నా జీవితానుభవాలు

నేను ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా రహదారులు భవనాల శాఖ సూపరింటెండెంట్ గా పదవీవిరమణ చేశాను. మాది తిరువణ్ణామలై జిల్లా, చెయ్యర్ తాలూకా, ఏరయూర్ గ్రామం. ఇప్పుడు నాకు ఎనభైమూడు సంవత్సరాలు. 1989లో బస్సులో చెయ్యర్ నుండి చెన్నై వెళ్తున్నప్పుడు రోడ్డు పక్కన ఉన్న ఒక చిన్న గ్రామ దేవాలయంలో శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామివారిని దర్శించుకున్నాను. డ్రైవరు బస్సును ఆపి అందరిని స్వామివారి దర్శనం చేసుకోమని చెప్పాడు. నేను స్వామివారిని దర్శించుకుని సాష్టాంగం చేసి, నా పెద్ద కుమారునికి సంబంధం ఖాయం చేసుకోవడానికి చెన్నై వెళ్తున్నాను అని చెప్పాను. స్వామివారు నన్ను ఆశీర్వదించి, “చెన్నై ఎందుకు వెళ్తున్నావు? నీ కుమారుని వివాహం చెయ్యర్ లోనే కుదురుతుంది. వివాహం తరువాత ఆనందమయ జీవితం గడుపుతాడు” అని చెప్పారు.

ఆ పెళ్లి సంబంధం కుదరకపోవడంతో నేను చెన్నై తిరిగొచ్చాను. నా సోదరుడు హరినారాయణన్ చెయ్యర్ తాలూకాలోని ఏరయూర్ లో ఉంటూ సామాజిక సేవలు చేస్తూ చుట్టుపక్కల ఊళ్లు తిరుగుతూ ఉంటాడు. ఒకరోజు నేను తనతో పాటు చెయ్యర్ లోని వక్కడై గ్రామానికి వెళ్లాను. జిల్లాలోని ప్రముఖ వ్యక్తీ, భూస్వామి అయిన శ్రీ వక్కడై రామస్వామి అయ్యర్ గారిని కలిశాము. మాటల మధ్యలో నన్ను వారికి పరిచయం చేసి, నాకు పెల్లిదుకు వచ్చిన అబ్బాయి ఉన్నాడని వారితో చెప్పాడు. వెంటనే ఆయన మ అబ్బాయి జాతకం అడిగి తీసుకుని, తనకు పెళ్లీడుకు వచ్చిన మనవరాలు ఉందని అమ్మాయి జాతకం నా చేతిలో పెట్టారు.

రెండింటిని పరిశీలించిన జ్యోతిష్కులు జాతకాలు కుదిరాయని, అమ్మాయి జాతకం బ్రహ్మాండంగా ఉందని, పెళ్ళైకి పదిహేను రోజులు ఉందనగా ఉద్యోగంలో పదోన్నతి లభించి పుణ్యక్షేత్రానికి బదలీ అవుతాడని చెప్పారు. సంబంధం కుదుర్చుకున్నాము. మహాస్వామివారి ఆశీస్సుల వల్ల, జ్యోతిష్కులు చెప్పినట్టుగా పెళ్ళికి సరిగ్గా పదిహేనురోజుల ముందు, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గా శ్రీకాళహస్తిలో పదోన్నతి లభించింది. ఇప్పుడు వాడికి ముగ్గురు కూతుళ్ళు. అందరూ మంచి చదువులు చదివి జీవితాల్లో స్థిరపడ్డారు.

నేను పదవీవిరమణ చేసిన తరువాత కర్నూలులో ఉన్నప్పుడు అక్కడ హంద్రీ నది ఒడ్డున ఉన్న పారిశ్రామిక వాడలోని ఒక పిండి మిల్లులో మేనేజరుగా చేరాను. 1984లో పరమాచార్య స్వామివారు ఈ మిల్లులో నలభైనాలుగు రోజులపాటు మకాం చేశారు. అప్పుడు వారి సేవ చేసుకునే భాగ్యం నాకు కలిగింది.

2002 తరువాత మా పిల్లలు విశ్రాంతి తీసుకొమ్మని చెప్పడంతో, పెరంబూర్ లోని చిన్న కొడుకు దగ్గర ఉంటున్నాను. ఇక్కడకు వచ్చిన తరువాత కామకోటి శంకరాచార్య ట్రస్టులో సభ్యుణ్ణి అయ్యాను. దాదాపు నెలకొకసారి ట్రస్టు సభ్యులతో కలిసి కాంచీపురం వెళ్తుంటాను. శంకరాలయం ట్రస్టు అధ్యక్షుడు నన్ను శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారికి పరిచయం చెయ్యగా, వారు నన్ను కర్నూలు కృష్ణమూర్తిగా గుర్తుపట్టి, సేవ చెయ్యమని ఆశీర్వదించారు. పరమాచార్య స్వామివారి అనుగ్రహం వల్ల, పిల్లలు బాగా స్థిరపడ్డారు, నేను సంతోషంగా ఉన్నాను.

--- టి. కృష్ణమూర్తి, పెరంబూర్. “మూమెంట్స్ ఆఫ్ ఎ లైఫ్ టైం” నుండి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।