మాఘ పురాణము -30వ అధ్యాయము

* ఫలశ్రుతి **

సుతమహర్షి శౌనకాది మునులతో ఇట్లు పాలికిరి. "శౌనకాది మునులారా! ఇంతవరకు మాఘమాస మహాత్మ్యమును, మాఘస్నానమువలన కలిగెడు ఫలములను వసిష్ఠులవారు దిలీపునకు తెలియజేసిన విధములను మీకు వివరించితిని. మీరు తలపెట్టిన ఈ పండ్రెండు సంవత్సరముల మహాయజ్ఞముకూడా పూర్తికావస్తున్నది. నేటిదినము మాఘమాసం ఆఖరిదినము కాన, మనమందరమూ గంగానదికి వెళ్లి స్నానమాచరించి, విష్ణువును పూజింతుము రండి" అని సూతమహాముని మాఘపురాణ ప్రవచనం పూర్తిగావించిరి.

మాఘమాసంలో సూర్యుడు మకారరాశియందు ఉండగా సూర్యోదయం అయిన తర్వాత నదిలో స్నానం చేయవలయును. అటుతర్వాత సూర్యునకు నమస్కరించి, విష్ణ్వాలయాలకు వెళ్లి శ్రీమన్నారాయణుని పూజించవలయును, మాఘమాసము యొక్క నెలదినములు ఈ విధముగా ఆచరించినయెడల, సకలైశ్వర్యములు-పుత్రపౌత్రాభివృద్ధి కలిగి జన్మరాహిత్యం కలిగి వైకుంఠప్రాప్తి కలుగును.

చిత్రంలోని అంశాలు: 1 వ్యక్తి