రవ్వలకొండ శ్రీశ్రీశ్రీ చెంచులక్ష్మీ సమేత పావన నరసింహస్వామి స్వాతి మనొభీష్ట పూజ విదానము

5 వ స్వాతి మనొభీష్ట పూజ

పూజ ప్రారంభము

                     ముందుగా వస్రము పరచి పటాలను ఉంఛండి. పటాలకు కుంకుమ లేదా చందనము బొట్లు పెట్టండి. పూలమాల వేసి,ధీపము వెలగించండి.అగరబత్తీలు కూడా వెలిగించండి.విడిపూలు అష్టోత్తరశతనామావళికి సిద్ధముగా ఉoచుకోండి.అరటి పండ్లు పెట్టండి. నైవేధ్యము సిద్ధముగా ఉoచుకోండి . ఇప్పుడు పూజ ప్రారంభించుకుందాము

ప్రార్థన

శుక్లాం భరదరం విష్ణుం, శశివర్ణం చతుర్భుజం,
ప్రసన్న వదనం ద్యాయేత్ , సర్వ విగ్నోప శాంతయే .
అగజానన పద్మార్కం, గజానన మహర్నిశం ,
అనేక దంతం భక్తానాం, ఏకదంతం ఉపాస్మహే

(తెల్లని వస్త్రములతో  అంతటా వ్యాపించిన వాడై, చంద్రుని వంటి ప్రకాశం కలవాడై,నాలుగు భుజములు(చేతులు) కలవాడై, ప్రసన్నమైనటువంటి ముఖముకలవాడిని  ధ్యానించుచున్నాము. నాయకత్వం లేని మాకు నాయకుడివై మమ్ములను నడిపించు.కొన్ని కోట్ల జీవరాశులు భక్తితో  ఏక దంతుడవైన నిన్ను ఉపాసన చేయుచున్నాము)

శ్లో|| ఏకేన చక్ర మపరేణ కరేణ శంఖ - మన్యేన సిన్దు తనయా మవ లంబ్య తిష్ఠన్

వామేతరేణ వరదాభయ పద్మచిహ్నం - లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||

( దేవా! చతుర్భుజుడవగు నీవు ఒక చేత శంఖమును, ఒకచేత చక్రమును, ఒక చేత లక్ష్మీ దేవిని ధరించి, ఒక కుడి చేతితో అభయమునిచ్చు హస్తముద్రను దాల్చి యుందువు. అట్టి మహానీయుడవగు నృసింహ దేవా! చేయూతనోసగి నన్ను కాపాడుము)

శ్లో|| సంసార యోగి సకలే ప్సిత నిత్యకర్మ సంప్రాప్య దుఃఖ సకలన్ద్రియ మృత్యునాశ -

సజ్కల్ప సిందు తనయాకు చ కు జ్క మాజ్క ! లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||

( ఓ దేవా! లేనిపోని కోరికలకు సంసారమే కారణము. ఆ కోరికలు నేరవేరుటకై నిత్యమూ ఏవో  చేయవలసి వచ్చుచున్నది. అందువలన నీవు సంకల్పించినచొ అవి అన్నియు నశించును. లక్ష్మీ దేవి యొక్క కుచ కుంకుమచే చిహ్నితమగు వక్ష స్స్థలముకల నృసింహదేవా! నా సంసార బాధలను పోగొట్టి నన్ను రక్షింపుము.)

సత్యజ్ఞాన శివస్వరూప మమలమ్ క్షీరాబ్ధి మధ్యస్థితం
యోగారూఢ మతిప్రసన్న వదనమ్ భూషా సహస్రోజ్వలమ్|
త్ర్యక్షం చక్ర పినాక సాభయ వరాన్విభ్రాణమర్కచ్ఛవిమ్
ఛత్రీభూత ఫణీన్ద్ర మిన్దు ధవళమ్ లక్ష్మీనృసింహం భజే||

సంకల్పం

(మీరు దేని విషయమై ఈ పూజచేయుటకు సంకల్పించుకున్నారొ -ఆ కోరికలు భక్తి,శ్రద్ధలతో స్వామికి విన్నవించుకోవాలి.మీ సంకల్పము నెరవేరేవరకు  ప్రతి స్వాతికి యీ సంకల్పమే విన్నవించుకోవాలి.)

ధ్యానము

(స్వామివారిపై దృష్టిని కొద్దిక్షణాలు నిలిపి కళ్ళుమూసుకొని స్వామివారిని రెండు నిమిషాలు ధ్యానము చేయాలి. తర్వాత మెల్లగా కళ్ళు తెరచి స్వామిని దర్శించుకొని నమస్కరించాలి.)

శ్రీ నరసింహ స్వామి అష్టోత్తర శతనామావళి

(ప్రతి నామానికి ఒక పువ్వు స్వామివారి చెంతనుంచాలి

 

ఓం నారసింహాయ నమః

ఓం మహాసింహాయ నమః

ఓం దివ్య సింహాయ నమః

ఓం మహాబలాయ నమః

ఓం ఉగ్ర సింహాయ నమః

ఓం మహాదేవాయ నమః

ఓం స్తంభజాయ నమః

ఓం ఉగ్రలోచనాయ నమః

ఓం రౌద్రాయ నమః

ఓం సర్వాద్భుతాయ నమః || 10 ||

ఓం శ్రీమతే నమః

ఓం యోగానందాయ నమః

ఓం త్రివిక్రమాయ నమః

ఓం హరయే నమః

ఓం కోలాహలాయ నమః

ఓం చక్రిణే నమః

ఓం విజయాయ నమః

ఓం జయవర్ణనాయ నమః

ఓం పంచాననాయ నమః

ఓం పరబ్రహ్మణే నమః || 20 ||

ఓం అఘోరాయ నమః

ఓం ఘోర విక్రమాయ నమః

ఓం జ్వలన్ముఖాయ నమః

ఓం మహా జ్వాలాయ నమః

ఓం జ్వాలామాలినే నమః

ఓం మహా ప్రభవే నమః

ఓం నిటలాక్షాయ నమః

ఓం సహస్రాక్షాయ నమః

ఓం దుర్నిరీక్షాయ నమః

ఓం ప్రతాపనాయ నమః || 30 ||

ఓం మహాదంష్ట్రాయుధాయ నమః

ఓం ప్రాఙ్ఞాయ నమః

ఓం చండకోపినే నమః

ఓం సదాశివాయ నమః

ఓం హిరణ్యక శిపుధ్వంసినే నమః

ఓం దైత్యదానవ భంజనాయ నమః

ఓం గుణభద్రాయ నమః

ఓం మహాభద్రాయ నమః

ఓం బలభద్రకాయ నమః

ఓం సుభద్రకాయ నమః || 40 ||

ఓం కరాళాయ నమః

ఓం వికరాళాయ నమః

ఓం వికర్త్రే నమః

ఓం సర్వర్త్రకాయ నమః

ఓం శింశుమారాయ నమః

ఓం త్రిలోకాత్మనే నమః

ఓం ఈశాయ నమః

ఓం సర్వేశ్వరాయ నమః

ఓం విభవే నమః

ఓం భైరవాడంబరాయ నమః || 50 ||

ఓం దివ్యాయ నమః

ఓం అచ్యుతాయ నమః

ఓం కవయే నమః

ఓం మాధవాయ నమః

ఓం అధోక్షజాయ నమః

ఓం అక్షరాయ నమః

ఓం శర్వాయ నమః

ఓం వనమాలినే నమః

ఓం వరప్రదాయ నమః

ఓం అధ్భుతాయ నమః ll 60 ll

ఓం భవ్యాయ నమః

ఓం శ్రీవిష్ణవే నమః

ఓం పురుషోత్తమాయ నమః

ఓం అనఘాస్త్రాయ నమః

ఓం నఖాస్త్రాయ నమః

ఓం సూర్య జ్యోతిషే నమః

ఓం సురేశ్వరాయ నమః

ఓం సహస్రబాహవే నమః

ఓం సర్వఙ్ఞాయ నమః 

ఓం సర్వసిద్ధ ప్రదాయకాయ నమః II70II

ఓం వజ్రదంష్ట్రయ నమః

ఓం వజ్రనఖాయ నమః

ఓం మహానందాయ నమః

ఓం పరంతపాయ నమః

ఓం సర్వమంత్రైక రూపాయ నమః

ఓం సర్వమంత్ర విధారణాయ నమ:

ఓం సర్వతంత్రాత్మకాయ నమః

ఓం అవ్యక్తాయ నమః

ఓం సువ్యక్తాయ నమః 

ఓం భక్ర వత్సలాయ నమ: II80II

 ఓం వైశాఖ శుక్ల భూతోత్ధాయ నమః

ఓం శరణాగత వత్సలాయ నమః

ఓం ఉదార కీర్తయే నమః

ఓం పుణ్యాత్మనే నమః

ఓం మహాత్మనే నమ:

ఓం దండ విక్రమాయ నమః

ఓం వేదత్రయ ప్రపూజ్యాయ నమః

ఓం భగవతే నమః

ఓం పరమేశ్వరాయ నమః

ఓం శ్రీ వత్సాంకాయ నమః || 90 ||

ఓం శ్రీనివాసాయ నమః

ఓం జగద్వ్యాపినే నమః

ఓం జగన్మయాయ నమః

 ఓం జగత్పాలాయ నమః

ఓం జగన్నాధాయ నమః

ఓం మహాకాయాయ నమః

ఓం ద్విరూపభ్రుతే నమః

ఓం పరమాత్మనే నమః

ఓం పరజ్యోతిషే నమః

ఓం నిర్గుణాయ నమః || 100 ||

ఓం నృకేసరిణే నమః

ఓం పరతత్త్వాయ నమః

ఓం పరంధామ్నే నమః

ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః

ఓం లక్ష్మీనృసింహాయ నమః

ఓం సర్వాత్మనే నమః

ఓం ధీరాయ నమః

ఓం ప్రహ్లాద పాలకాయ నమఃII108II

ఓం లక్ష్మీనరసింహ అష్టొత్తర శతనామావళి సంపూర్ణం

5 వ స్వాతి కథ

 హిరణ్యకశిపుడు సోదరుని మరణానికి కారణమైన విష్ణుపై ద్వేషము పెంచుకున్నాడు. విష్ణువున్ని అంతము చేయాలన్న సంకల్పముతో తపస్సు చేయాడానికి వెళ్ళాడు. ఆ సమయంలొ హిరాణ్యకశిపుని భార్య లీలావతి గర్భవతి. లీలావతి తన భర్తకు ఎన్నోసార్లు మంచిగా వుండమని చెప్పింది. కాని ఆ మాటలు పట్టికునేవాడు కాదు. ద్వేషము,పగ  ప్రతికారము అణువణువు నింపుకున్నాడు.అదే లక్ష్యం, ద్యేయముగా చేసుకొని,లోకకంటకుడుగా మారాడు.
హిరణ్యకశిపుడు లేడని తెలుసుకున్న ఇంద్రుడు లీలావతిని అపహరించుకు పోతుంటే,నారద మహర్షి చూస్తాడు . ఇది తగదని,ఆమె గర్భవతి అని నచ్చచెప్పి తన ఆశ్రమానికి తీసుకుపోతాడు. నారాయణ మంత్రము ఉపదేశిస్తాడు.లీలవతికి చెప్పేమాటలు,ఆమె గర్భములోని శిశివు వింటున్నాడని గ్రహిస్తాడు. అప్పటి నుంచి విష్ణు గీతలు భోదించడం మొదలు పెడ్తాడు. అలా గర్భములోవున్న శిశువును విష్ణు భక్తుడయ్యేలా తయారుచేస్తాడు.కొంత కాలనికి లీలావతి మగబిడ్డకు జన్మనిస్తుంది. ఆ బిడ్డకు ప్రహ్లాదుడని నామాకరము చెస్తారు.
బ్రహ్మచే వరాలు పొంది అంతపురానికి వచ్చిన హిరణ్యాకశిపుడు,లీలవతి నారాదమహర్షి ఆశ్రములో వుందని, కొడుకుపుట్టాడని సంతోషిస్తాడు. వెంటనే ఆశ్రమానికి వెళ్ళి నారాదమహర్షికి నమస్కరించి కృతజ్ఞతలు తెల్పి,భార్యను,కొడుకును తీసుకువచ్చి సంబరాలు చేసుకుంటాడు. తర్వాత లోకాలను జయించడానికి హిరణ్యకశిపుడు తన బలగముతో దందయాత్రలు సాగిస్తుంటాడు. ప్రహ్లాదుడు హరినామ సంకీర్తనతో హరిపై మరింత భక్తిని పెంచుకున్నాడు.

భక్తి అంటే ఏమిటి?
భక్తి అంటే సేవ అని అర్థం. మోక్షాన్ని పొందేందుకు ఉపయోగించే సాధనమే భక్తి. పరమాత్మను సేవించడం,పరమాత్మను సాటి మనిషిలో దర్శించడం భక్తి. మనలోని చేడు గుణాలను సంస్కరించడం.మానవత్వాన్ని పెంచి పరతత్వంవైపు నడిపించే మహత్తర శక్తే భక్తి.
బయంతో కొందరు,ఇంట్లోని ప్రోద్బల్యము వలన కొందరు,కోరికలు తీర్చుకొనుటకు కొందరు భక్తి మార్గమును ఎంచుకుంటుంటారు.ధర్మబద్ధంగా వుండటానికి ఊతమిస్తుంది భక్తి.అందువలననే భక్తి భారతీయ మనుగడలో అంతర్భాగమయింది. మంత్రాలు తంత్రాలు అవసరము లేదు. మన శక్తికొలది మనకు తెలిసిన రీతిలో భగవంతున్ని సేవిద్దాము. సాలెపురుగు,పాము,ఏనుగు ఏ మంత్రము నేర్చుకున్నాయి. తమతమ శక్తానుసారము పరమేశ్వరుని పూజించి మోక్షాన్ని పొందలేదా!

ఎవరైతె తాత్కాలిక సుఖాలకు ఆశపడరో,ఎవరైతే అశాశ్వితమైన యీ దేహం కోసం ప్రాకులాడరో లేదా ఆరాటపడరో,ఎవరైతే తల్లిదండ్రులను,కుటుంబసభ్యులను,బందువులను,సాటి మనషులనూ గౌరవిస్తారో వారే నిజమైన భక్తి పరాయణులు.

భావితరాలకు మంచి జీవనాన్ని అందించేలా పర్యావరణాన్ని పరిరక్షిస్తూ, సర్వప్రాణులలో భగవంతున్ని దర్శిస్తూ సనాతన ధర్మాన్ని కాపాడడమే నిజమైన భక్తి.

ఒక్కోసారి భక్తి కూడా అహంకారాన్ని కలిగిస్తుందని మనకు చరిత్ర చెబుతుంది.నేనే భగవంతుని మీద అపార భక్తిని కలిగిఉన్నవాడిని అనే తలంపు చేటు తెస్తుంది. తామసగుణంతో భక్తిని పెంచుకోగూడదు.సత్వగుణాన్ని పెంచుకుంటూ భక్తిమార్గంలో వెళ్లేవారికి అన్నీ శుభాలే కలుగుతాయి. భగవంతుని తత్వాన్నిగురించి తెలుసుకొంటూ ఉండాలి. ప్రకృతి నేర్పించే త్యాగ గుణాన్ని అలవర్చుకోవాలి. త్యాగమే మహోన్నత గుణమని తెలుసుకొంటే పరమాత్మ తత్వం సులభంగా బోధపడుతుంది.

హరినామ సంకీర్తన చేద్దాము -భక్రి మార్గములో నడుద్దాము

నైవేధ్యము

నైవేధ్యము స్వామివారికి సమర్పించి టెంకాయ కొట్టండి

నీరాజనము (హారతి)

(కర్పూరముతోగాని నూనెవత్తులతోగాని హారతి యివ్వవచ్చును)

రవ్వలకొండ శ్రీనరసింహునికి జయమంగళం
మా తండ్రీ శ్రీ నరహరికి శుభమంగళం
మా అమ్మ చెంచులక్ష్మీకి నిత్యమంగళం
నిత్యం కొలిచే దైవం శ్రీ నరసింహస్వామికి 
మంగళం జయమంగళం మంగళం శుభమంగళం

ఉగ్రనరసింహునిగ అవతరించితివి
హిరణ్యకశిపున్ని తుదముట్టించితివి
ప్రహ్లాదున్ని బ్రోచితివి భక్తుల మనసు దోసితివి
నిత్యం కొలిచే దైవం శ్రీ నరసింహస్వామికి 
మంగళం జయమంగళం మంగళం శుభమంగళం

రవ్వలకొండ శ్రీనరసింహునికి జయమంగళం
మా తండ్రీ శ్రీ నరహరికి శుభమంగళం
మా అమ్మ చెంచులక్ష్మీకి నిత్యమంగళం
నిత్యం కొలిచే దైవం శ్రీ నరసింహస్వామికి 
మంగళం జయమంగళం మంగళం శుభమంగళం

చెంచులక్ష్మీని చేపట్టితివి
చెంచులక్ష్మీసమేతుడవైతివి
రవ్వలకొండపై కొలువైతివి
నిత్యం కొలిచే దైవం శ్రీ నరసింహస్వామికి 
మంగళం జయమంగళం మంగళం శుభమంగళం

రవ్వలకొండ శ్రీనరసింహునికి జయమంగళం
మా తండ్రీ శ్రీ నరహరికి శుభమంగళం
మా అమ్మ చెంచులక్ష్మీకి నిత్యమంగళం
నిత్యం కొలిచే దైవం శ్రీ నరసింహస్వామికి 
మంగళం జయమంగళం మంగళం శుభమంగళం

అర్చన చేద్దాము
మనసు అర్పన చేద్దాము
స్వామికి మదిలో కోవెల కడదాం
నిత్యం కొలిచే దైవం శ్రీ నరసింహస్వామికి 
మంగళం జయమంగళం మంగళం శుభమంగళం

రవ్వలకొండ శ్రీనరసింహునికి జయమంగళం
మా తండ్రీ శ్రీ నరహరికి శుభమంగళం
మా అమ్మ చెంచులక్ష్మీకి నిత్యమంగళం
నిత్యం కొలిచే దైవం శ్రీ నరసింహస్వామికి 
మంగళం జయమంగళం మంగళం శుభమంగళం

స్వామిని పూజించే చేతులే చేతులు
శ్రీమూర్తిని దర్శించే కన్నులే కన్నులు
శ్రీహరి కథలు విన్న చెవులే చెవులు
నిత్యం కొలిచే దైవం శ్రీ నరసింహస్వామికి
మంగళం జయమంగళం మంగళం శుభమంగళం

రవ్వలకొండ శ్రీనరసింహునికి జయమంగళం
మా తండ్రీ శ్రీ నరహరికి శుభమంగళం
మా అమ్మ చెంచులక్ష్మీకి నిత్యమంగళం
నిత్యం కొలిచే దైవం శ్రీ నరసింహస్వామికి 
మంగళం జయమంగళం మంగళం శుభమంగళం

ఎవరైతే యీ పూజ ఆచరించాలనుకుంటారో వారికి పుస్త్రకదానము చేయండి

ఆన్ని దానలలొకెల్ల విధ్యాదనము,అన్నదానము గొప్పది. ఇంతటితో యీరోజు స్వాతిపూజ ముగిసింది.