ఒక జిజ్ఞాసి అనుభవం



నేను మాములుగా యాంత్రికంగా విధి నిర్వహణలో మునిగిపోయాను, క్రమక్రమంగా నా స్నేహితులు,తెలిసిన వారు నాలో ఏదో మార్పు చూస్తున్నాం అంటున్నారు. నువ్వు ఇదివరకటి లాగ లేవు, ఎక్కువ కాలం మౌనంగా ఉంటున్నావు ఏం జరిగింది అని పదే పదే ప్రశ్నించసాగారు. నాకు తోచిన సమాధానం చెప్పి తప్పించుకునేవాడిని. నాలో ఏదో మార్పు వొచ్చినట్లు తెలుస్తోంది. అయస్కాంత పురుషుడు నిజంగానే దివ్యమైన అయస్కాంత శక్తి కలిగి ఉన్నాడు. ఆయన కనిపించినప్పటి నుండి నాలో ఒక వింత చెప్పలేను మంచి అనుభూతి కలుగుతోంది. ధ్యానం ఎక్కువగా చెయ్యసాగాను. ఒక రోజు నిద్రలో ఉండగా స్వప్నంలో ఒక దివ్య కాంతిమయ శరీరంలో ఉన్న ఆకారాన్ని చూసాను, మెల్లగా ఆ ఆకారం స్పష్టంగా కనపడింది. స్వప్నంలోనే ఆనందాశ్చర్యాలతో "యజ్ఞవల్క మహర్షి! మీకు నమస్కారం" అంటున్నాను, ఈలోగా కల చెదిరిపోయింది.

నాకు పూర్తిగా మెలకువ వచ్చింది అప్పటికే తెల్లవారు కావొస్తోంది. రోజులు గడుస్తున్నాయి. ఒక రోజు ఆఫీసు పని మీద కారులో నేను పట్టణానికి వెళ్ళవలిసి వచ్చింది. నేను కెన్యాలో ఉంటున్నాను. కారు సున్నితంగా నైరోబి పొలిమేర దాటి పరిగెత్తసాగింది. కెన్యా చాల అందమైన దేశము, చల్లటి వాతావరణం,దట్టమైన అరణ్యాలు, ప్రకృతికి మారుపేరు అని చెప్పవచ్చు.

రిఫ్ట్ వాలీ దాటాక అక్కడ కారు ఆపి ఒక 10నిమిషాలు ఆ రిఫ్ట్ వాలీ వంతెన దగ్గిర ఆగిపోయాను. చల్లటి గాలి, వ్యూ పాయింట్ కిందన చూస్తే అగాధమయిన లోయ, గుబురు గుబురుగా ఎదిగిన మహా వృక్షాలు అంతా ఏదో లోకంలో ఉన్నట్లుగా కనిపించింది. మెల్ల మెల్లగా ప్రయాణం సాగించాను. జన సంచారం లేదు, వాహనాల రద్దీ లేదు. చుట్టూ రమణీయమైన దృశ్యాలు, అన్నమయ్య సంగీతం జీవితంలో ఇంత కన్నా ఆనందం ఏమి ఉంటుంది? కొంత దూరం పోయాక కారు యొక్క వేగం క్రమక్రమంగా తగ్గసాగింది. accelator ఎంతగా నొక్కిన కూడా వేగం పెరగడం లేదు. కొద్ది దూరం వెళ్ళాక కారు పూర్తిగా ఆగిపోయింది. చుట్టురా ఎక్కడ జన సంచారం లేదు. కెన్యాలో పరిస్థితులు ఇలాంటి సమయంలో అనుకూలంగా ఉండవు.

దొంగల భయం ఎక్కువ, మెల్లగా కారుని ఎడమ వైపుగా ఆపి దిగాను. ఎన్ని విధాలుగా ప్రయత్నించిన కారులో చలనం లేదు. ఏమి చేసేది లేక అప్రయత్నంగా ఎడమ వైపు కాలి బాటలో మెల్లగా నడుస్తూ వెళ్ళాను. ఒక 100 గజాలు వెళ్ళాక ఎడమ వైపు చిన్న సెలయేరు నా దృష్టిని ఆకర్షించింది. అప్రయత్నంగా అటువైపు నడిచాను. సెలయేరు నీళ్ళు ఎంతో నిర్మలంగా ఉన్నాయి. అందులో రంగు రంగు చేపలు స్వేచ్చగా ఈదులాడుతున్నాయి. అంతలో నా దృష్టి కుడి వైపున ఉన్న ఒక పెద్ద బండ రాయి మీద పడింది. అక్కడ ఒక వ్యక్తి దివ్య తేజస్సుతో నన్ను రమ్మని సైగ చేసారు. నేను మెల్లగా ఎంతో ఆశ్చర్యంతో ఆనందంతో, కొంత విస్మయంతో ఆయన దగ్గిరకి వెళ్ళాను.

ఆయనని చూడగానే ఎంతో ఉద్వేగంతో " యజ్ఞవల్క్య మహర్షి!" అంటూ సాష్టాంగ ప్రణామం చేసాను. ఆయన చిరునవ్వుతో నన్ను కూర్చోమని సైగ చేసారు. నేను కూర్చున్న కొండ రాయి చదునుగా ఉన్న నా శరీరానికి ఎటువంటి బాధ కలగకుండా ఎంతో మృదువుగా మారిపోయింది. నా ఉద్వేగం చల్లబడింది.అప్పుడు ఆయనతో ఇలా అన్నాను. "మహర్షి, ఆ రోజు మీరు మహర్షుల యొక్క సమావేశానికి వచ్చారు కదా ఆ రోజు నేను చూసిన ప్రదేశం హిమాలయ పర్వతాలే కదా? యజ్ఞాల గురించి, యజ్ఞం యొక్క ప్రభావం మనుషుల మీద ఎలా కలుగుతుంది? భావ శుద్ధి ఎలా జరుగుతుంది? నాకేమి అర్థం కాలేదు దయచేసి కాస్త వివరంగా చెప్పండి" అని అడిగాను. సమాధానంగా " నాయన నాకు సాధ్యమైనంత వరకు నీకు నీ స్థాయికి అర్థం అయ్యేటట్లుగా చెప్పటానికి ప్రయత్నిస్తాను".

"నాయనా! నీకు తెలుసు కదా మానవ దేహం పంచ భూతముల కలయిక అని. పంచతత్వాలు వాటి యొక్క గుణాలు. ఈ పంచ భూతాలను సంఘటిత పరచి వాటిలోని చైతన్య శక్తిని కలిగించేది ప్రాణము. ప్రాణము ఉన్నంత వరకే దేహ చలనం ఉంటుంది. మెదడు పంపించే ఆదేశాలను అవయవాలు పాటిస్తాయి. ఈ పాటించాలనే జ్ఞానాన్ని అవయవాలకి ప్రసాదించేది దైవ శక్తి సుమా"."స్వామి, కొంచెం విపులంగా చెప్తారా" అని అడిగాను. "నీవు నన్ను చూడగానే నమస్కరించాలనే ఆలోచన కలిగినపుడు నీ మెదడు నుంచి నీ రెండు చేతులలో ఉన్న కణముల యొక్క సమూహానికి రెండు చేతులు ఎత్తి నమస్కరించాలనే ఆదేశాన్ని పంపినపుడు ఆ ఆదేశాన్ని అర్థం చేసుకుని అదే విధముగా నమస్కార ప్రక్రియ జరగడానికి కేవలము దైవ ప్రేరణ కారణం. మాములుగా ఏదైనా కట్టే దహనం చేసినపుడు పొగ వచ్చినపుడు ఆ పొగ కేవలం కొద్ది దూరం మాత్రమే కనిపిస్తుంది.

ఒక యజ్ఞం చేసేటపుడు మంత్రయుక్తంగా ఆహుతులు అగ్నికి ఆవు నెయ్యితో వివిధ రకాల వనమూలికలతో అర్చించినపుడు వివిధ రకాల వనమూలికలలో ఉన్నటువంటి విశిష్టమైన సాత్వికమైన ఆ పదార్థాల యొక్క గుణములు మంచి శక్తి రూపంలో ఆకాశంలోకి మేఘమండలాన్ని కూడా తాకి సూర్య మండలాన్ని చేరతాయి. సూర్య మండలంలోని వాయువు జలాన్ని శుద్ధిని కలిగిస్తాయి. మరి మన భూమి సౌరమండలంమీదే కదా ఆధారపడింది. అప్పుడు సకాల వర్షాలుకురుస్తాయి. ఈ మంత్రముల యొక్క జీవ విద్యుత్, అయస్కాంత తరంగాలు కురిసే నీటి బిందువులను, వీచే వాయువులను ప్రభావితం చేస్తాయి. అటువంటిసకాల వర్షము భూమి మీద ప

 

డినపుడు ఆ భూమిఅంతా కూడా ఒక మంచి అయస్కాంత శక్తితోనిండిపోతుంది. అటువంటి భూమిలో నాటినవిత్తనాలు ఆ భూమిలోని ఇసుక రేణువుల నుండిశుద్ధమయిన, ఆరోగ్యవంతమయిన మంచి చైతన్యంకలిగిన శక్తిని గ్రహిస్తాయి. అటువంటి ఆహారాన్నిమనుష్యులు భుజించినపుడు వారిలోని ప్రతికణములో కూడా పరిశుద్ధమయిన, సమతుల్యమయిన విద్యుత్ అయస్కాంత క్షేత్రంఏర్పడుతుంది.ఆహారము మనస్సు అవుతుంది. ఇటువంటి ఆహరం భుజించిన వారికి మనస్సుసాత్వికంగా ఉంటుంది. వారి యొక్క జటరాగ్ని కూడాపరిశుద్ధమవుతుంది. వారిలో ఇతరుల పట్ల ప్రేమభావము కలుగుతుంది. అంతర్లీనంగా వారి తేజస్సువారి చుట్టూ ఉన్నవారిని మంచిగా ప్రభావితులనుచేస్తుంది.

అన్నిటికన్నా అతి ప్రతిభావంతమయింది, గొప్పది"ప్రేమ" అనే శక్తి మాత్రమే. వీరి యొక్క ఆధ్యాత్మికపరిణామక్రమం చాలా వేగంగా పెరుగుతుంది.ఇటువంటి మనుషుల యొక్క సాంగత్యంతోసమాజమే ప్రేమగా మారుతుంది.సమాజంబాగున్నప్పుడు దేశం బాగుపడుతుంది. ఇటువంటిమంచి శుద్దమయిన ప్రేమ అనే చైతన్యంవిశ్వాన్నేప్రేమమయంగా మారుస్తుంది. నాయనాఇదియే "యజ్ఞము" వలన కలిగే ఫలితము.

నువ్వు నన్ను చూసినది హిమాలయ పర్వతాల మీదే. నువ్వు అనుకున్నది నిజమే". అప్పుడు నేను మరల"మహర్షి, మహర్షులందరూ కూడా భారత దేశంలోనేఉంటారు కదా, మీరు ఆఫ్రికాలో ఎలా దర్శనంఇస్తున్నారు. నాకు విపులంగా వివరించండి" అన్నాను. మహర్షి చిరునవ్వుతో " నాయన మేము ప్రకృతిలోమమెకమైపొయినాము, మా ఆత్మ యొక్క చైతన్యం ఈవిశ్వం అంతా వ్యాపించి ఉంటుంది.

మాకు మీవలె కాలము, దేశము అనే కాలమానము, దేశమానము లేదు. మాకు హద్దులు లేవు, ఏ విధంగామహా సముద్రంలో ఒక్క నీటి బిందువు యొక్కగుణగణాలు ఆ మహా సముద్రమంత వ్యాపించిఉన్నాయో అదే విధంగా మాలోని ఆత్మ ఈ సృష్టంతావ్యాపించి ఉంటుంది. కాలము, వాటిలో వచ్చేమార్పులు భూమి మీద జరిగే ప్రళయాలు భూమియొక్క భౌగోళిక పరిస్థితులను అనూహ్యంగామార్చివేస్తాయి.కాబట్టి మేమంతా సంకల్ప మాత్రమునభూత, వర్తమాన, భవిష్యత్తు కాలంలో ప్రయాణంచేయగలుగుతాము. నేను మరల ఈ విధంగాప్రశ్నించాను "స్వామి, ప్రేమ యొక్క శక్తి చాలా గొప్పదనిచెప్పారు. కొంచెం విపులంగా వివరిస్తారా"? సమాధానంగా "అది నాకు వేరొక మహాత్ముడుత్వరలోనే చెప్తారు ఇంకా నీకు సమయం మించిపోయింది. నీ వాహనం బాగుపడింది.నిన్నుపిలిపించింది నేనే. నీకు శుభమవుగాక" అని మహర్షిమెల్లి మెల్లిగా గాలితేర లాగ అదృశ్యం అయిపోయారు.

నేను మరల నా కారు దగ్గిరకి వచ్చేసరికి ఏ జనసంచారం లేదు. జరిగినదంతా నెమరు వేసుకుంటూignition key తిప్పేసరికి కారు స్టార్ట్ అయ్యింది. మళ్లీనేను అలౌకికం నుండి లౌకికంగా మారిపోయాను. నాప్రయాణాన్ని సాగించాను. మనసు నిండా మరి కొన్నిప్రశ్నలు, వాటి సమాధానాల కోసం ఎదురు చూస్తున్నాను.

ఒక రోజు నేను ఇంట్లో కూర్చుని సావకాశంగా నాకుజరిగినటువంటి నమ్మశక్యం కానటువంటి దివ్యపురుషుని దర్శనం, వారు చెప్పినటువంటి విషయాలు, ఇచ్చిన అనుభవాలను నెమరవేసుకుంటున్నాను. నాకు ఈ జన్మలో దత్తుడి మీద అపారమయిన భక్తి,ప్రేమ కలిగాయి. 1951 వ సంవత్సరంలో నేను నెలలవయస్సు పిల్లవాడిగా ఉన్నపుడు మా అమ్మగారు ఏసౌకర్యం లేని ఆ రోజుల్లో అష్టకష్టాలు పడి నన్ను షిర్డీక్షేత్రానికి తీసుకువెళ్ళారు. ఇంట్లో ఎవరికి ఏ మాత్రంఅస్వస్థతగా ఉన్నా, మా తల్లిగారు షిర్డీ నుండి ప్రతి నెలపోస్ట్ లో వచ్చే విభూతిని వంటికి రాసి, ప్రసాదం నోట్లోవేసి సాయిబాబా కీర్తనలు ఎంతో భక్తిగా శ్రావ్యంగాపాడుతూ ఉండేవారు. మాకు వెంటనే ఆరోగ్యంకుదుటపడేది.

మధ్యలో అనగా వయసు పెరుగుతున్న కొద్ది ఆటలధ్యాసలో బాబాని పూర్తిగా మర్చిపోయాము. కానిఆయన మాత్రం సర్వదా నా వెంట వుండి చాలాసార్లుమార్గ దర్శకత్వం చేస్తూ నాకు ప్రాణదానం కూడాచేసారు. మానవుడు సుఖసంతోషాలతో ఉన్నప్పుడుభగవంతుని పూర్తిగా మర్చిపోతాడు. భగవంతుడుఅనేవాడిని ఎక్కడో మారుమూల పెట్టేస్తాము, కనీసముఆయనను తలచుకోవటం కూడా జరగదు. మనిషియొక్క మనస్తత్వం చాల విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే అదే మానవుడు తనకు వచ్చినసమస్యలను ఎదురుకోలేని కష్టాలుగా భావించినపుడుసమస్త దేవతలను ప్రతిక్షణం గుర్తుతెచ్చుకుంటాడు.నిరంతరం పూజలు, ప్రార్ధనలు చేస్తుంటాడు. ఎప్పుడుకూడా దేవాలయాలకి వెళ్ళనివాడు సమస్యలువచ్చినపుడు అక్కడే ఎక్కువ కాలం గడుపుతూఉంటాడు.

కష్టాలు తీరగానే మళ్లీ కథ మామూలే. అందుకే కాబోలు కుంతీ దేవి తనకి ఎప్పుడు కష్టాలు కలుగుతూ ఉండాలని, నేను నిన్ను ఎప్పుడు తలచుకోవాలని శ్రీ కృష్ణునితో చెప్పడం జరిగింది.

నాకు చిన్నతనం నుండే పుస్తకాలు చదివే అలవాటు ఉంది, ఇది మా తల్లితండ్రుల దగ్గిర నుండి వచ్చింది. అయితే అది క్రమక్రమంగా స్వాధ్యాయం వైపు మరలింది. ఎన్నో ప్రశ్నలకు తెలియని సమాధానాలు పుస్తకాల ద్వారా, నా స్వానుభవాల ద్వారా సమాధానాలు దొరికాయి. ముఖ్యంగా నా ఆధ్యాత్మిక వికాసం 17 ఏళ్ళ పాటు ఈస్ట్ ఆఫ్రికాలో అవిచ్చిన్నంగా కొనసాగింది. ఎంతో మంది సాధకులను కలవటం, ముఖ్యంగా గురుద్వారాలో ఆధ్యాత్మిక అనుసంధానము, తద్వారా ఆధ్యాత్మిక అనుభవలాను పొందాను. గురువు ద్వారా అనేకమంది గురుతుల్యులను కలిసాను. అయితే ప్రస్తుతం నా జీవితంలో జరుగుతున్న అనుభావాలు నాకు ఎంతో ఆశ్చర్యాన్ని

, ఆనందాన్ని కలిగిస్తున్నాయి. సుమారుగా గురుచరిత్ర, సాయి సచ్చరిత్ర, శ్రీ దత్త దర్శనము 50 సార్లు పైగానే చదవటం జరిగింది. వాటి యొక్క పుణ్య ఫలం వల్లనే ఇంతమంది మహాత్ములను కలవడం, ఊహాతీతమైన అనుభవాలు వారు నాకు ప్రసాదించటం జరిగింది. నా ప్రమేయం లేకుండానే నన్ను వారు తీర్చిదిద్దుతున్నారనే భావన, ప్రగాఢ విశ్వాసం నాకు కలిగాయి. ఇలాగ నా ఆలోచనలు అంతులేని ప్రవాహం మాదిరిగా సాగిపోతున్నాయి. ముఖ్యంగా అయస్కాంత పురుషుడితో నాకు తెలియకుండా చేసిన ఆకాశగమనం గురించి ఆలోచించసాగాను. ఒకసారి యధావిధిగా నా కర్తవ్య నిర్వహణలో నైరోబి నుండి కారులో Mombas బయలుదేరాను. దారిలో makindu అనే ప్రదేశంలో ఉన్న గురుద్వార(సిక్కు మతస్తుల) ను సందర్శించటం నాకు అలవాటు. అక్కడ ప్రత్యేకత ఏమిటంటే 24 గంటలు కూడా ఏ వేళలో వెళ్ళినప్పటికీ భోజనం సిద్ధంగా ఉంటుంది, ఉండడానికి వసతి సదుపాయం ఉంటుంది. అక్కడ అల్పాహారం ముగించి నా ప్రయాణాన్ని కొనసాగించాను. సాయంత్రానికి Mombas చేరాను.

ఒక రోజు సాయంత్రం ఏమి తోచక బజారులో వాకింగ్ చేస్తున్నాను. నేను స్వతహాగా పుస్తక ప్రియుడిని కావడం వాళ్ళ నా దృష్టి అక్కడ ఫుట్పాత్ మీద ఉన్న పుస్తకాల షాపు మీద పడింది. నేను దగ్గరగా వెళ్లి పుస్తకాలను చూస్తుండగా నా దృష్టి అక్కడే ఉన్న Lobsangramp రాసిన పుస్తకాల మీద పడింది. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఈ మహా పురుషుడు నాకు స్వప్న దర్శనం ఇస్తుండేవారు. ఏవేవో విషయాలు చెప్తుండేవారు. పొద్దున్న లేచేసరికి ఏమి గుర్తుండేది కాదు. ఎప్పుడో ఒకసారి చాలా ఏళ్ళ క్రితం నేను భారతదేసంలో ఉన్నప్పడు సుమారు 1970-75మధ్యలో ఈయన పుస్తకాన్ని చదవటం జరిగింది.

అప్పుడు ఆ పుస్తకం నాకేమి అర్థం కాలేదు. మళ్లీ ఇన్నాళ్ళ తరువాత ఆ మహానుభావుడు రాసిన పుస్తకాన్ని చూడటం జరిగింది. వెంటనే ఆ పుస్తకాన్ని కొనేసాను. తరువాత నేను నా పనులని ముగించుకుని మరల నైరోబి రావడం జరిగింది. ఆ పుస్తకం నేను దాదాపు 15 సంవత్సారాల కింద మొట్ట మొదటిసారి నేను చదివిన పుస్తకమే. ఆ పుస్తకంలో ఆయన ఆకాశగమనాన్ని గురించి చాలా విపులంగా రాసారు. నేను చాలా సార్లు ఆకాశగమనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడిని. ప్రతీ సారి ఆఖరి క్షణములో నా పక్క మీద నుంచి కిందపడుతున్నట్లుగా అనిపించి ఉలిక్కిపడి లేస్తూ ఉండేవాడిని. అలాభయపడకూడదని ఆయన ఆ పుస్తకంలో చెప్పేవారు. ఇలా రోజులు గడచిపోతున్నాయి.

ఒక రోజు రాత్రి నాకు అప్రయత్నంగా సుమారు 3 గంటల సమయంలో మెలకువ రావడం, నా ముందుగదిలో ఒక అద్భుతమయిన కాంతిని గమనించడం జరిగింది. నేను మెల్లగా ఆ ముందు గదిలోకి వెళ్ళాను. అక్కడ ఒక దివ్య పురుషుడు తేజోమయ శరీరంతో ప్రశాంత వదనంతో, చిరుదరహాసంతో "నేను నీకోసం వచ్చాను, దగ్గిరికి రా" అని ప్రేమగా పిలిచారు. నేను వినయంగా నమస్కరిస్తూ సాష్టాంగ ప్రణామం చేసాను. ఆయన ఎవరో కాదు, సాక్షాత్తు అనే Lobsang rampa టిబెట్ యోగి. నువ్వు ఆకాశగమనం గురించి కదా ఆలోచిస్తున్నావు, సరే పదా ఈసారి మనిద్దరం ఆకాశగమనం చేద్దాం, నేను ఉన్నాను నువ్వేమి భయపడక్కర్లేదు" అని చెప్పారు. ఇద్దరం వెల్లకిలా పడుకుని నెమ్మదిగా ప్రాణయామం చేస్తూ కళ్ళు మూసుకుని ఒక విధమయిన నిద్రావస్థలో జారుకున్నాము. నేను ఎంత ప్రయత్నించినా కూడా నా ప్రాణామయ శరీరము బయటకు మాత్రం రాలేకపోతోంది. అప్పుడు ఆయన మెల్లగా నా శిరస్సు మీద చెయ్యి వేసారు, తక్షణం నా శరీరం దూదిపింజలా తేలినట్లు అనిపించింది. మేమిద్దరం గాలిలో తేలిపోతున్నాము. నేను, ఆయన ఇద్దరం పైకప్పు దాటుకుని ఆకాశంలో ప్రవేశించాము, నాకంతా ఆశ్చర్యంగా ఉంది. ధృడంగా సిమెంటుతో తయారు చేయబడిన ఆ పైకప్పులోంచి ఎలా బయటికి వచ్చాము. ఆఘమేఘాలతో ఆకాశ యానము సాగించాము, ఆయన నా చెయ్యి పట్టుకుని కూడా తీసుకెళ్తున్నారు. కింద పట్టణంలో వీధి దీపాలు క్రమక్రమంగా దూరం అవుతున్నాయి. ఇంకా పైకి, పైపైకి ఎగర సాగాము. నా శరీరమంతా వెచ్చగా హాయిగా ఎటువంటి అసౌకర్యం లేకుండా ఉంది. కొంత సమయం దాటాక మేము ఒక ఎత్తైన కొండ మీద ఉన్న బౌద్ధ ఆరామం అనుకుంటాను, అక్కడ దిగాము.

ఆయన "ఇది నేను పుట్టినటువంటి పవిత్రమైన దేశము. ఇది అతి పవిత్రమైన బౌద్ధ ఆరామము,ఇక్కడే నాకు నా గురువులు ఆధ్యాత్మిక శిక్షణ ఇచ్చారు. నా జీవిత లక్ష్యం మానవాళి అందరికి కూడా ఎన్నో విజ్ఞానపరమైన ఆధ్యాత్మిక విషయాలను తెలియపరచటమే. మా గురువుగారు ఈ జీవితమంతా భరించలేనటువంటి బాధలతో, అష్టకష్టాలతో అన్యాయంగా హింసించబడతావు. నరకయాతనను మించి నీకు ఎంతో శారీరక, మానసిక బాధలు కలుగుతాయి, మేమంతా నిన్నే ఎన్నుకున్నాము, ఇష్టం లేకపోతే నువ్వు ఈ పనిని మానుకోవచ్చు అయినా కూడా మేము ఎంతో ప్రేమిస్తూ ఉంటాము. ఎంతో మంది మనుష్యుల జీవితాలు కర్మసహితంగా ఉంటాయి, అంటే కర్మలు చెయ్యటం మూలంగా ఆ కర్మల నివృత్తి కోసం మళ్లీ మళ్లీ మానవ జన్మ ఎత్తవలసి ఉంటుంది. కాని కొద్దిమంది మానవుల జీవితం కర్మ రహితంగా ఉంటుంది వారు ఏ కర్మలు చేయ్యనప్పటికి మానవ శ్రేయస్సు కోసం, ఆధ్యాత్మిక జిజ్ఞాస కోసం, మార్గ దర్శకత్వం కోసం ఎదురు చూస్తున్న సత్పురుషుల కోసం జన్మ ఎత్తవలసి ఉంటుంది అటువంటి వారు అనగా నీలాంటి వారి ద్వారా వారి యొక్క ఆధ్యాత్మిక పరిణామ

 

క్రమం వారి వారి పూర్వజన్మల సాధన బట్టి క్రమక్రమంగా వారి స్థాయి పెరుగుతుంది. ప్రస్తుతం ఈ విశ్వం యొక్క పరిస్థితి మనుష్యుల యొక్క వృత్తి, ప్రవృత్తి మా అందరికి కూడా ఎంతో ఆందోళన కలిగిస్తోంది. మేము మానవాళి శ్రేయస్సు కోసం చేసే ప్రయత్నాలు, తపస్సు సరిపోవడం లేదు. ప్రస్తుతం మానవాళి అంతా కూడా అసురీశక్తుల, మాయాశక్తుల ప్రభావంలో ఉంది. ప్రేమతత్వం మనుష్యులలో చాలా తక్కువ స్థాయిలో ఉంది. ప్రజలను పరిపాలించే నాయకుల సేవా తత్వం పూర్తిగా అడుగంటిపోయింది. రక్షించాల్సిన ప్రజా నాయకులు, రాజకీయ వేత్తలే ప్రజల పాలిటి రాక్షసులుగా, భక్షకులుగా, దేశద్రోహులుగా మారిపోతున్నారు. సాదు వర్తనులకు, సామాన్యులకు సత్పురుషులకు ఇది గడ్డు కాలంగా మారింది.

అత్యున్నతమైనటువంటి మన పూర్వీకుల భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు పూర్తిగా భ్రష్టు పట్టి పోయాయి. కలి పురుషుని శక్తి ప్రపంచమంతా విజ్రుమ్భిస్తోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి మేమంతా కూడా మా సర్వశక్తులు ధారపోస్తున్నాము. ఎంతో మంది జిజ్ఞాసులు, సాదుపురుషులు నీ కోసం, నీలాంటి వారికోసం ఎదురు చూస్తున్నారు. అటువంటి వారిలో నీవు కాంతి అనే ఆధ్యాత్మిక శక్తిని, బలాన్ని,ధైర్యాన్ని పెంపొందించి వారిని కాంతిమయ శరీరదారులుగా చెయ్యాలి. నీవు నీలాంటి వారు నీలోని ఆధ్యాత్మిక కాంతిని, ప్రకాశాన్ని, దైవత్వాన్ని, ప్రేమతత్వాన్ని సాధనల ద్వారా పెంచుకుంటారు. గాడాంధకారంలో, పెనుతుఫానులో చిక్కి దారి తప్పిపోయిన మహా సముద్రంలోని పడవల మీద ఉన్న నావికులందరికి ఏ విధంగా అయితే వారి దారిని నిర్దేశిస్తుందో అదే విధంగా ఇటువంటి అల్లకల్లోల పరిస్థితులలో ఉన్నవారిని నీవు కూడా ఒక పెద్ద పవర్హౌస్ లా మారి వారందరికీ మార్గ దర్శకత్వం చేస్తూ వారిని కూడా లైట్ వర్కర్స్ చెయ్యాలి. మరలా ప్రతియొక్క లైట్ వర్కర్ కొన్ని వేల మందిని తమ విధంగా మార్చాలి.

ఈ విధంగా ప్రపంచం అంతా కూడా ప్రేమతత్వంలో ఏకీకరణ అవుతుంది. అందుకోసం నీలాంటి వారు ఒక లక్షా పాతికవేల మంది నుంచి ఒక లక్షా నలభై నాలుగు వేల మంది ఈ ప్రస్తుత ప్రపంచాన్ని మార్చటానికి అవసరం అవుతుంది. నీకు మేమంతా కూడా ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ సహాయం చేస్తూ ఉంటాము అని చెప్పి మా గురువుగారు MIGIYARDOMDO నాతో చెప్పారు. నేను నా సమ్మతిని వెంటనే తెలిపాను". ఇక్కడితోLobsang rampa గారు తన ప్రసంగాన్ని ఆపి "చాలా సమయం అయ్యింది కదా మనం చక్కటి టిబెటియన్ టీ ని సేవిద్దాం" అనగానే మా ముందు ఎంతో అందంగా చెక్కబడిన చిన్న బల్ల, దాని మీద అందమైన కప్పులలో పొగలు కక్కుతూ ఒక పానీయం ప్రత్యక్షమయింది. ఆయన ఎంతో శ్రద్ధా పూర్వకంగా రెండు చేతులల్తో ఒక పాత్రని గ్రహించి తన్మయత్వంతో సేవించసాగారు. నేను కూడా అదే విధంగా ఆ పానీయాన్ని సేవించాను. శరీరమంత ఒక వెచ్చటి విద్యుత్ ప్రవహించి చలి బారి నుండి నన్ను రక్షించింది.

"మహాత్మా మీరు పదే పదే ప్రేమతత్వాన్ని గూర్చి చెప్తున్నారు, ఆ ప్రేమలో అంతా శక్తి ఉందా" అని అడిగాను. అప్పుడు ఆయన నేను చెప్పడం ఎందుకు, నీవే ఆ దృశ్యాన్ని చూడు అదిగో అటువైపు " అని వేలుతో చూపించారు. "నేను నిన్న గడిచిపోయిన కాలంలోకి తీసుకువెళ్తున్నాను, నీవు అక్కడ జరుగుతున్నా విషయాలు గ్రహించే శక్తిని ఇస్తున్నాను" అని అన్నారు. నేను ఎంతో ఆసక్తిగా కింద కనిపిస్తున్న దృశ్యం చూడసాగాను. అది ఒక పట్టణంలా కనిపిస్తోంది. జనం అంతా ఎత్తుగా, బలిష్టంగా, తెల్లగా శరీరం అంతా ఉన్ని బట్టలు ధరించి కనపడ్డారు. అది రష్యా దేశంలోని సరిహద్దు ప్రాంతం అని తెలుస్తోంది. ఎందుకంటే చాలామంది చీకట్లో భయం భయంగా సరిహద్దు దగ్గిర ఉన్న తలుపు వైపు మెల్లగా చీకటి ముసుగులో వెళ్తున్నారు. రష్యన్ సైనికులు మద్యం సేవిస్తూ, చుట్టలు తాగుతూ వికటాట్ట హాసాలు చేస్తూ చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. వారి దగ్గర చాలా ఎత్తైన పెద్ద విశాలమైన ఉక్కు కంచతో ఏర్పాటు చేసిన ఒక పంజరం ఉంది. సర్కస్ లో మాదిరిగానే దానిలో భయంకరమైన, ఎత్తైన ఒక 30 కుక్కలు మొరుగుతూ కనిపించాయి. రష్యన్ సైనికులు బైనాక్యులర్ సహాయంతో ఆ రాత్రి పూట సరిహద్దు దాటుతున్న అమ్మయక ప్రజలను గమనిస్తున్నారు. అంతలో వారి దృష్టి కొంతమంది దురదృష్టవంతుల మీద పడింది. వారు సరిహద్దు ప్రాంతానికి చేరేలా ఉన్నారు.

రష్యన్ సైనికులు దుర్మార్గంగా నవ్వుతూ వారి దగ్గర ఉన్న శునకాలను ఈ అమాయకుల మీదకి వదిలేసారు. అవి భయంకరంగా మొరుగుతూ ఆ శరణార్థుల మీద పడ్డాయి. వారు శక్తిహీనంగా పడుతూ లేస్తూ రోదిస్తూ పరిగెడుతున్నారు. క్షణంలో ఆ ప్రదేశం అంతా శరణార్థుల హాహాకారాలతో, శునకాల యొక్క భయంకరమైన అరుపులతో నిండిపోయింది. ఆ శునకాలు వారిని చీల్చి చెండాడి వారి శరీరం అవశేషాలు మిగలకుండా పూర్తిగా తినేశాయి. ఆ ప్రాంతం అంతా రక్తసిక్తం అయిపొయింది. కానీ రష్యన్ సైనికులు చప్పట్లు చరుస్తూ, పైశాచిక నృత్యం చెయ్యసాగారు. వారంతా కూడా శరణార్థుల నుండి జారిపడిన వాచీలు, పర్సులు, ఇంకా చిన్న చిన్న వస్తువులు వారి జేబుల్లో వేసుకున్నారు. ఆ భయంకర దృశ్యం చూడలేకపోయాను. మనుష్యులలో ఇంత క్రూరత్వం,పైశాచికత్వం, రాక్షసత్వం ఉన్నదా అని చాలా మధనపడసాగాను. కానీ లామా గారు నిర్వికారంగా ప్రేక్షక పాత్ర వహించారు. మరల నా దృష్టిని ఇంకో దిశగా ఆయన ఆదేశం మేరకు చూడసాగాను. అది సరిహద్దుకి కొంత దూరంలో ఉన్న ఒక కుగ్రామము. ఒక రైతు ఇంట్లో లామా గారు కనపడ్డారు. ఆయన పరిస్థితి చాలా దారుణంగా ఉంది. శరీరం శిధిలావస్థలో ఉంది. ఒంటి నిండా కట్లతో చాలా నీరసంగా కనపడ్డారు. ఆ రైతు ఏదో పానీయాన్ని, కొంత ఆహారాన్ని ఇచ్చి మీరేమి దిగులు పడవద్దు, నేను మీకు చూపించే రహస్య మార్గం ద్వారా సరిహద్దుకి చేరుకొంది, ఇంకా 1 గంటలో వెన్నెల చాలా మటుకు తగ్గిపోతుంది, అపుడు మీరు బయలుదేరవచ్చు అని ఉన్ని దుస్తులు, ఒక ధృడమైన కర్ర ఇచ్చాడు.లామ గారు ఆ రైతు సోదరుని వైపు కృతజ్ఞతా భావంతో చూసారు. కాసేపటికి లామా గారు అతనికి వీడ్కోలు చెప్పి చీకటిలో కనుమరుగయ్యారు. సుమారు ఒక గంట తరువాత అతి కష్టం మీద పడుతూ, లేస్తూ రైతు చెప్పిన మార్గం గుండా ఆ సరిహద్దు వైపు చేరుకున్నాడు. ఆతిధ్యం ఇచ్చిన ఆ రైతు విషపూరితమైన నవ్వుతో ఇంటి నుండి బయటపడి ఒక అరగంటలో రష్యన్ సైనికులు ఉన్న ప్రదేశానికి చేరాడు. అక్కడ వికృతమైన హావాభావాలతో పశ్చిమ దిక్కు చూపిస్తూ ఏదో మాట్లాడాడు. నాకు ఆ రైతు పన్నిన కుట్ర అర్థం అయిపొయింది. తోటి టిబెటియన్ వాడు అయ్యి ఉంది కూడా డబ్బు కోసం కక్కుర్తి పడి దొంగ ప్రేమ నటిస్తూ అసలు విషయం ఆ రష్యన్ ముష్కురులకి చెప్పి, వాళ్ళు ఇచ్చిన డబ్బులు జేబులో పెట్టుకున్నాడు. రష్యన్ సైనికుల ఆనందానికి హద్దు లేదు మరో కాలక్షేపం దొరికిందని. ఆ భయంకరమైన కుక్కలతో కొంత దూరం వెళ్లి వాటిని వదిలేసారు. అతి భయంకరంగా మొరుగుతూ సుమారు ఒక 10 కుక్కలు మనిషి వాసన పసిగడుతూ లామా గారి వైపు పరిగెత్తసాగాయి.

లామా గారు కుక్కల రాకను పసిగట్టారు, ఆయనకీరైతు పన్నిన కుట్ర తెలిసిపోయింది. క్షణాలు గడిచే కొద్దిఆ కుక్కలు ఆయన దరిదాపుల్లోకి వచ్చేసాయి. కానిలామా గారు మాత్రం స్థిరంగా పద్మాసనంలో కూర్చునిరెండు చేతులతో నమస్కారం పెట్టి తన మనస్సులోఒక గట్టి సంకల్పంతో ప్రేమపూరితమయిన భావప్రసారాలను ఆ కుక్కలను ఉద్దేశించి పంపించారు. "నేను మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాను మీరు నామిత్రులు, నా అనుచరులు కాబట్టి మనమంతాప్రేమపూర్వకంగా ఉందాం. నేను మిమ్మల్ని ప్రేమించే మీనాయకుడను, నా ఆదేశాన్ని మీరు శిరసావహించాలి"అని మానసిక భావ ప్రసారాలను ప్రేమ, స్నేహతత్వంతో జోడించి కొద్దిగా అధికార దర్పంతో ఆయనతన సంకల్ప సిద్దితో సందేశాన్ని పంపించ సాగారు. అటువైపు రష్యన్ సైనికులు ఈలలు, చప్పట్లుకొడుతూ ఆనందంగా గంతులు వేయసాగారు. దానికితోడు గ్రామ ప్రజలు వారితో చేరారు. భయంకరంగా, భీకరంగా మనిషి రక్తం రుచి మరిగిన ఆ కుక్కలుదాదాపు ఆయనను చుట్టి వేసే ప్రయత్నం చేస్తున్నాయి. కాని లామా గారు చాల నిశ్చలంగా ధైర్యంగా కళ్ళతోవాటిని చూస్తూ తన సందేశాలను పంపిస్తూనేఉన్నారు. నాకు వారు ఇచ్చిన దివ్యదృష్టితోచూసినపుడు కాంతి పరివేష్టాన్ని చూసే శక్తి కలిగింది.రష్యన్ సైనికుల చుట్టూ ఉన్న కాంతి పరివేష్టంమలినమైనదిగా, మట్టి రంగు వాసన వేస్తోంది. అదిచాలా మందంగా, దళసరిగా ఉంది. అదే మాదిరిగాపరిగెత్తుతున్న ఆ శునకాల చుట్టూ అదే విధమయినరంగులో ఉన్న కాంతి వలయాలు కనిపించాయి. లామాగారు చుట్టూత లేత నీలి రంగు కాంతి పరివేష్టం క్షణక్షణానికి పెరుగుతూ ఆ శునకముల యొక్క కాంతివలయాన్ని తాకింది. నా కళ్ళని నేనేనమ్మలేకపోయాను. లామగారి నీలి రంగు కాంతి ఈశునకాల యొక్క కాంతిని తాకినపుడు అద్భుతంగాఒక లేత నీలి రంగు వలయం ఆ సమూహం చుట్టూఏర్పడింది. అంతలో ఒక అద్భుతం జరిగింది. కుక్కలుతమ వేగాన్ని తగ్గించాయి. భయంకరమైన అరుపులుఆగిపోయాయి. మరుక్షణం అవి తోకలాడిస్తూ చిన్నకుక్క పిల్లలుగా కేరింతలు కొడుతున్నట్లు ప్రేమగాఅరుస్తూ ఆయనను ప్రేమగా నాకసాగాయి. ఆ అద్భుతదృశ్యాన్ని చూసేసరికి గ్రామస్థులు, సైనికులునిశ్చేష్టులైపోయారు.

అక్కడ నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. అతిభయంకరమైన కుక్కలు అంత సాధువులుగా మారడం, ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతూ తోకలాడించడం, నాకడంచూసి వారు నమ్మలేకపోయారు. లామగారు నవ్వుతూఆ కుక్కలని ప్రేమగా నిమరసాగారు. నెమ్మదిగా లేచికుక్కలతో పాటు వారి నాయకులైన రష్యన్ సైనికులవైపు నడుస్తూ వారిని సమీపించారు. ఒక్కసారిగా ఆప్రాంతం అంత చప్పట్ల ధ్వనితో జనం అంత ఆయనకీస్వాగతం పలికారు.వారందరిలో ఒక విధమయినప్రేమతో కూడిన భయం, భక్తి ఏర్పడ్డాయి. వారులామగారిని వారి అతిధి గృహంలోకి తీసుకు వెళ్లిఆయనకి భోజన సదుపాయాలు చేసి ఆయన భుజంతట్టి "మీరు ఒక అసాధారణ వ్యక్తి అని మేముగ్రహించాము. మా జీవితంలో ఇటువంటి అద్భుతాన్నిచూడలేదు. మీరు మాకొక సహాయం చెయ్యాలి. ఆఇనప పంజరంలో ఉన్న కుక్కలకి ఒకడు గేటు ఎక్కివాటి ఆహారాన్ని లోని విసురుతూ పట్టు తప్పి లోనికిపడిపోయాడు. కుక్కలన్నీ కూడా అతని ప్రాణంతీసాయి. మాలో ఎవరికీ లోనికి వెళ్లి విడిపోయి ఉన్నవాడి శరీర భాగాలు తెచ్చే ధైర్యం లేదు. ఆ పని మీరుమాత్రమే చేయగలరు" అని ప్రాధేయపడ్డారు. ఆ రష్యన్సైనికుల కాంతి వలయంలో ఏ మాత్రం మార్పు లేదు. లోపలి వారి ఆలోచనలు క్రూరంగానే ఉన్నాయి. ఏమాత్రం జాలి,కరుణ అనేవి వారి భావ స్పందనలలోలేవు. ఒక వేళ కుక్కలు వారిని తినేసిన వారికి నష్టంలేదు. లామగారి జీవితం అంతా ఇంత కన్నాఘోరమైన పరిస్థితులను, బాధలను తోటి మానవులచేష్టల ద్వారా అనుభవించారని నాకు అర్థంఅయ్యింది. లామగారిని వారు ఆ బోను దగ్గరికితీసుకువెళ్ళారు. ఈ లోపల ఈ వార్త ఆ గ్రామం అంతాకూడా పాకింది. ఆ గ్రామస్తులందరూ కూడా ఆ బోనుదగ్గిరకి వచ్చేశారు. వాళ్ళలో తోటి మనిషి పట్ల ఏమాత్రం జాలి, కరుణ, ప్రేమ, సానుభూతి మచ్చుకికూడా కనిపించట్లేదు. అందరు తాగిన మత్తులోపందాలు వెయ్యసాగారు. కొంతమంది లామగారుప్రాణాలతో బయటికి వస్తారు అని, కొంతమంది రారనిభారీగా పందాలు కాయడం మొదలు పెట్టారు. నేనుఒక్క క్షణం ఆలోచించాను. ఇప్పటి పరిస్థితి కూడా అదేకదా, మనం ఆడే అన్ని ఆటలలో కూడామనుష్యులలో ఇదే కుసంస్కారం ఇంకా ఎన్నోరెట్లుపెరిగింది. ఇంతలో లామగారు నిర్విచారంగా ధైర్యంగానడుస్తూ బోను గేటు తెరిచి లోనికి నడిచారు.

అక్కడ కుక్కలు విశ్రాంతిగా పడుకుని ఉన్నాయి, ఈమనుషులు చేసే రణగొని ధ్వనులను పట్టనట్లువిశ్రాంతి తీసుకుంటున్నాయి. ఇంతలో అవి లామగారిరాకను, ఆయన వాసనను పసిగట్టాయి. కాని అవికొంచెం తికమక పడుతున్నట్లు కనిపించాయి. వాటిచుట్టూ ఉన్న కాంతి వలయం ఎర్ర మట్టి రంగు, కొంతనీలి రంగుతో కనిపించింది. దానికి కారణం వాటిలోకొన్ని ఇదివరకు లామగారిని తాకి, నాలికతో ఎంగిలిచేయడం జరగడం వల్ల. కాని సామూహికంగా ఉన్నకుక్కల చైతన్యంలో క్రూరం ఎక్కువగా ఉంది. అవిఒక్క సారిగా ఆయన వైపుకి దూసుకురాసాగాయి. లామాగారు మాత్రం నిర్వికారంగా, ధైర్యంగా మరలపద్మాసనంలో కూర్చుని ఆ కుక్కలను ఉద్దేశించిమానసిక భావ ప్రసారాలను ప్రేమతత్వంతో మిళితంచేసి ఆదేశాల రూపంలో పంపించారు. మరల అదేఅద్భుతం జరిగింది. కుక్కలలో వేగం తగ్గింది. వాటియొక్క కాంతి వలయం రంగు మారుతున్నట్లుకనిపించింది.మట్టితో కూడిన ఎరుపు రంగు ఈర్ష్య, అసూయ, క్రోధంను ప్రస్ఫుటిస్తే నీలి రంగు కాంతి శాంతి, ప్రేమ, జాలి, కరుణ తత్వాన్ని కలిగి ఉంటుంది. కుక్కలన్ని తోకలు ఊపుకుంటూ ఆయననిచుట్టుముట్టి నాకసాగాయి. ఆయన వాటిని దూరంగాకూర్చోమని ఆదేశాన్ని ఇచ్చారు, అవి అలానే చేసాయి. ఒక కుక్క మాత్రం తన ధోరణి మార్చుకోలేదు, దానితీవ్రత తగ్గింది కాని ధోరణి మారలేదు. అది ఆ కుక్కలనాయకుడు కాబోలు అది లామగారి మీదకి దూకింది.

లామగారు మెల్లిగా లేచి, మానసికంగా ఆ కుక్కకి నేనునీ నాయకుడని అని ఆదేశాలు ఇస్తూ, బలంగా ఆయనదాని డొక్కలో తన కుడి కాలితో తన్నారు. ఆ దెబ్బకిఅది యెగిరి 10 గజాల దూరంలో పది కుయ్యో మొర్రోఅని మూలగసాగింది. ఈ సంఘటనతో మిగతాకుక్కలకి లామగారి మీద భయం, భక్తి కలిగి ఆయనేతమ నాయకుడు అన్న నిశ్చయానికి వచ్చాయి. చీమచిటుకు మన్నా వినపడే అంత నిశ్శబ్దం ఆప్రదేశమంతా వ్యాపించింది. బయట గందరగోళం, అరుపులు మాయమయ్యాయి, అందరూనిశ్చేష్టులయ్యారు. కొంతసేపటికి జనాలంతా తేరుకునిచప్పట్లు, ఈలలతో లామ గారిని అభినందించసాగారు. ఇవేవి చాలా పట్టించుకోకుండా లామగారు తనకుఇచ్చిన బ్యాగ్గులో ఆ అభాగ్యుడి అవశేషాలు వేసుకునిధైర్యంగా గేటు తెరిచి బయటికి అడుగుపెట్టారు.అక్కడితో నేను చూసిన దృశ్యం ఆగిపోయింది. నాకుమనుషుల పట్ల మొదటి సారి చాలా అసహ్య భావంకలిగింది. జంతు చైతన్య స్థితి కన్నా ఈ మనుష్యులతత్వం ఎన్నో రెట్లు చాలా హీనంగా ఉంది. మానవాళికోసం ఈ మహానుభావుడు పడ్డ కష్టానికి మనమానవులు ఏ రకంగా కృతజ్ఞతచూపగాలుగుతున్నారు అని అనిపించింది. ప్రస్తుతంఉన్న మానవులకి, మానవాళి శ్రేయస్సు కోసంనిస్వార్థంగా తెర వెనుక వర్ణింపరానటువంటి కష్టాలుపడుతున్న ఈ మహాత్ముల గురించి ఎలా తెలుస్తుందిఅనిపించింది.

ఈ రోజుల్లో ఎవరి స్వార్థంతో వారు, ధన కాంక్షతో , స్వార్థపూరితమైన వారి హీనమయిన కోరికలతో సొంతతల్లితండ్రులను, అన్నదమ్ములను, స్నేహితులనేవంచిస్తూ ఉన్న ఈ మానవ సమాజం ఎప్పుడుబాగుపడుతుందో అని అనుకుంటూ నేను కన్నీటిధారలతో ఆ మహాత్మునికి సాష్టాంగ దండ ప్రమాణం ఆచరించాను.