కోటప్ప కొండ

టప్పకొండ[1] గుంటూరు జిల్లా, నరసరావుపేట దగ్గర ఉన్న త్రికోటేశ్వరుని సన్నిధి. కైలాశాధినేత అయిన ఆ మహా శివుడు త్రికోటేశ్వరుని రూపంలో కొలువైన దివ్య సన్నిది కోటప్పకొండ. యల్లమంద కోటయ్యగా భక్తులకు ప్రీతి పాత్రుడైన శివుడు కోటప్పకొండలో కొలువై భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్నాడు.

కోటప్ప కొండ
కోటప్పకొండ సుందర దృశ్యం

త్రికోటేశ్వరస్వామి ఆలయ దృశ్యం.
పరమేశ్వరుడు జ్ఞానోపదేశం ఇచ్చిన పవిత్ర పుణ్యక్షేత్రమే కోటప్పకొండ.

ఈ క్షేత్రంలో శివుడు… బాలుడిగా అవతరించాడు.
ఈ క్షేత్రంలో శివుడు… దక్షిణామూర్తిగా బ్రహ్మ విష్ణువులకు బ్రహ్మోపదేశం చేశాడు.
ఈ క్షేత్రంలో శివుడు… విష్ణువు పాపాలను కడిగి వేశాడు.
ఈ క్షేత్రంలో శివుడు… తన తపస్సుతో కోటి మంది దేవతలను నేలకు దింపాడు.
కొండ మీద మెట్లను ఎక్కడానికే కాదు… జీవితంలోని కష్టాలను దాటడానికీ… భక్తులు కోటప్పను తలుచుకుంటారు!
‘చేదుకో… మమ్మల్ని ఏలుకో’ అని శరణుజొచ్చే ప్రతి ఒక్కరినీ… చల్లగా చూసే శివుడు… ఎల్లరకూ అభయమిచ్చే దేవుడు ఈ కోటప్ప!!


Image may contain: 1 person