*వేదాలలో చెప్పిన మానవ శరీరంలోని పంచకోశాలు*

?ఓంశ్రీమాత్రేనమః?
అద్వైత చైతన్య జాగృతి
:dizzy::sun_with_face::earth_asia::crescent_moon::star2::dizzy:

జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు గతాన్ని పరిశీలించకుండా ఏ మనిషి ఉండలేడు. కొందరైతే ఎప్పుడూ గతాన్నే తలచుకుంటూ ఆనందము లేదా దుఃఖాన్ని అనుభ విస్తూ ఉంటారు. చరమ దశలో మాత్రమే గతాన్ని గురించి ఆలోచించేవారూ ఉంటారు. ఏది ఏమైనా గతాన్ని మరచి ఎవరూ ముందుకు సాగలేరు అనేదిముఖ్యం. దీనికంతటికీ కారణం మనసనే పదార్థం. మన ఉపనిషత్తులు శరీరాన్ని, మనసును కూడా పదార్థంగానే తెలియచేసాయి.

మానవ దేహం ఐదు కోశాల సమూహం. అవి అన్నమయ (స్థూల), ప్రాణమయ, మనోమయ, విజ్ఞాన మయ, ఆనందమయ కోశాలు.

పిల్లలు, ఆటవికులలో స్థూల, ప్రాణమయ కోశాలు మాత్రమే పనిచేస్తాయి. నాగరికత కల్గిన వారిలో మానసిక కోశం పరిపూర్ణంగా పనిచేస్తుంది. అనుభవం పరిపక్వత సంతరించుకున్న వారిలో బుద్ధికోశం వికసిస్తూ ఉంటుంది. పైవాటినన్నింటినీ అనుభూతి పొందిన మహాత్ములలో మాత్రమే ఆనందకోశం పరిపూర్ణంగా పనిచేస్తుంది. ఈ కోవకు చెందినవారే యోగులు. వీరు ఆత్మానుసంధానం కోసం పరితపిస్తూ ఉంటారు.

ఈ పంచకోశాలు ఎప్పుడూ చైతన్యంలోనే ఉంటాయి. చైతన్యరహిత మైనపుడు దేహం ఒక వ్యర్థ పదార్థం మాత్రమే! బుద్ధికోశం చైతన్యమై తన కార్యకలాపాలను ఉన్నత స్థితికి తీసుకువెడుతుంది. అంటే భగవంతుని గురించి అన్వేషణ ప్రారంభమయినదని అర్థం.

మానసిక పరిపక్వత కల్గినపుడు, బుద్ధి వికసించినపుడు మాత్రమే ఆనందకోశంలో లయం చెందడం జరుగుతుంది. ఈ ఐదు కోశాలకు నేతగా ఉన్నదే ‘ఆత్మ’. ఇదే మహాచైతన్యం. ఇది మాత్రమే భగవదంశ కలిగి ఉన్నది. ఇది లేనిదే పై ఐదుకోశాలు నిరర్థకం.

మనసును ఒక పదార్థంగా చెప్పుకున్నాం. ఈ సత్యాన్ని ఉపనిషత్తులు నిరూపించాయి. ఉద్దాలకుడు తన కుమారుడైన శ్వేత కేతువుకి మనస్సు ఆహారమనే పదార్థం చేత, ప్రాణం నీటి చేత, వాక్కు అగ్ని చేత ఏర్పడతాయని ప్రయోగపూర్వకంగా నిరూపించాడు.

పదిహేను రోజులు ఎటువంటి ఆహారం తీసుకోకుండా కావల్సినంత జలము మాత్రము త్రాగుతూ ఉండమన్నాడు. తండ్రి ఆజ్ఞ మేరకు పదిహేను దినములు ఆహారం తీసుకొనలేదు. తరువాత తండ్రి వద్దకు వచ్చి శ్వేతకేతువును వేదాలను వల్లించమన్నాడు. కాని తనకు ఏమి గుర్తుకురావడంలేదని తెలియజేశాడు.

తదుపరి తండ్రి ఆజ్ఞ మేరకు ఆహారం తీసుకుని తిరిగి తండ్రి వద్దకు వచ్చి వేదాలన్నీ తిరిగి వల్లించినాడు. అప్పుడు ఉద్దాలకుడు నీలో ఉన్న సూక్ష్మమైన అగ్నికణికకు ఆహారం అందించగా తిరిగి అది జ్వలించినదని ఇంతవరకు దాని ఉనికిని జలము కాపాడినదని తెలియజేశాడు. కాబట్టి మనస్సు ఆహారం నుండి, ప్రాణం నీటి నుండి, వాక్కు అగ్నినుండి ఏర్పడతాయని నిరూపించాడు.

పదార్థంకంటే ఆత్మ వేరు. ఆత్మ మనసనే పనిముట్టుతో బాహ్య ప్రపంచంతో సంబంధం ఏర్పరచుకొంటుంది అని తెలియజేసాయి మన ఉపనిషత్తులు.
తైత్తిరీయోపనిషత్తు దేహం మనస్సు నుండి ప్రారంభించి తుదకు ఆత్మ రూపాన్ని గొప్పగా ఆవిష్కరించి భగవంతుని ఎలా దర్శించుకోవాలో తెలియజేసింది. భగవంతుడు ఆనందమయుడు. ఆయన నుండి ఆనందాన్ని పొందినందువల్లే మనిషి ఆనందాన్ని అనుభవిస్తున్నాడు.

భగవంతుడు ఆనందమయుడైనప్పుడు ఆత్మ కూడా ఆనందమయే! ఎందువలనంటే ఆత్మయే భగవంతుడు కనుక. మనిషిలో ఉన్నవాడు, సూర్యునిలో ఉన్నవాడు ఒక్కరే అన్న సత్యాన్ని తెలుసుకున్నవాడు లౌకిక చైతన్యం నుండి విడివడి అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ లేదా బుద్ధిమయ, ఆనందమయ కోశాల ద్వారా ఆత్మజ్ఞానం పొందినపుడు మాత్రమే భగవంతుని చేరుకోగలం. ప్రయత్నించడం
మన అదృష్టం.

మానవుడు తన జీవిత జీవన ప్రయాణంలో తానేమిటి,భవత్ స్థితిని పొందడం ఎలా సాధ్య పడుతుంది.
అసలు తనను తాను తెలుసుకోలేక పోవడం అనడానికి మూలకారణం మానవుడు స్వార్ధబుద్ధితో ధనం,పేరు ప్రతిష్ట,వస్తువులు,
మాయ అనెడి ఇంద్రియలకు వశం కావడం వలన తాను తెలుసుకోవలసిన జీవితలోని పరమార్ధం తెలుసుకోలేక 'కలి' మాయలో పడి ఇంద్రియలోలత్వంలో మునిగి తేలుతూ తన జీవిత కాలంలో అయోమయస్థితి నుండి బయట పడడానికి మార్గం కొరకు అన్వేషిసుంటే అది కేవలం యోగ సాధన ద్వార తన పంచకోశల గురించి తెలుసుకుని దాని సాదించిన ఫలితం వలన తన ఇంద్రియ నిగ్రహ శక్తి బలపడుతుంది.

మన పూర్వీకులైన యోగసాధకులు మనిషి తనను తాను ఏ విధంంగా పరిరక్షించుకోవాలి అనే విషయం గురించి తెలియజేసారు.మానవుని శరీరంలో పంచకోశాలు అనేవి ఏమిటి అవి ఎలా మానవ శరీరంపై ప్రభావం చూపుతాయి అనే విషయం గురించి ప్రస్తావించుకుంటే,కోశము అనగా అర.మనిషి యొక్క మనసు ఐదు స్థితులలో పనిచేస్తుంది,అవే

పంచకోశాలు.జీవాత్మ చుట్టూ అరలు ఆరలుగా ఉన్నందున దీనిని కోశము అందురు.

1. అన్నమయ్య కోశం

2. ప్రాణమాయ కోశం

3. మనోమయ కోశం

4. విజ్ఞానయ కోశం

5. ఆనందమయా కోశం

*1. అన్నమయ్య కోశం*

'అన్న' అనగా ఆహారం.ఇది భౌతిక శరీరం. అయిదు జ్ఞానేంద్రియాలను కలిగి ఉంటుంది. 1.చూపు,2.వాసన, 3.స్పర్శ,4.రుచి,5.వినికిడి లతో ఉన్న శరీరం అన్న మాట. అలాగే ఆ శరీరంలో ఎముకలు,కండరాలు,అవయవాలు ఈ అన్నమయ్య కోశం పరిధిలోకే వస్తాయి.మానవుని శరీరం భూమి తత్వాన్ని కలిగి ఉంటుంది.

*2. ప్రాణమాయ కోశం*

'ప్రాణ' అంటే శక్తి. ఈ కోశము vital life force అంటేప్రాణ శక్తి కలిగి ఉంటుంది. ఈ ప్రాణ

మరో 5 పెద్ద మరో 5 చిన్న భాగాలుగా ఉంటుంది.అవి 1.ప్రాణ,
2. అపాన,
3.ఉదాన,
4. సమాన,
5. వ్యాన
అనే 5 భాగాలుగా ఉంటుంది. శరీరంలో ఈ ప్రాణ శక్తి వల్ల నియంత్రణ కలిగి ఉంటుంది.మానవ శరీరంలో రక్త ప్రసరణ మరియు నాడులకు ప్రాణ శక్తి అందించేది ఇదే.
అంతేగాక 5 ఉప ప్రాణములు ఉన్నాయి అవి
1. నాగ,
2.కూర్మ,
3.కృకర,
4.దేవదత్త, 5.ధనుంజయ

అనేవి ఉంటాయి.
శరీరంలోని 72000 నాడులకు ప్రాణశక్తిని అందిస్తుంది.

*3.మనోమయ కోశం*

'మన" అంటే మనస్సు.ఇది ఆలోచనలు మరియు భావనలు, మెదడు మరియు ఎమోషన్ ల సమ్మిళితం. ఇందులో చేతనా, ఉప చేతనా మరియు అచేతనా అవస్థలు ఉంటాయి. దీనినే కాన్సియస్, సబ్ కాన్సియెస్ మరియు అన్ కాన్స యెస్ అంటాము. ఇది జ్ఞానేంద్రియముల ద్వారా విషయాలను గ్రహించి పంజ్ చేస్తుంది. అరిషడ్ వర్గాలు ఈ కోశం కు చెందినవి. కామ, క్రోధ,లోభ,మద,మాత్సర్యములు.

*4.విజ్ఞానమయ కోశం*

'విజ్ఞాన' గురించి అవగాహనే విజ్ఞానమయ కోశం. సుప్రీం అంటే పరమాత్మ ఉన్నదనే అవగాహన ఉంటుంది.ధారణ సాధన ద్వారా అంతర్గత క్రమశిక్షణ ఏర్పడి పరమాత్మతో ధ్యాన స్థితిలో వుండడడం.నేను అనే తత్వం నశించి ప్రాపంచిక విషయాలు వదలి సమాధి స్థితిని పొందడం. ఇది పూర్తిగా విషయ అవగాహనకు చెందినది.

*5.ఆనందమయ కోశం*

'ఆనందమ' కోశం అంటే పూర్తిగా ఇది ఆధ్యాత్మిక పరమైన దేహం.ఆత్మ పరమాత్మలో ఐక్యమైయ్యే స్థితి. దీనిని మనం ముక్తి అంటున్నాము.ఆనందమైన స్థితి ఇది.

మన శరీరంలో అనారోగ్యం ఏర్పడితే ఏ కోశంలో సమస్య ఉంటే ఆ సమస్యకు తగినట్టు థెరఫీ ఉంది.
భౌతిక శరీరం
* అన్నమయ కోశం* అయితే అందుకు ఆసనాలు, ప్రాణాయమలు వాడాలి
అలాగే మానసిక సమస్యలు *మనోమయ కోశం* కావున ధ్యానం చేయించవచ్చు
అలాగే *విజ్ఞానమయ కోశం* కోసమయితే ఆధ్యాత్మిక ప్రసంగాలు, భజనలు, మంచి పుస్తకాలు చదవడం అవగాహన పెంచుకోవడం

*ఆనందమయకోశం* అయితే ధ్యాన స్థితి నుండి ధారణ స్థితికి చేరి సమాధి (సమ+అది) స్థితిని పొందడం దీనినే ముక్తి అంటున్నాము.