )
భూమి - వాయువుతో కలవడం వల్ల ( పాని )
భూమి - అగ్నితో కలవడంవల్ల ( పాదం )
భూమి - జలంతో కలవడంతో ( గూహ్యం )
భూమి - భూమిలో కలవడంవల్ల ( గుదం ) పుట్టెను.
.
( మానవ దేహ తత్వం ) 5 ఙ్ఞానేంద్రియంలు
.
1 శబ్ద
2 స్పర్ష
3 రూప
4 రస
5 గంధంలు.
.
5 ( పంచ తన్మాత్రలు )
.
1 చెవులు
2 చర్మం
3 కండ్లు
4 నాలుక
5 ముక్కు
.

5 ( పంచ ప్రాణంలు )
,
1 అపాన
2 సామనా
3 ప్రాణ
4 ఉదాన
5 వ్యాన
.
5 ( అంతఃర ఇంద్రియంలు ) 5 ( కర్మేంద్రియంలు )
,
1 మనస్సు
3 బుద్ది
3 చిత్తం
4 జ్ఞానం
5 ఆహంకారం
.
1 వాక్కు
2 పాని
3 పాదం
4 గుహ్యం
5 గుదం
.
6 ( అరిషడ్వర్గంలు )
,
1 కామం
3 క్రోదం
3 మోహం
4 లోభం
5 మదం
6 మాత్సర్యం
.
3 ( శరీరంలు )
,
1 స్థూల శరీరం
2 సూక్ష్మ శరీరం
3 కారణ శరీరం
.
3 ( అవస్తలు )
,
1 జాగ్రదావస్త
2 స్వప్నావస్త
3 సుషుప్తి అవస్త
.
6 ( షడ్బావ వికారంలు )
,
1 ఉండుట
2 పుట్టుట
3 పెరుగుట
4 పరినమించుట
5 క్షిణించుట
6 నశించుట
.
6 ( షడ్ముర్ములు )
,
1 ఆకలి
2 దప్పిక
3 శోకం
4 మోహం
5 జర
6 మరణం

.7 ( కోశములు ) ( సప్త ధాతువులు )
,
1 చర్మం
2 రక్తం
3 మాంసం
4 మేదస్సు
5 మజ్జ
6 ఎముకలు
7 శుక్లం
.
3 ( జీవి త్రయంలు )
,
1 విశ్వుడు
2 తైజుడు
3 ప్రఙ్ఞుడు
.
3 ( కర్మత్రయంలు )
,
1 ప్రారబ్దం కర్మలు
2 అగామి కర్మలు
3 సంచిత కర్మలు
.
5 ( కర్మలు )
,
1 వచన
2 ఆదాన
3 గమన
4 విస్తర
5 ఆనంద
.
3 ( గుణంలు )
,
1 సత్వ గుణం
2 రజో గుణం
3 తమో గుణం
.
9 ( చతుష్ఠయములు )
,
1 సంకల్ప
2 అధ్యాసాయం
3 ఆభిమానం
4 అవధరణ
5 ముదిత
6 కరుణ
7 మైత్రి
8 ఉపేక్ష
9 తితిక్ష
.
10 ( 5 పంచభూతంలు పంచికరణ చేయనివి )
( 5 పంచభూతంలు పంచికరణం చేసినవి )
.
1 ఆకాశం
2 వాయువు
3 ఆగ్ని
4 జలం
5 భూమి
.
14 మంది ( అవస్థ దేవతలు )
,
1 దిక్కు
2 వాయువు
3 సూర్యుడు
4 వరుణుడు
5 అశ్వీని దేవతలు
6 ఆగ్ని
7 ఇంద్రుడు
8 ఉపేంద్రుడు
9 మృత్యువు
10 చంద్రుడు
11 చతర్వకుడు
12 రుద్రుడు
13 క్షేత్రజ్ఞుడు
14 ఈశానుడు
.
10 ( నాడులు ) 1 ( బ్రహ్మనాడీ )
,
1 ఇడా నాడి
2 పింగళ
3 సుషుమ్నా
4 గాందారి
5 పమశ్వని
6 పూష
7 అలంబన
8 హస్తి
9 శంఖిని
10 కూహు
11 బ్రహ్మనాడీ
,
10 ( వాయువులు )
,
1 అపాన
2 సమాన
3 ప్రాణ
4 ఉదాన
5 వ్యాన
.
6 కూర్మ
7 కృకర
8 నాగ
9 దేవదత్త
10 ధనంజమ
.
7 ( షట్ చక్రంలు )
,
1 మూలాధార
2 స్వాదిస్థాన
3 మణిపూరక
4 అనాహత
5 విశుద్ది
6 ఆఙ్ఞా
7 సహస్రారం
.
( మనిషి ప్రమాణంలు )
,
96 అంగుళంలు
8 జానల పోడవు
4 జానల వలయం
33 కోట్ల రోమంలు
66 ఎముకలు
72 వేల నాడులు
62 కీల్లు
37 ముారల ప్రేగులు
1 సేరు గుండే
అర్ద సేరు రుధిరం
4 సేర్లు మాంసం
1 సేరెడు పైత్యం
అర్దసేరు శ్లేషం
.
( మానవ దేహంలో 14 లోకాలు ) పైలోకాలు 7
,
1 భూలోకం - పాదాల్లో
2 భూవర్లలోకం - హృదయంలో
3 సువర్లలోకం - నాభీలో
4 మహర్లలోకం - మర్మాంగంలో
5 జనలోకం - కంఠంలో
6 తపోలోకం - భృమద్యంలో
7 సత్యలోకం - లాలాటంలో
.
అధోలోకాలు 7
.
1 ఆతలం - అరికాల్లలో
2 వితలం - గోర్లలో
3 సుతలం - మడమల్లో
4 తలాతలం - పిక్కల్లో
5 రసాతలం - మొకాల్లలో
6 మహతలం - తోడల్లో
7 పాతాళం - పాయువుల్లో
.
( మానవ దేహంలో సప్త సముద్రంలు )
,
1 లవణ సముద్రం - మూత్రం
2 ఇక్షి సముద్రం - చెమట
3 సూర సముద్రం - ఇంద్రియం
4 సర్పి సముద్రం - దోషితం
5 దది సముద్రం - శ్లేషం
6 క్షీర సముద్రం - జోల్లు
7 శుద్దోక సముద్రం - కన్నీరు
.
( పంచాగ్నులు )
,
1 కాలాగ్ని - పాదాల్లో
2 క్షుదాగ్ని - నాభిలో
3 శీతాగ్ని - హృదయంలో
4 కోపాగ్ని - నేత్రంలో
5 ఙ్ఞానాగ్ని - ఆత్మలో
.
7 ( మానవ దేహంలో సప్త దీపంలు )
,
1 జంబుా ద్వీపం - తలలోన
2 ప్లక్ష ద్వీపం - అస్తిలోన
3 శాక ద్వీపం - శిరస్సుపైన
4 శాల్మల ధ్వీపం - చర్మంన
5 పూష్కార ద్వీపం - గోలమందు
6 కూశ ద్వీపం - మాంసంలో
7 కౌంచ ద్వీపం - వెంట్రుకల్లో
.
10 ( నాధంలు )
,
1 లాలాది ఘోష - నాధం
2 భేరి - నాధం
3 చణీ - నాధం
4 మృదంగ - నాధం
5 ఘాంట - నాధం
6 కీలకిణీ - నాధం
7 కళ - నాధం
8 వేణు - నాధం
9 బ్రమణ - నాధం
10 ప్రణవ - నాధం

తిరుమలలో మహసంప్రోక్షణ ఏలా, ఎందుకు చేస్తారో ఒకసారి తెలుసుకుందమా...

ఆ సమయంలో తిరుపతి వెంకన్న విగ్రహంలో శక్తి ఉండదు, ఆ శక్తి ఎక్కడికి పోతుందో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులు ముఖ్యంగా తిరుపతిలోని వేంకటేశ్వరుడిని సేవించేవారు బాలాలయం మహా సంప్రోక్షణ కార్యక్రమం గురించి మాట్లాడుకొంటూ ఉన్నారు. ఆ కార్యక్రమం ఎందుకు చేస్తారు? ఎలా చేస్తారు? ఆ సమయంలో భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారా? లేదా? ఒక వేళ ఇస్తే ఏ ఏ సమయంలో ఆ దర్శన భాగ్యం కల్పిస్తారన్న విషయం పై చర్చించుకొంటున్నారు.
అంతేకాకుండా మిగిలిన రోజులతో పోలిస్తే వారాంతాల్లో అంటే వీకెండ్ సమయంలో శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. అయితే ఆ మహా సంప్రోక్షణ కూడా అదే సమయంలో జరుగుతుండటం వల్ల తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలా వద్దా అన్న విషయం పై పర్యాటకులు కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. వీటన్నింటికీ సమాధానమే ఈ కథనం.
పన్నెండు ఏళ్ళకు ఒకసారి
నదులకు ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి పుష్కరాలు వచ్చినట్లే తిరుమల శ్రీవారికి కూడా అష్టబంధన బాలాలయం మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సాధారణంగా ప్రతి వైష్ణవ ఆలయాల్లో ప్రతి 12 ఏళ్లకు ఒకసారి దీనిని నిర్వహిస్తారు.

విగ్రహ ప్రతిష్టాపన
ఆలయ నిర్మాణాల్లో ప్రధానమైనది విగ్రహ ప్రతిష్టాపన. తర్వాత శాస్త్రోక్తంగా జీర్ణోద్ధరణ పనులు. సజీవంగా ఉండే ఓ దేవతా మూర్తిని సేవిస్తున్నామనే భావన భక్తులకు కలిగేలా విగ్రహంలో ప్రాణ ప్రతిష్టాపన చేస్తారు.

అలా మలినమయ్యే అవకాశం
ఇక తిరుమలలో శ్రీవారికి ప్రతి రోజూ అనేక ఉపచారాలు, నివేదనలు జరుగుతాయి. ఈ సమయంలో పాత్రలు లేదా కొన్ని పదార్థాలు కింద పడినప్పుడు ఎంతో కొంత మాలిన్యాలు గర్భాలయంలోకి చేరుతాయి. వీటి వల్ల కొన్ని సార్లు గర్భాలయంలో పగుళ్లు వచ్చే అవకాశం ఉంది.

అపచారంగా భావించి
ఇది అపచారంగా భావించి పన్నెండేళ్లకోసారి గర్భాలయంలో అర్చకులే వాటికి మరమత్తులు చేస్తారు. ఈ క్రమంలో మొదట శ్రీవారి మూలవిరట్ పాదాలకు పద్మపీఠం మధ్యలో ఉన్న భాగాన్ని లేపంతో నిపటమే అష్టబంధన కార్యక్రమం.

8 రకాల వస్తువులతో
ఈ కార్యక్రమంలో భాగంగా 8 రకాల వస్తువలతో తయారుచేసిన చూర్ణాన్ని శ్రీవారి పాదల కింద మూలవిరాట్ సమీపంలో ఉంచుతారు. ఇందులో నల్లసరిగళం, కరక్కాయ, ఎర్రపత్తి, వెన్న, కండచెక్కర, లక్క, చెకుముకిరాయి, బెల్లం ఉంటాయి.

ఆయా ప్రదేశాల్లో ఉంచుతారు
ఈ వస్తువుల మిశ్రమాన్ని మూలవిరాట్ తో పాటు ఆధార్ పీఠం, పాదపీఠం మధ్యలో సన్నపాటి ప్రదేశంలో, మూలవిరాట్ పై భాగంలో గోడకు ఉన్న రంధ్రాల్లో ఈ చూర్ణాన్ని అద్దుతారు. కాల క్రమంలో ఈ మిశ్రమం కరిగిపోవడం, రంగు మారడం వల్ల మూలవిరాట్ లో శక్తి తగ్గితోతుంది.

శక్తిని పెంపోందించాటానికే
తిరిగి ఆ శక్తిని పెంపొందించేందుకే అష్టబంధన బాలాయన మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ మహాసంప్రోక్షణ శ్రీవారి ఆలయంలో 1958లో ప్రారంభమయ్యింది. చివరిగా 2006లో జరిగింది. మళ్లీ ఇప్పుడు ఈ ఏడాది ఆగస్టు నెలలో ప్రారంభమవుతోంది.

క్లుప్తంగా చెప్పాలంటే
క్లుప్తంగా చెప్పాలంటే ఆలయంలో మరమ్మత్తు పనులను నిర్వహించడానికి నిర్దేశించిన కార్యక్రమమే మహా సంప్రోక్షణ. అయితే శ్రీవారి ఆలయంలోకి అర్చకులు, జీయ్యంగార్లు మినహా మరెవ్వరినీ అనుమతించరు.

అష్టభంధన కార్యక్రమం
దీంతో అక్కడ జరిగే మరమ్మతులను వారే నిర్వహించాలి. ఇతర ఆలయాల్లో మాదిరి ఆలయం లోపలికి ఇంజనీరింగ్ అధికారులను అనుమతించరు. మహా సంప్రోక్షణంలో మూలవిరాట్ పాదాలు, పద్మపీఠం మధ్యన అష్టబంధన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

మూడు విభాగాలుగా
ఈ బాలాలయ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని మూడు విభాగాలుగా నిర్వహిస్తారు. మొదటగా శ్రీవారి మూలవిరాట్ లో ఉన్న శక్తిని కుంభంలోకి ఆవాహనం చేస్తారు. శ్రీవారి ఆలయానికి పక్కనే ఉన్న పాత కళ్యాణ మంటపంలో ప్రత్యేకంగా 24 యాగశాలలను ఏర్పాటు చేస్తారు.

అక్కడ కుంభాన్ని ఉంచుతారు
అక్కడ స్వామివారి శక్తిని ఆవాహన చేసిన కుంభాన్ని ఉంచుతారు. మూలవిరాట్ కు నిత్యం నిర్వహించే పూజా కైంకర్యాలను ఈ కుంభానికి నిర్వహిస్తారు. ఆఖరి రోజున మహా సంప్రోక్షణతో స్వామివారి శక్తిని తిరిగి మూలవిరాట్ లోకి పంపింస్తారు.

నూతనంగా నిర్మించినట్లే
ఈ కార్యక్రమంలో మూలవిరాట్ లోకి తిరిగి మూలవిరాట్ ని నూతనంగా నిర్మించినట్లేనని చెబుతారు.అ

చతుర్విధ లింగములు 4⃣

1.ఇష్టలింగము,

2. ప్రాణలింగము,

3. భావలింగము,

4. ఆత్మలింగము.


చతుర్విధయుగాంతములు 4⃣

1.కృతయుగము. .. శ్రావణ బహుళ అష్టమి.

2. త్రేతాయుగము,,,, కార్తీక బహుళ దశమి,

3. ద్వాపరయుగము.... మాధ బహుళ చతుర్థ,

4. కలియుగము.... మాఘ బహుళ నవమి.


చతుర్విధ బ్రహ్మ (మానస)పుత్రులు4⃣

1.సనకుడు.

2. సనందుడు.

3. సనత్కుమారుడు.

4. సనత్సుజాతుడు.


చతుర్విధ బ్రహ్మచార్యులు4⃣


1.గాయత్రీ బ్రహ్మచారి.

2. బ్రాహ్మణ బ్రహ్మచారి.

3. ప్రజాపత్య బ్రహ్మచారి.

4. బృహద్భహ్మచారి.


చతుర్విధ దుర్గములు4⃣

1.గిరిదుర్గము. (పర్వతము)

2. వనదుర్గము. (వనము)

3. స్థలదుర్గము. (ప్రాకారము).

4. జలదుర్గము (సముద్రము)

"స్వచ్ఛత లేని స్నేహలకు, విలువ ఇవ్వని బంధాలకు, అబధ్ధలాడే అనుబంధాలకు మౌనంగా దూరం కావడమే..చాలా మంచి మార్గం."

"జీవితం అంటే కేవలం తినడం, తాగడం, నిద్ర, సౌఖ్యం కాదు. మానసికోన్నతి సాధించటమే."

"అబద్ధం చెప్పడం శాపం లాంటిది. నిజాయితీ వరం లాంటిది."

ఏడు చేపల కధ అర్ధం పరమార్ధం...

నిజానికి రాజుగారి కొడుకులకు చేపలు వేటాడాల్సిన కర్మ ఏం పట్టింది.

అడవికిపోయి క్రూరమృగాలను వేటాడవచ్చు కదా!

అయినా ఎవ్వరూ ఈ ప్రశ్న వేయరు.

చెరువుకు పోయి చేపలు తెచ్చారే అనుకుందాం.

వాటిని ఎండబెట్టడానికి, ఎండిన వాటిని ఎత్తి పోసుకోవడానికి వారి దివానుల్లో నౌకర్లే కరువయ్యారా⁉

నిజానికి ఈ ప్రశ్న ఎంతో వ్యాలిడ్‌ ప్రశ్న. అయినా ఎవ్వరూ ఈ కోణం నుంచి ప్రశ్న వేయరు.

ఎవ్వరూ అడగలేదు కదా అని రీజనింగ్‌ ఇవ్వకపోవడం ఒక మంచి రచయిత లక్షణం కాదు.

అందుకే ఈ కథను జాగ్రత్తగా గమనిస్తే, చదువుకుంటే అనేక అంతరార్థాలు, పైకి కనిపించని విశేషాలు స్ఫురిస్తాయి.

రాజుగారు అంటే మనిషి.

ఆయనకు ఏడుగురు కొడుకులు అంటే మనిషిలోని సప్తధాతువులు.

కొడుకులు వేటకు వెళ్ళడమూ అంటే మనిషి జీవితాన్ని కొనసాగించడం.

జీవితమే ఒక వేట. వేటే ఒక జీవితం.

రాజ కుమారులు వేటాడిన ఏడు చేపలు అంటే మనిషికి ఉండే సప్త వ్యసనాలు.

ఏమిటా వ్యసనాలు❓

కామం, వేట, జూదం, మద్యపానం, వాక్పారుష్యం (కఠినంగా, పరుషంగా మాట్లాడడం), దండ పారుష్యం (తీవ్రంగా దండించడం), అర్ధదూషణం (ధనాన్ని దుబారాగా ఖర్చు చేయడం),

వీటన్నిం టిని మనిషి సాధన చేసి ఎండగట్టవచ్చు.

అంటే పూర్తిగా నియంత్రించవచ్చు.

వీటిని ఎండగట్టాలి అంటే ఎవరికి వారే చేయాలి తప్ప, వేరే ఎవరో చేయ కూడదు.

అందుకే కథలో ఏడు చేపలను రాజుగారి కొడుకులే ఎండగట్టినట్టు చెప్పారు.

ఈ నాటి సమాజంలో కామం, వేట, జూదం, మద్యం, దుర్భాష, ధనవ్యయం ఎంత తీవ్రస్థాయిలో ఉన్నాయో అందరం చూస్తూనే ఉన్నాం.

పైన చెప్పిన సప్త వ్యసనాలు మనిషిని ఎలా పీడిస్తున్నాయో, సమాజాన్ని ఎలా చెడగొడుతున్నాయో కళ్ళారా చూస్తున్నాం, చెవులారా వింటున్నాం.

రాజుగారి కొడుకులు ఎండబెట్టిన ఏడు చేపల్లో ఒక చేప ఎండలేదు.

ఏమిటా చేప. అది కామం.

దీన్ని జయించడం చాలా కష్టం.

ఎంత ప్రయత్నించినా అది ఎండదు.

కామం అంటే ఏమిటి❓

లోకం అనుకునే సెక్స్‌ కాదు, కోరిక.

కోరిక ఒక పట్టాన చావదు.

ఒకటి తీరుతుంటే మరొకటి మొలుచుకొస్తుంది.

మొలిచే కోరికలను తీర్చుకుంటూ పోతుంటే జీవితకాలం చాలదు.

కోరికలన్నింటిని జయించేసి మోక్షానికి వెళ్ళిపోవాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడుతుంటారు.

మోక్షానికి వెళ్ళాలనుకోవడం కూడా ఒక కోరికే.

అందుకని కోరికలను జయించడం అసాధ్యం.

ఆ కోరికను ఎండగడితే తప్ప మోక్షం రాదు.

ఈ చేప ఎండకుండా అడ్డు తగులుతున్నది ఏది❓
గడ్డిమేటు.

గడ్డిమేటు అంటే ఏమిటి❓
కుప్పకోసిన అజ్ఞానం.

మన అజ్ఞానం కొండలాగా పేరుకుపోతే దాని నీడన ఎన్ని కోరికలైనా బ్రతుకుతాయి.

గడ్డిమేటులా పేరుకుపోయిన అజ్ఞానాన్ని తొలగించా లంటే ఎలా❓

మామూలు గడ్డికుప్ప అయితే గడ్డిపరకలను పట్టి లాగీ, పీకి ఒకనాటికి ఖాళీ చేయవచ్చు.

కానీ అజ్ఞానం అలాంటిది కాదు. జ్ఞానాదాయ కమైన మాటలు ఎంత చెప్పినా, ఎన్ని చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా మనం చేత్తో గడ్డిపరకలను లాగినట్టే‼

ఆ కుప్ప తరిగేది కాదు, తగ్గేది కాదు.

మనిషి లో నేనున్నాను అన్న అహంకారమే గడ్డిమేటు.

దాన్ని ఎంత ప్రయత్నించినా తగ్గించడం కష్టం.

మరి అది పోవాలంటే ఏం చేయాలి❓

ఆవు వచ్చి మేయాలి.

ఆవు ఎక్కడి నుంచి రావాలి. అసలు ఆవు అంటే ఏమిటి❓

ఆవు అంటే జ్ఞానం.

జ్ఞానం అనే ఆవు దొడ్లో ఎగబడి మేస్తే అజ్ఞానం అనే గడ్డికుప్ప ఒకనాటికి అంతరించి పోతుంది.

లేదూ… జ్ఞానాన్ని అగ్నికణంగా మార్చి గడ్డిమేటు మీద వేస్తే కాలి బూడిదవుతుంది.

అందుకే భగవద్గీతలో మన కర్మలు, వాటి ఫలితాలు జ్ఞానాగ్నిలో దగ్ధమైపోవాలని చెబుతాడు కృష్ణుడు (జ్ఞానాగ్నిదగ్ధకర్మాణాం).

జ్ఞానాన్ని అగ్నిగా మలుచుకోగలిగిన వాడు సిద్ధపురుషుడు, యోగ పురుషుడు మాత్రమే.

మరి సామాన్యుడి పరిస్థితి ఏమిటి❓

సామాన్యుడు జ్ఞానాన్ని గోరూపంలో దర్శించాలి.

ఈ గోవును ఎవ్వరు మేపాలి.

గొల్లడాడు మేపాలి. గొల్లవాడు అంటే ఎవరు❓

సమర్ధ సద్గురుడు, జగద్గురుడు.

జ్ఞానరూపమైన భగవద్గీతను లోకానికి ప్రసాదించిన కృష్ణుడు గొల్లవాడే కదా‼

అర్జునుడు అనే దూడను అడ్డు పెట్టుకుని వేదం అనే ఆవు పాలు పిండి జ్ఞానరూపంగా మనందరికి ధారపోశాడు.

ఇంత గొప్పపని చేయవలసిన ఈ గొల్లవాడు ఆ పని చేయలేదు.

ఏమిరా నాయనా‼ఆవును ఎందుకు మేపలేదు అని అడిగితే అమ్మ అన్నం పెట్టలేదు అన్నాడు.

ఇంతకీ ఆ గొల్లవాడికి అన్నం పెట్టాల్సిన అమ్మ ఎవరు❓

అమ్మల గన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ. ఆమెనే లోకం జగన్మాత అని కీర్తిస్తుంది.

ఈ జగన్మాత ఒక మంచి గురువును పంపకపోవడం వల్ల గొల్లవాడి ఆకలి తీరలేదు.

వాడి ఆకలి తీరలేదు అంటే ఏమిటి అర్థం.

వాడికి ఇంకా జ్ఞానం పొందే సమయం రాలేదు అని.

ఇంకో మాటలో చెప్పాలంటే వాడికి దైవానుగ్రహం కలుగలేదు అని అర్థం.

ఓ జగన్మాతా ఈ గొల్లవాడికి ఎందుకు అన్నం పెట్టలేదమ్మా అంటే ఆవిడ పిల్లవాడు ఏడ్చాడు అంది.

ఇంతకి ఆ పిల్లవాడు ఎవరు❓ఆర్తితో దైవానుగ్రహం కోసం అలమటించేవాడు.

ఈ పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడు❓

వాడికి చీమ కుట్టింది. ఎక్కడిది చీమా❓దానికి ఇంకోపేరే సంసారం.

సంసారం అనే చీమ కుట్టినందుకు ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు.

ఆవులను మేపడానికి వచ్చే గొల్లవాడికన్నా పిల్లవాడే ముఖ్యం కనుక ఆ పిల్ల వాడినే చూసుకుంది.

చీమకుట్టినందుకు కథలో పిల్లవాడు ఏడ్చినట్టే సంసార బాధలు, ప్రపంచ బాధలు భరించలేక మనం కూడా ఏడుస్తున్నాం.

మనల్ని ఈ బాధలే చీమలై కుడుతున్నాయి.

ఈ చీమలు ఆరుబైట బారులు తీరి తిరుగుతూ కనబడతాయా❓
లేదు.

చీమలు ఎప్పుడూ పుట్టలోనే ఉంటాయి. ఏమిటీ ఈ పుట్ట❓

మనిషికి ఉండే అజ్ఞానం ఒక పుట్ట.

రేపటి రోజును గురించి బంగారు కలలు కనడం మరోపుట్ట.

ఈ రెండు పుట్టలలో ఉన్న వాళ్ళని చేరదీసి, రక్షించడమే భగవంతుడికి తెలిసిన విద్య.

ఈ పరమార్థాన్ని చెప్పడం కోసమే జీవితంలోకి అడుగు పెట్టే ముందే ఈ గొప్ప విషయం తెలియాలనే సదుద్దేశంతోనే మన పెద్దలు ఈ కథను ప్రతి పిల్లవాడికి నూరిపోశారు.

---------------------------
" ఎదుటి వారిని అవమానించాలని, ఎప్పుడైతే నీలో ఆలోచన మొదలవుతుందో, ఆ క్షణం నుండే నీలో మనశ్శాంతి కరువవుతుంది. "

శ్రీగురుపాదుక స్తోత్రం
 
🕉ఓం శ్రీమాత్రే నమః 🕉
 

అనంత సంసార సముద్రతార
నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యామ్।

వైరాగ్య సామ్రాజ్యద పూజనాభ్యాం
నమోనమః శ్రీ "గురు పాదుకాభ్యామ్"॥

కవిత్వ వారాశినిశాకరాభ్యాం
దౌర్భాగ్యదావాం బుదమాలికాభ్యామ్।

దూరికృతానమ్రవిపత్తతిభ్యాం
నమోనమః "శ్రీ గురుపాదుకాభ్యామ్"॥

నతా యయోః శ్రీపతితాం సమియుః
కదాచిద ప్యాశు దరిద్రవర్యాః।

మూకాశ్ర్చ వాచస్పతితాం హితాభ్యాం
నమోనమః"శ్రీ గురుపాదుకాభ్యామ్"॥

నాలీకనీకాశ పదాహృతాభ్యాం
నానావిమోహాది నివారికాభ్యామ్।

సమజ్జనాభీష్టతతిప్రదాభ్యాం
నమోనమః "శ్రీ గురుపాదుకాభ్యామ్"॥

నృపాలి మౌలివ్రజరత్నకాంతి
సరిద్విరాజత్ ఝషకన్యకాభ్యామ్।

నృపత్వదాభ్యాం నతలోకపంకతేః
నమోనమః"శ్రీ గురుపాదుకాభ్యామ్"॥

పాపాంధకారార్క పరంపరాభ్యాం
తాపత్రయాహీంద్ర ఖగేశ్రరాభ్యామ్।

జాడ్యాబ్ధి సంశోషణ వాడవాభ్యాం
నమోనమః "శ్రీ గురుపాదుకాభ్యామ్"॥

శమాదిషట్కరపదవైభవాభ్యాం
సమాధిదానవ్రతదీక్షితాభ్యామ్।

రమాధవాంధ్రిస్థిరభక్తిదాభ్యాం
నమోనమః "శ్రీ గురుపాదుకాభ్యామ్"॥

స్వార్చాపరాణామ్ అఖిలేష్టదాభ్యాం
స్వాహాసహాయాక్షధురంధరాభ్యామ్।

స్వాంతాచ్ఛభావప్రదపూజనాభ్యాం
నమోనమః "శ్రీ గురుపాదుకాభ్యామ్"॥

కామాదిసర్ప వ్రజగారుడాభ్యాం
వివేకవైరాగ్య నిధిప్రదాభ్యామ్।

బోధప్రదాభ్యాం దృతమోక్షదాభ్యాం
నమోనమః "శ్రీ గురుపాదుకాభ్యామ్"॥

జ్వరాన్ని దూరం చేసే స్తోత్రం


ఈశ్వర ఉవాచ:

వన్దేహం శీతలాం దేవీం రాసభస్థాం దిగమ్బరామ్|
మార్జనీకలశోపేతాం శూర్పాలంకృత మస్తకామ్||

వన్దేహం శీతలాం దేవీం సర్వరోగ భయాపహామ్|
యామాసాద్య నివర్తేత విస్ఫోటక భయం మహత్||

శీతలే శీతలే చేతి యో బ్రూయాద్దాహ పీడితః|
విస్ఫోటక భయం ఘోరం క్షిప్రం తస్య ప్రణశ్యతి||

యస్త్వా ముదకమధ్యేతు ధృత్వా పూజయతే నరః|
విస్ఫోటకం భయం ఘోరం గృహే తస్య న జాయతే||

శీతలే జ్వర దగ్ధస్య పూతిగంధయుతస్యచ|
ప్రనష్టచక్షుషః పుంస్ః త్వామాహుర్జీవనౌషధమ్||

శీతలే తనుజాన్రోగాన్ నృణాం హరసి దుస్త్యజాన్|
విస్ఫోటక విదీర్ణానాం త్వమేకామృతవర్షిణీ||

గలగండగ్రహా రోగా యే చాన్యే దారుణా నృణామ్|
త్వదనుధ్యాన మాత్రేణ శీతలే యాన్తి సంక్షయమ్||

నమన్త్రోనౌషధం తస్య పాపరోగస్య విద్యతే|
త్వామేకాం శీతలే ధాత్రీం నాన్యాం పశ్యామి దేవతామ్||

మృణాల తంతు సదృశీం నాభి హృన్మధ్య సంశ్రితామ్|
యస్త్వాం సంచిత యేద్దేవి తస్య మృత్యుర్నజాయతే||

అష్టకం శీతలాదేవ్యా యోనరః ప్రపఠేత్సదా|
విస్ఫోటక భయం ఘోరం గృహేతస్య నజాయతే||

శ్రోతవ్యం పఠితవ్యం చ శ్రద్ధాభక్తి సమన్వితైః|
ఉపసర్గ వినాశాయ పరం స్వస్త్యయనం మహత్||

శీతలే త్వం జగన్మాతా శీతలే త్వం జగత్పితా|
శీతలే త్వం జగద్ధాత్రీ శీతలాయై నమోనమః||

రాసభో గర్దభశ్చైవ ఖరో వైశాఖనందనః|
శీతలా వాహనశ్చైవ దూర్వాకంద నికృంతనః||

ఏతాని ఖరనామాని శీతలాగ్రేతు యఃపఠేత్|
తస్యగేహే శిశూనాం చ శీతలా రుజ్ఞజాయతే||

శీతలాష్టక మేవేదం నదేయం యస్యకస్యచిత్|
దాతవ్యం చ సదా తస్మై శ్రద్ధా భక్తియుతాయవై||

ఇతి శ్రీస్కన్దపురాణే శీతలాష్టకం సంపూర్ణం

జ్వరాది వ్యాధుల్ని పోగొట్టే ’శీతలాదేవి’

పండుగలకు గృహ శోభ కి విశేష మాసం

శ్రావణ మాస విశిష్టత ......

వృషభాది దేవతలకు కూడా అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మే. ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు, వాటి వైశిష్ట్యం చాలా ఉంది. లక్ష్మీ దేవికి ఇష్టమైన ఈ మాసంలో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం దీపారాధన చేయడం వల్ల దీర్ఘసుమంగళీ ప్రాప్తంతో పాటు అష్టైశ్వర్యాలు లభిస్తాయని పూర్వీకుల ఉవాచ. తిథులతో సంబంధం లేకుండా అష్టమి, నవమి, అమావాస్య రోజుల్లో కూడా పండుగలు, పూజలు చేసే అత్యంత శుభప్రదమైన మానం ఇదే.

శ్రావణ మాసం అంటే శుభ మాసం. శ్రావణ మాసాన్ని నభో మాసం అని కూడా అంటారు, నభో అంటే ఆకాశం అని అర్ధం. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు జంధ్యాల పౌర్ణమి, కృష్ణాష్టమి, పొలాల అమావాస్య, నాగ చతుర్థి ,నాగ పంచమి పుత్రాదా ఏకాదశి ,దామోదర ద్వాదశి ,వరహ జయన్తి ఇలా అనేక పండుగలు వస్తాయి. శ్రావణ మాసం చంద్రుడి మాసం కూడా, చంద్రుడు మనఃకారకుడు. అంటే సంపూర్ణముగా మనస్సు మీద ప్రభావము చూపే మాసము. ఈ మాసమందు రవి సంచరించు నక్షత్రముల ప్రభావము చంద్రుని మూలకముగా మన మీద ప్రభావం చూపును. చంద్రుని చార నుంచి జరగబోవు దుష్ఫలితాలను నివారించుటకు, మంచి కలిగించుటకు, ధర్మాచరణములను పండుగగా ఆచరించడం నియమమైనది. మనస్సు మీద మంచి ప్రభావము ప్రసరించి పరమార్ధము వైపు మనస్సును త్రిప్పుకొని మానసిక శాంతి పొందడానికి, ప్రకృతి వలన కలిగే అస్తవ్యస్త అనారోగ్యముల నుండి తప్పించుకొనుటకు, మంచి ఆరోగ్యాన్ని పొందడం కోసం శ్రావణ మాసం లో వచ్చే పండుగలలో నిర్దేశించిన ఆచారాలను పాటించడం ముఖ్యోద్దేశమైనది.

శ్రావణ సోమవారం

ఈ మాసం లో వచ్చే సోమవారాలలో శివ భక్తులు ఉపవాసాలుంటారు. దీక్షతో ఉపవాసం ఉండి, శివుడికి అన్ని రకాల అభిషేకాలు నిర్వహిస్తారు. పార్వతి దేవి కి కుంకుమ పూజ చేస్తే ఐదవతనం కలకాలం నిలుస్తుందని భక్తులు ప్రగాడం గా నమ్ముతారు

శ్రావణ మంగళవారం

కొత్త పెళ్లికూతురు శ్రావణమాసంలో వచ్చే ప్రతిమంగళవారం ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయి. మంగళగౌరీ అనుగ్రహం తో అష్టైశ్వర్యాలు, నిండు ముత్తెదుతనం పొందుతారు.
శ్రీ కృష్ణుడు ద్రౌపదీదేవికి, నారద మునీంద్రుడు సావిత్రిదేవికి ఉపదేశించిన మంగళగౌరి వ్రతము ఈ మాసం లో ఆచరించడం ఎంతో ప్రాసస్థ్యమైనవి. మంగళగౌరి కటాక్షం ఏ స్త్రీల పై ఉంటుందో వారికి వైధవ్య బాధ ఉండదు. సర్వవిధ సౌభాగ్యాలతో వారు వర్దిల్లుతారు. కొత్తగా పెళ్ళైన వారు తప్పక ఐదు సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. అలాగే కొన్ని ప్రాంతాల వారు ఈ వ్రతాన్ని పెళ్లి కాని పిల్లల చేత కూడా చేయిస్తారు. పెళ్లి కి ముందు నాలుగు సంవత్సరాలు చేయించి పెళ్ళైన తర్వాత మిగిలిన ఒక సంవత్సరం ఈ వ్రతాన్ని నోచుకొంటారు.

శ్రావణ శుక్రవారం

ఈ మాసం లో పౌర్ణమి కి ముందు వచ్చే శుక్రవారంనాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మి దేవి ని షోడసోపచారాలతో పూజలు చేస్తే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, అయిదవతనం, సంతానాభివృద్ది కలకాలం ఉంటాయని పెద్దలు చెప్పారు. లక్ష్మి దేవి భక్త శులభురాలు. ధనం, భూమి, విజ్ఞానం, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, బలం ఈ అష్ట శక్తులని అష్టలక్ష్ములు గా ఆరాదిస్తాము. శ్రీ మహావిష్ణువు లోకాలన్నింటిని రక్షించేవాడు, ఈ శక్తులన్నీ ఈయన ద్వారా ప్రసరించేవే. అతీత విషయాలని సామాన్య మానవులు గ్రహించలేరు. ఈ శక్తులన్నీ సక్రమంగా ఉంటేనే మనకి ఆయురారోగ్య, ఐశ్వర్య, సంతోషాలు కలుగుతాయి. లక్ష్మి దేవికి అత్యంతప్రీతికరమైన శుక్రవారం నాడు పూజిస్తే ఇవన్నిచేకూరుస్తుందని శ్రీ సూక్తం వివరిస్తుంది. అష్టలక్ష్ములలో వరలక్ష్మి దేవికి ఓ ప్రత్యకత ఉంది. మిగిలిన లక్ష్మి పూజలకంటే వరలక్ష్మి పూజ శ్రేష్ఠమని శాస్త్రవచనం. శ్రీహరి జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసం లో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. ఈ వ్రతాన్ని వివిధ ప్రాంతాలలో వివిధ సంప్రదాయాలలో ఆచరిస్తారు. ఎవరు ఏ రీతి లో ఆచరించిన సకల శుభకరమైన, మంగళప్రదమైన ఈ వరలక్ష్మి దేవి పూజ జగదానందకరమైనదని భక్తుల విశ్వాసం

శ్రావణ శనివారాలు

ఈ మాసం లో వచ్చే శనివారాలలో ఇంటి ఇలవేల్పు ని పూజించడం సర్వశుభాలను చేకూరుస్తుంది. ఈ మాసం లో వచ్చే అన్ని శనివారాలు చేయడానికి కుదరకపొయిన, కనీస ఒక్క శనివారమైన పూజా విధానాన్ని ఆచరించడం మంచిది.

శ్రావణ పౌర్ణమి

శ్రావణ పౌర్ణమి , జంధ్యాల పౌర్ణమి, హయగ్రీవ జయంతి ని ఈ రోజు జరుపుకొంటారు. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి హయగ్రీవుడిని ఈ రోజున పూజించందం ద్వారా, ఏకాగ్రత, బుద్ది కుశలత, జ్ఞానం, ఉన్నత చదువు, కలుగుతాయని ప్రతీతి .
జంధ్యాన్ని యగ్నోపవీతమని , బ్రహ్మసూత్రమని పిలుస్తారు. యజ్ఞోపవీతం సాక్ష్యాత్తు గాయత్రి దేవి ప్రతీక. యజ్ఞోపవీతం వేదాలకు ముందే ఏర్పడింది. పరమ పవిత్రమైన యజ్ఞోపవీత ధారణ వల్ల జ్ఞానాభివృద్ది కలుగుతుందని, యజ్ఞం ఆచరించిన ఫలం కలుగుతుందని వెదోక్తి. ఈ రోజు నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు.

నాగుల చవితి

నాగుల చవితి శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే చతుర్ధి ని నాగదేవతలకు ప్రీతికరమైన రోజుగా భావిస్తారు. సుబ్రహ్మణ్యస్వామికి అభిషేకం, నాగ దేవతలకు పాలు పోస్తే సంతానానికి సంబంధించిన దోషాలు అన్ని తొలుగుతాయి. సర్పదోషాల నుంచి విముక్తి లభిస్తుంది.

శ్రీ సంతోషిమాతా వ్రతం

శ్రావణ పూర్ణిమ రోజుని శ్రీ సంతోషీ మాతా జయంతిగా జరుపుకుంటారు. ఈ రోజున సంతోషిమాతా వ్రతం చేయటం వలన విశేషమైన ఫలితం లభిస్తుందని నమ్మకం. శ్రీ సంతోషిమాతా వ్రతాన్ని ఆచరించడం ద్వారా అన్నిశుభాలు కలుగుతాయని, ధన, కనక, వస్తు, వాహన యోగంతో పాటు నిండు ముతైదుతనం లభిస్తుందని మహిళలు భావిస్తారు. .

రక్షా బంధనం

శ్రావణ పూర్ణిమని రాఖీ పూర్ణిమ అని కూడా అంటారు. మహిళలు తమ అన్నదమ్ములకు, సోదర సమానులకు రాఖీని కట్టి వారి క్షేమం కోరుకుంటారు. శ్రావణ పూర్ణిమ నాటి నుండి ఒక సంవత్సరం పాటు ఎవరికీ అండగా ఉండదలచామో వారి ముంజేతికి మనం కట్టబోయే రక్షిక (రాఖి) దైవం ముందుంచి పూజించి, ఆ పూజా శక్తిని గ్రహించిన రక్షికను అపరాహ్ణసమయం లో కట్టడం చేయాలి. అప అంటే పగలు అపరం అంటే మధ్యాహ్నం అంటే 12 దాటాక , కాబట్టి అపరాహ్ణం అంటే 12 నుండి 3 గంటల మధ్య. ఈ విధానాన్ని గర్ఘ్యుడనే మహర్షి చెప్పాడని శాంతి కమలాకరం చెప్తోంది కాబట్టి ఇది నేటి ఆచారం కాదనీ, ఎప్పటి నుండి వస్తున్నా సంప్రదాయమేనని తెలుస్తోంది.

హయగ్రీవ జయంతి

శ్రావణ పూర్ణిమ రోజున హయగ్రీవ జయంతి అని పురాణాల్లో ఉంది. ఈ రోజు విష్ణు ప్రీతిగా చేసే అర్చన, ఆరాధన, వ్రతాలు, విశేష ఫలితాన్ని ఇస్తాయి. అలాగే ఈ రోజున హయగ్రీవుల వారి ద్వారా ఉపదేశించిన శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం పారాయణ చేసి గుగ్గిళ్లు నైవేద్యం పెట్టటం మంచిది. మనలో ఉండే అహంకారం తొలగిపోయి అందరిలో సమ భావన కలిగి ఉంటారు.