యాగంటి బసవన్న

కర్నూలు జిల్లాలో బ్రహ్మం గారు నివసించిన బనగానపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి. ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపచేసే పుణ్యక్షేత్రాలలో యాగంటి ఒకటి. నల్లమల, ఎర్రమల అడవుల మధ్య వెలసిన ఈ పుణ్యక్షేత్రాల్లో ఒక్కో క్షేత్రానికి ఎంతో విశిష్టతలు వున్నాయి. ఈ మూడు శైవ క్షేత్రాలు ఇక్కడ కొండల నుండి నిరంతర జలధారలుప్రవహించటం చాలా ప్రత్యేకం. బనగానపల్లి మండలానికి దగ్గరలో యాగంటి అనే దివ్యక్షేత్రం వుంది. అద్భుతమైన శైవ క్షేత్రం. ఇక్కడ స్వామి వారు పరమశివుడు విగ్రహరూపంలో దర్శనమిస్తారు.బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో కలియుగాంతంలో ఆలయం ముందున్న నందీశ్వరుడు కాలు దువ్వి రంకె వేస్తాడని అది భూమండలం దద్దరిల్లేలా ఆ రంకె వుంటుందని పేర్కొనటం జరిగింది.

అంతేకాకుండా ఆ నందీశ్వరుని విగ్రహం సైజు అనేది పెరుగుతూవుండటం ఇక్కడ మరో విశేషం. దీనిని అర్కియాలజీవారు కూడా అంగీకరించటం జరిగింది. ఈ ఆలయం యొక్క పరిసరప్రాంతాలలో ఒక్క కాకి కూడా కనిపించదు. దీనికి సంబంధించి ఒక చారిత్రాత్మక కథనం వుంది.

యాగంటి దేవాలయము కర్నూలు జిల్లాల్లో చాలా ప్రసిద్ధి చెందిన ఆలయము. ఇక్కడ వున్న నందీశ్వరునికి దేశవ్యాప్తంగా ప్రచారం ఉంది. యాగంటి క్షేత్రంలో ప్రధాన ఆలయంలో శ్రీ ఉమామహేశ్వరుని లింగం ఉంది. తొలుత ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కట్టారని కాని తయారయిన విగ్రహంలో చిన్న లోపం వున్నందున వెంకటేశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్ఠించలేదని, స్వయంభువుగా ఆ చుట్టు పక్కల వెలసిన ఉమా మహేశ్వర స్వామి వారిని తీసుకుని వచ్చి ఆలయంలో ప్రతిష్ఠించారని ఒక కథ ప్రచారంలో ఉంది. లోప భూయిష్టమైన శ్రీ వెంకటేశ్వరస్వామి వారి విగ్రహాన్ని ప్రధాన ఆలయానికి ప్రక్కనే కొండపైన సహజ సిద్దంగా వున్న గుహలో ఇప్పటికి దర్శించుకోవచ్చు. ఇక్కడున్న పుష్కరిణి లోనికి నీరు నంది నోటి నుండి వస్తూ వుంటుంది.

Image may contain: text