రవ్వలకొండ శ్రీశ్రీశ్రీ చెంచులక్ష్మీ సమేత పావన నరసింహస్వామి స్వాతి మనొభీష్ట పూజ విదానము

7 వ స్వాతి మనొభీష్ట పూజ

పూజ ప్రారంభము

                     ముందుగా వస్రము పరచి పటాలను ఉంఛండి. పటాలకు కుంకుమ లేదా చందనము బొట్లు పెట్టండి. పూలమాల వేసి,ధీపము వెలగించండి.అగరబత్తీలు కూడా వెలిగించండి.విడిపూలు అష్టోత్తరశతనామావళికి సిద్ధముగా ఉoచుకోండి.అరటి పండ్లు పెట్టండి. నైవేధ్యము సిద్ధముగా ఉoచుకోండి . ఇప్పుడు పూజ ప్రారంభించుకుందాము

ప్రార్థన

శుక్లాం భరదరం విష్ణుం, శశివర్ణం చతుర్భుజం,
ప్రసన్న వదనం ద్యాయేత్ , సర్వ విగ్నోప శాంతయే .
అగజానన పద్మార్కం, గజానన మహర్నిశం ,
అనేక దంతం భక్తానాం, ఏకదంతం ఉపాస్మహే

(తెల్లని వస్త్రములతో  అంతటా వ్యాపించిన వాడై, చంద్రుని వంటి ప్రకాశం కలవాడై,నాలుగు భుజములు(చేతులు) కలవాడై, ప్రసన్నమైనటువంటి ముఖముకలవాడిని  ధ్యానించుచున్నాము. నాయకత్వం లేని మాకు నాయకుడివై మమ్ములను నడిపించు.కొన్ని కోట్ల జీవరాశులు భక్తితో  ఏక దంతుడవైన నిన్ను ఉపాసన చేయుచున్నాము)

శ్లో|| ఏకేన చక్ర మపరేణ కరేణ శంఖ - మన్యేన సిన్దు తనయా మవ లంబ్య తిష్ఠన్

వామేతరేణ వరదాభయ పద్మచిహ్నం - లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||

( దేవా! చతుర్భుజుడవగు నీవు ఒక చేత శంఖమును, ఒకచేత చక్రమును, ఒక చేత లక్ష్మీ దేవిని ధరించి, ఒక కుడి చేతితో అభయమునిచ్చు హస్తముద్రను దాల్చి యుందువు. అట్టి మహానీయుడవగు నృసింహ దేవా! చేయూతనోసగి నన్ను కాపాడుము)

శ్లో|| సంసార యోగి సకలే ప్సిత నిత్యకర్మ సంప్రాప్య దుఃఖ సకలన్ద్రియ మృత్యునాశ -

సజ్కల్ప సిందు తనయాకు చ కు జ్క మాజ్క ! లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||

( ఓ దేవా! లేనిపోని కోరికలకు సంసారమే కారణము. ఆ కోరికలు నేరవేరుటకై నిత్యమూ ఏవో  చేయవలసి వచ్చుచున్నది. అందువలన నీవు సంకల్పించినచొ అవి అన్నియు నశించును. లక్ష్మీ దేవి యొక్క కుచ కుంకుమచే చిహ్నితమగు వక్ష స్స్థలముకల నృసింహదేవా! నా సంసార బాధలను పోగొట్టి నన్ను రక్షింపుము.)

సత్యజ్ఞాన శివస్వరూప మమలమ్ క్షీరాబ్ధి మధ్యస్థితం
యోగారూఢ మతిప్రసన్న వదనమ్ భూషా సహస్రోజ్వలమ్|
త్ర్యక్షం చక్ర పినాక సాభయ వరాన్విభ్రాణమర్కచ్ఛవిమ్
ఛత్రీభూత ఫణీన్ద్ర మిన్దు ధవళమ్ లక్ష్మీనృసింహం భజే||

సంకల్పం

(మీరు దేని విషయమై ఈ పూజచేయుటకు సంకల్పించుకున్నారొ -ఆ కోరికలు భక్తి,శ్రద్ధలతో స్వామికి విన్నవించుకోవాలి.మీ సంకల్పము నెరవేరేవరకు  ప్రతి స్వాతికి యీ సంకల్పమే విన్నవించుకోవాలి.)

ధ్యానము

(స్వామివారిపై దృష్టిని కొద్దిక్షణాలు నిలిపి కళ్ళుమూసుకొని స్వామివారిని రెండు నిమిషాలు ధ్యానము చేయాలి. తర్వాత మెల్లగా కళ్ళు తెరచి స్వామిని దర్శించుకొని నమస్కరించాలి.)

శ్రీ నరసింహ స్వామి అష్టోత్తర శతనామావళి

(ప్రతి నామానికి ఒక పువ్వు స్వామివారి చెంతనుంచాలి

 

ఓం నారసింహాయ నమః

ఓం మహాసింహాయ నమః

ఓం దివ్య సింహాయ నమః

ఓం మహాబలాయ నమః

ఓం ఉగ్ర సింహాయ నమః

ఓం మహాదేవాయ నమః

ఓం స్తంభజాయ నమః

ఓం ఉగ్రలోచనాయ నమః

ఓం రౌద్రాయ నమః

ఓం సర్వాద్భుతాయ నమః || 10 ||

ఓం శ్రీమతే నమః

ఓం యోగానందాయ నమః

ఓం త్రివిక్రమాయ నమః

ఓం హరయే నమః

ఓం కోలాహలాయ నమః

ఓం చక్రిణే నమః

ఓం విజయాయ నమః

ఓం జయవర్ణనాయ నమః

ఓం పంచాననాయ నమః

ఓం పరబ్రహ్మణే నమః || 20 ||

ఓం అఘోరాయ నమః

ఓం ఘోర విక్రమాయ నమః

ఓం జ్వలన్ముఖాయ నమః

ఓం మహా జ్వాలాయ నమః

ఓం జ్వాలామాలినే నమః

ఓం మహా ప్రభవే నమః

ఓం నిటలాక్షాయ నమః

ఓం సహస్రాక్షాయ నమః

ఓం దుర్నిరీక్షాయ నమః

ఓం ప్రతాపనాయ నమః || 30 ||

ఓం మహాదంష్ట్రాయుధాయ నమః

ఓం ప్రాఙ్ఞాయ నమః

ఓం చండకోపినే నమః

ఓం సదాశివాయ నమః

ఓం హిరణ్యక శిపుధ్వంసినే నమః

ఓం దైత్యదానవ భంజనాయ నమః

ఓం గుణభద్రాయ నమః

ఓం మహాభద్రాయ నమః

ఓం బలభద్రకాయ నమః

ఓం సుభద్రకాయ నమః || 40 ||

ఓం కరాళాయ నమః

ఓం వికరాళాయ నమః

ఓం వికర్త్రే నమః

ఓం సర్వర్త్రకాయ నమః

ఓం శింశుమారాయ నమః

ఓం త్రిలోకాత్మనే నమః

ఓం ఈశాయ నమః

ఓం సర్వేశ్వరాయ నమః

ఓం విభవే నమః

ఓం భైరవాడంబరాయ నమః || 50 ||

ఓం దివ్యాయ నమః

ఓం అచ్యుతాయ నమః

ఓం కవయే నమః

ఓం మాధవాయ నమః

ఓం అధోక్షజాయ నమః

ఓం అక్షరాయ నమః

ఓం శర్వాయ నమః

ఓం వనమాలినే నమః

ఓం వరప్రదాయ నమః

ఓం అధ్భుతాయ నమః ll 60 ll

ఓం భవ్యాయ నమః

ఓం శ్రీవిష్ణవే నమః

ఓం పురుషోత్తమాయ నమః

ఓం అనఘాస్త్రాయ నమః

ఓం నఖాస్త్రాయ నమః

ఓం సూర్య జ్యోతిషే నమః

ఓం సురేశ్వరాయ నమః

ఓం సహస్రబాహవే నమః

ఓం సర్వఙ్ఞాయ నమః 

ఓం సర్వసిద్ధ ప్రదాయకాయ నమః II70II

ఓం వజ్రదంష్ట్రయ నమః

ఓం వజ్రనఖాయ నమః

ఓం మహానందాయ నమః

ఓం పరంతపాయ నమః

ఓం సర్వమంత్రైక రూపాయ నమః

ఓం సర్వమంత్ర విధారణాయ నమ:

ఓం సర్వతంత్రాత్మకాయ నమః

ఓం అవ్యక్తాయ నమః

ఓం సువ్యక్తాయ నమః 

ఓం భక్ర వత్సలాయ నమ:  II80II

 ఓం వైశాఖ శుక్ల భూతోత్ధాయ నమః

ఓం శరణాగత వత్సలాయ నమః

ఓం ఉదార కీర్తయే నమః

ఓం పుణ్యాత్మనే నమః

ఓం మహాత్మనే నమ:

ఓం దండ విక్రమాయ నమః

ఓం వేదత్రయ ప్రపూజ్యాయ నమః

ఓం భగవతే నమః

ఓం పరమేశ్వరాయ నమః

ఓం శ్రీ వత్సాంకాయ నమః || 90 ||

ఓం శ్రీనివాసాయ నమః

ఓం జగద్వ్యాపినే నమః

ఓం జగన్మయాయ నమః

 ఓం జగత్పాలాయ నమః

ఓం జగన్నాధాయ నమః

ఓం మహాకాయాయ నమః

ఓం ద్విరూపభ్రుతే నమః

ఓం పరమాత్మనే నమః

ఓం పరజ్యోతిషే నమః

ఓం నిర్గుణాయ నమః || 100 ||

ఓం నృకేసరిణే నమః

ఓం పరతత్త్వాయ నమః

ఓం పరంధామ్నే నమః

ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః

ఓం లక్ష్మీనృసింహాయ నమః

ఓం సర్వాత్మనే నమః

ఓం ధీరాయ నమః

ఓం ప్రహ్లాద పాలకాయ నమఃII108II

ఓం లక్ష్మీనరసింహ అష్టొత్తర శతనామావళి సంపూర్ణం

7 వ స్వాతి కథ

 ప్రహ్లాదుడు విధ్యను గురుకులంలో సాగిస్తూనే హరినామ సంకీర్తనలు చేయడం మానలేదు. కొంతకాలము జరిగిన తర్వాత హిరణ్యకశిపుడు ,ప్రహ్లాదుని గురుకులము నుంచి పిలిపించాడు. తన తొడపై కూర్చోబెట్టుకొని ఆప్యాయత నిండిన స్వరముతో 'కుమార! ఏ విధ్యలు నేర్చుకున్నావు ' అని అడిగాడు. దానికి ప్రహ్లాదుడు 'చదువులలోని మర్మములెల్ల చదివాను. అన్నిటికి విష్ణుభక్రియే తరుణోపాయమని చెప్పాడు. ఆ సమాదానానికి హిరణ్యకశిపుడు మహా కోపముతో గురువులవైపు తిరిగి ' నేను ఏమి నేర్పమన్నాను - మీరేమి భోదించారు.నా కొడుకుని తీసుకు వెళ్లి నీతి పాఠాలు బాగా నేర్పుతాము అన్నారు. ద్రోహబుద్ధితో అతనికి శత్రువు విష్ణుమూర్తి కథలు నూరిపోశారా.
ఇలా మండిపడుతున్న హిరణ్యకశిప మహారాజుతో ప్రహ్లాదుని గురువులు అయిన చండమార్కులు వినయంగా ఇలా చెప్పారు.
“ఓ రాక్షసరాజా! మా వల్ల ఏ తప్పు జరగలేదు. నీకు వ్యతిరేకంగా మేము ఎప్పుడూ ప్రవర్తించము. నీ పుత్రుడికి మేము విరోధి కథలు చెప్పము, చెప్పలేదు. మరి ఎవరూ అంత సాహసం చేసి చెప్పలేదు. నీ పాదాల మీద ఒట్టు. మీ వాడికి సహజంగా అబ్బిన బుద్ధే తప్ప ఒకరు చెప్తే వచ్చింది కాదు. కాబట్టి ప్రస్తుతం దీనికి ప్రతిక్రియ జాగ్రత్తగా శీఘ్రమే ఆలోచించు.ఇలా శుక్రాచార్యుని పుత్రులు చండామార్కులు అనేటప్పటికి, ఆ రాక్షసరాజు హిరణ్యకశిపుడు వారిపై కోపం విడిచి పెట్టాడు. తన కొడుకుతో ఇలా అన్నాడు
“ప్రహ్లాదా! నువ్వేమో చిన్న పిల్లాడివి. ఈ విషయాలు మీ ఉపాధ్యాయులు చెప్ప లేదు. మరి నా కడుపున పుట్టిన నీకు ఇలాంటి బుద్ధులు ఎలా వచ్చాయి? నీకు ఇవన్నీ ఎవరు చెప్పారు? వాళ్లెవరో నాకు చెప్పు.”
ఇలా అడుగుతున్న తండ్రితో ప్రహ్లాదుడు ఇలా అన్నాడు.“అజ్ఞానం అనేది అసలైన కారు చీకటి, దాని మాయకు చిక్కి సంసారులు అనేకులు, కోరికల వలలో పడి సంసారం సాగిస్తూ ఉంటారు. చస్తూ, పుడుతూ, మరల చస్తూ, పుడుతూ ఇలా ఈ సంసారచక్రంలో తిరుగుతూనే ఉంటారు. అలాంటి వారికి విష్ణుభక్తి అంత సులువుగా పుట్టదు. ఇంకొకరు బోధించినా కలగదు; ఏమి ఆశ చూపించినా, ఎంతటి దానాలు చేసినా అంటదు; ఆఖరుకి అడవులలోకి పోయినా ఫలితం ఉండదు; అంత తొందరగా శ్రీహరి మీదికి మనసు పోతుందా? చెప్పు. హరిభక్తి లభించాలి అంటే ఎన్నో జన్మల పుణ్య ఫలాలు ఫలించాలి. తండ్రీ! రాక్షసేశ్వరా! గుడ్డివాడు మరొక గుడ్డివాడి సాయం తీసుకొని ఏ వస్తువును విశేషంగా తెలుసుకోలేడు కదా! అదే విధంగా విషయాసక్తులై కర్మబంధాలలో చిక్కుకున్నవారు శ్రీహరిని చూడలేరు. కొందరు పుణ్యాత్ములు మాత్రం గొప్ప విష్ణుభక్తుల పాద ధూళి తమ తలమీద ధరించి కర్మలను త్యజించి పూర్ణ చిత్తులు అవుతారు; అంతట వారు వైకుంఠవాసుని వీక్షించగలుగుతారు.
ఇలా పలుకుతున్న పుత్రుడిని ఆ రాక్షసరాజు హిరణ్యకశిపుడు గదిమాడు. ఒక్కసారిగా పుత్ర ప్రేమ పోయింది. ఒళ్ళో కూర్చోబెట్టుకున్న కన్న కొడుకును ఒక్క తోపు తోసేశాడు. తీవ్రమైన కోపంతో కళ్ళల్లోంచి నిప్పులు రాలుతుండగా, మంత్రులతో ఇలా అన్నాడు “ వీడు అయిదేండ్ల వాడు. కన్న తండ్రిని నన్నే ఎదిరిస్తున్నాడు. నన్ను లెక్క చేయకుండా, నదురు బెదురు లేకుండా, నా ఎదుటే శత్రువైన హరిని పొగడుతున్నాడు. “వద్దురా కన్నా!” అని నచ్చజెప్పినా వినటం లేదు. నా శరీరంలో పుట్టిన వ్యాధిలా పుత్రరూపంలో పుట్టుకొని వచ్చాడు. అందుచేత, మీరు ఈ ప్రహ్లాదుడిని తీసుకువెళ్ళి వధించి రండి. మీమీ పరాక్రమాలు ప్రదర్శించండి,” అని ఆదేశించాడు.

వారు శూలముతో పొడిచారు. పాములచే కరిపించారి. ఏనుగులతో తొక్కించారు. కొండకొమ్ముల మీది నుండి పడదోసిరి. విషము బెట్టిరి. అగ్నిలో త్రోసిరి. సముద్రములో ముంచివేసిరి. అన్నము నీరు పెట్టక మాడ్చిరి. ఎన్నిచేసినను ప్రహ్లాదుడు చావలేదు. హరినామస్మరణ మానలేదు. కొంచెము గూడా భయపడలేదు. ఎన్నిచేసినను చావని కొడుకును చూచి రాక్షసరాజు ఆశ్చర్యపడి, చిన్న పిల్లవాడైనందున ఇట్లు చేయు చున్నాడని తలచి పెద్దైనచో మార గలడని తలచి రాక్షస గురువులను పిలిపించి వీనికి మరలా విద్య బోదించమని ఆజ్ఞాపించెను.

ఆధ్యాత్మిక తత్వమును తెలిసికోవలంటే శరీరమందే బ్రహ్మపదమును సాక్షాత్కారముచేసుకోవాలి. ప్రకృతి సత్వ,రజ,తమో గుణాలు కలిగి వుంటుంది. పది ఇంద్రియములు,మనస్సు,పంచభూతములు అను పదహారు దాని వికారములు. వీటి సముదాయమే దేహము. బుద్దియే దీనికి ఆలంబనము. జాగ్రత్,స్వప్న,సుషుప్తి బుద్ది యొక్క ప్రవృత్తులు. ఇవి ఎవరి అనుభవమునకు వచ్చునో అతడే పరమాత్మ. అతడే శ్రీహరి. అతడి ఎడల ప్రేమ కలిగి ఉండుటమే భక్తికి మూలము. గురువును సేవించు, తనకు దొరికిన పదార్థముతోనే తృప్తి పడడం, సాధు పురుషులతో సాంగత్యము హరి కథలను శ్రద్ధగా వినడం హరిని కీర్తించడం మొదలగు సాధనముల ద్వారా హరిని చేరుకోవచ్చు.

నైవేధ్యము

నైవేధ్యము స్వామివారికి సమర్పించి టెంకాయ కొట్టండి

నీరాజనము (హారతి)

(కర్పూరముతోగాని నూనెవత్తులతోగాని హారతి యివ్వవచ్చును)

రవ్వలకొండ శ్రీనరసింహునికి జయమంగళం
మా తండ్రీ శ్రీ నరహరికి శుభమంగళం
మా అమ్మ చెంచులక్ష్మీకి నిత్యమంగళం
నిత్యం కొలిచే దైవం శ్రీ నరసింహస్వామికి 
మంగళం జయమంగళం మంగళం శుభమంగళం

ఉగ్రనరసింహునిగ అవతరించితివి
హిరణ్యకశిపున్ని తుదముట్టించితివి
ప్రహ్లాదున్ని బ్రోచితివి భక్తుల మనసు దోసితివి
నిత్యం కొలిచే దైవం శ్రీ నరసింహస్వామికి 
మంగళం జయమంగళం మంగళం శుభమంగళం

రవ్వలకొండ శ్రీనరసింహునికి జయమంగళం
మా తండ్రీ శ్రీ నరహరికి శుభమంగళం
మా అమ్మ చెంచులక్ష్మీకి నిత్యమంగళం
నిత్యం కొలిచే దైవం శ్రీ నరసింహస్వామికి 
మంగళం జయమంగళం మంగళం శుభమంగళం

చెంచులక్ష్మీని చేపట్టితివి
చెంచులక్ష్మీసమేతుడవైతివి
రవ్వలకొండపై కొలువైతివి
నిత్యం కొలిచే దైవం శ్రీ నరసింహస్వామికి 
మంగళం జయమంగళం మంగళం శుభమంగళం

రవ్వలకొండ శ్రీనరసింహునికి జయమంగళం
మా తండ్రీ శ్రీ నరహరికి శుభమంగళం
మా అమ్మ చెంచులక్ష్మీకి నిత్యమంగళం
నిత్యం కొలిచే దైవం శ్రీ నరసింహస్వామికి 
మంగళం జయమంగళం మంగళం శుభమంగళం

అర్చన చేద్దాము
మనసు అర్పన చేద్దాము
స్వామికి మదిలో కోవెల కడదాం
నిత్యం కొలిచే దైవం శ్రీ నరసింహస్వామికి 
మంగళం జయమంగళం మంగళం శుభమంగళం

రవ్వలకొండ శ్రీనరసింహునికి జయమంగళం
మా తండ్రీ శ్రీ నరహరికి శుభమంగళం
మా అమ్మ చెంచులక్ష్మీకి నిత్యమంగళం
నిత్యం కొలిచే దైవం శ్రీ నరసింహస్వామికి 
మంగళం జయమంగళం మంగళం శుభమంగళం

స్వామిని పూజించే చేతులే చేతులు
శ్రీమూర్తిని దర్శించే కన్నులే కన్నులు
శ్రీహరి కథలు విన్న చెవులే చెవులు
నిత్యం కొలిచే దైవం శ్రీ నరసింహస్వామికి
మంగళం జయమంగళం మంగళం శుభమంగళం

రవ్వలకొండ శ్రీనరసింహునికి జయమంగళం
మా తండ్రీ శ్రీ నరహరికి శుభమంగళం
మా అమ్మ చెంచులక్ష్మీకి నిత్యమంగళం
నిత్యం కొలిచే దైవం శ్రీ నరసింహస్వామికి 
మంగళం జయమంగళం మంగళం శుభమంగళం

ఎవరైతే యీ పూజ ఆచరించాలనుకుంటారో వారికి పుస్త్రకదానము చేయండి

ఆన్ని దానలలొకెల్ల విధ్యాదనము,అన్నదానము గొప్పది. ఇంతటితో యీరోజు స్వాతిపూజ ముగిసింది.