రవ్వలకొండ శ్రీశ్రీశ్రీ చెంచులక్ష్మీ సమేత పావన నరసింహస్వామి స్వాతి మనొభీష్ట పూజ విదానము

2 వ స్వాతి మనొభీష్ట పూజ

పూజ ప్రారంభము

                     ముందుగా వస్రము పరచి పటాలను ఉంఛండి. పటాలకు కుంకుమ లేదా చందనము బొట్లు పెట్టండి. పూలమాల వేసి,ధీపము వెలగించండి.అగరబత్తీలు కూడా వెలిగించండి.విడిపూలు అష్టోత్తరశతనామావళికి సిద్ధముగా ఉoచుకోండి.అరటి పండ్లు పెట్టండి. నైవేధ్యము సిద్ధముగా ఉoచుకోండి . ఇప్పుడు పూజ ప్రారంభించుకుందాము

ప్రార్థన

శుక్లాం భరదరం విష్ణుం, శశివర్ణం చతుర్భుజం,
ప్రసన్న వదనం ద్యాయేత్ , సర్వ విగ్నోప శాంతయే .
అగజానన పద్మార్కం, గజానన మహర్నిశం ,
అనేక దంతం భక్తానాం, ఏకదంతం ఉపాస్మహే

(తెల్లని వస్త్రములతో  అంతటా వ్యాపించిన వాడై, చంద్రుని వంటి ప్రకాశం కలవాడై,నాలుగు భుజములు(చేతులు) కలవాడై, ప్రసన్నమైనటువంటి ముఖముకలవాడిని  ధ్యానించుచున్నాము. నాయకత్వం లేని మాకు నాయకుడివై మమ్ములను నడిపించు.కొన్ని కోట్ల జీవరాశులు భక్తితో  ఏక దంతుడవైన నిన్ను ఉపాసన చేయుచున్నాము)

శ్లో|| ఏకేన చక్ర మపరేణ కరేణ శంఖ - మన్యేన సిన్దు తనయా మవ లంబ్య తిష్ఠన్

వామేతరేణ వరదాభయ పద్మచిహ్నం - లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||

( దేవా! చతుర్భుజుడవగు నీవు ఒక చేత శంఖమును, ఒకచేత చక్రమును, ఒక చేత లక్ష్మీ దేవిని ధరించి, ఒక కుడి చేతితో అభయమునిచ్చు హస్తముద్రను దాల్చి యుందువు. అట్టి మహానీయుడవగు నృసింహ దేవా! చేయూతనోసగి నన్ను కాపాడుము)

శ్లో|| సంసార యోగి సకలే ప్సిత నిత్యకర్మ సంప్రాప్య దుఃఖ సకలన్ద్రియ మృత్యునాశ -

సజ్కల్ప సిందు తనయాకు చ కు జ్క మాజ్క ! లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||

( ఓ దేవా! లేనిపోని కోరికలకు సంసారమే కారణము. ఆ కోరికలు నేరవేరుటకై నిత్యమూ ఏవో  చేయవలసి వచ్చుచున్నది. అందువలన నీవు సంకల్పించినచొ అవి అన్నియు నశించును. లక్ష్మీ దేవి యొక్క కుచ కుంకుమచే చిహ్నితమగు వక్ష స్స్థలముకల నృసింహదేవా! నా సంసార బాధలను పోగొట్టి నన్ను రక్షింపుము.)

సత్యజ్ఞాన శివస్వరూప మమలమ్ క్షీరాబ్ధి మధ్యస్థితం
యోగారూఢ మతిప్రసన్న వదనమ్ భూషా సహస్రోజ్వలమ్|
త్ర్యక్షం చక్ర పినాక సాభయ వరాన్విభ్రాణమర్కచ్ఛవిమ్
ఛత్రీభూత ఫణీన్ద్ర మిన్దు ధవళమ్ లక్ష్మీనృసింహం భజే||

సంకల్పం

(మీరు దేని విషయమై ఈ పూజచేయుటకు సంకల్పించుకున్నారొ -ఆ కోరికలు భక్తి,శ్రద్ధలతో స్వామికి విన్నవించుకోవాలి.మీ సంకల్పము నెరవేరేవరకు  ప్రతి స్వాతికి యీ సంకల్పమే విన్నవించుకోవాలి.)

ధ్యానము

(స్వామివారిపై దృష్టిని కొద్దిక్షణాలు నిలిపి కళ్ళుమూసుకొని స్వామివారిని రెండు నిమిషాలు ధ్యానము చేయాలి. తర్వాత మెల్లగా కళ్ళు తెరచి స్వామిని దర్శించుకొని నమస్కరించాలి.)

శ్రీ నరసింహ స్వామి అష్టోత్తర శతనామావళి

(ప్రతి నామానికి ఒక పువ్వు స్వామివారి చెంతనుంచాలి

ఓం నారసింహాయ నమః

ఓం మహాసింహాయ నమః

ఓం దివ్య సింహాయ నమః

ఓం మహాబలాయ నమః

ఓం ఉగ్ర సింహాయ నమః

ఓం మహాదేవాయ నమః

ఓం స్తంభజాయ నమః

ఓం ఉగ్రలోచనాయ నమః

ఓం రౌద్రాయ నమః

ఓం సర్వాద్భుతాయ నమః || 10 ||

ఓం శ్రీమతే నమః

ఓం యోగానందాయ నమః

ఓం త్రివిక్రమాయ నమః

ఓం హరయే నమః

ఓం కోలాహలాయ నమః

ఓం చక్రిణే నమః

ఓం విజయాయ నమః

ఓం జయవర్ణనాయ నమః

ఓం పంచాననాయ నమః

ఓం పరబ్రహ్మణే నమః || 20 ||

ఓం అఘోరాయ నమః

ఓం ఘోర విక్రమాయ నమః

ఓం జ్వలన్ముఖాయ నమః

ఓం మహా జ్వాలాయ నమః

ఓం జ్వాలామాలినే నమః

ఓం మహా ప్రభవే నమః

ఓం నిటలాక్షాయ నమః

ఓం సహస్రాక్షాయ నమః

ఓం దుర్నిరీక్షాయ నమః

ఓం ప్రతాపనాయ నమః || 30 ||

ఓం మహాదంష్ట్రాయుధాయ నమః

ఓం ప్రాఙ్ఞాయ నమః

ఓం చండకోపినే నమః

ఓం సదాశివాయ నమః

ఓం హిరణ్యక శిపుధ్వంసినే నమః

ఓం దైత్యదానవ భంజనాయ నమః

ఓం గుణభద్రాయ నమః

ఓం మహాభద్రాయ నమః

ఓం బలభద్రకాయ నమః

ఓం సుభద్రకాయ నమః || 40 ||

ఓం కరాళాయ నమః

ఓం వికరాళాయ నమః

ఓం వికర్త్రే నమః

ఓం సర్వర్త్రకాయ నమః

ఓం శింశుమారాయ నమః

ఓం త్రిలోకాత్మనే నమః

ఓం ఈశాయ నమః

ఓం సర్వేశ్వరాయ నమః

ఓం విభవే నమః

ఓం భైరవాడంబరాయ నమః || 50 ||

ఓం దివ్యాయ నమః

ఓం అచ్యుతాయ నమః

ఓం కవయే నమః

ఓం మాధవాయ నమః

ఓం అధోక్షజాయ నమః

ఓం అక్షరాయ నమః

ఓం శర్వాయ నమః

ఓం వనమాలినే నమః

ఓం వరప్రదాయ నమః

ఓం అధ్భుతాయ నమః ll 60 ll

ఓం భవ్యాయ నమః

ఓం శ్రీవిష్ణవే నమః

ఓం పురుషోత్తమాయ నమః

ఓం అనఘాస్త్రాయ నమః

ఓం నఖాస్త్రాయ నమః

ఓం సూర్య జ్యోతిషే నమః

ఓం సురేశ్వరాయ నమః

ఓం సహస్రబాహవే నమః

ఓం సర్వఙ్ఞాయ నమః 

ఓం సర్వసిద్ధ ప్రదాయకాయ నమః II70II

ఓం వజ్రదంష్ట్రయ నమః

ఓం వజ్రనఖాయ నమః

ఓం మహానందాయ నమః

ఓం పరంతపాయ నమః

ఓం సర్వమంత్రైక రూపాయ నమః

ఓం సర్వమంత్ర విధారణాయ నమ:

ఓం సర్వతంత్రాత్మకాయ నమః

ఓం అవ్యక్తాయ నమః

ఓం సువ్యక్తాయ నమః 

ఓం భక్ర వత్సలాయ నమ: II80II

 ఓం వైశాఖ శుక్ల భూతోత్ధాయ నమః

ఓం శరణాగత వత్సలాయ నమః

ఓం ఉదార కీర్తయే నమః

ఓం పుణ్యాత్మనే నమః

ఓం మహాత్మనే నమ:

ఓం దండ విక్రమాయ నమః

ఓం వేదత్రయ ప్రపూజ్యాయ నమః

ఓం భగవతే నమః

ఓం పరమేశ్వరాయ నమః

ఓం శ్రీ వత్సాంకాయ నమః || 90 ||

ఓం శ్రీనివాసాయ నమః

ఓం జగద్వ్యాపినే నమః

ఓం జగన్మయాయ నమః

 ఓం జగత్పాలాయ నమః

ఓం జగన్నాధాయ నమః

ఓం మహాకాయాయ నమః

ఓం ద్విరూపభ్రుతే నమః

ఓం పరమాత్మనే నమః

ఓం పరజ్యోతిషే నమః

ఓం నిర్గుణాయ నమః || 100 ||

ఓం నృకేసరిణే నమః

ఓం పరతత్త్వాయ నమః

ఓం పరంధామ్నే నమః

ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః

ఓం లక్ష్మీనృసింహాయ నమః

ఓం సర్వాత్మనే నమః

ఓం ధీరాయ నమః

ఓం ప్రహ్లాద పాలకాయ నమఃII108II

ఓం లక్ష్మీనరసింహ అష్టొత్తర శతనామావళి సంపూర్ణం

 శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం

విశ్వాథారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం |

లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం

వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ||

(శాంతమే ఆకారంగాకలవాడు, పాము(పక్క)పై పడుకున్నవాడు, పద్మం నాభియందు కలవాడు, దేవతలకు ప్రభువు, విశ్వానికి ఆధారం, [పాఠాంతరం- విశ్వమే తన ఆకారంగా కలిగినవాడు], ఆకాశంవంటి (రంగుకల)వాడు, మేఘంవంటి రంగుకలవాడు, శుభమైన శరీరం కలవాడు, లక్ష్మికి ఇష్టుడు, కమలాలవంటి కన్నులుకలవాడు, యోగులచేత హృదయంలో పొందవలసిన గమ్యంగా ధ్యానం చేయబడేవాడు, వ్యాపించటం స్వరూపంగా కలవాడు, సంసారభయాన్ని తొలగించేవాడు, అన్నిలోకాలకూ అధిపతికి (విష్ణువుకు) నమస్కరిస్తున్నాను. )

                  హిందూ మత సంప్రదాయంలో త్రిమూర్తులుగా కొలువబడే ముగ్గురు ప్రధాన దేవుళ్ళలో విష్ణువు ఒకడు. బ్రహ్మను సృష్టికర్తగాను, విష్ణువును సృష్టి పాలకునిగాను, శివుని సృష్టి నాశకునిగాను భావిస్తారు. శ్రీవైష్ణవం సంప్రదాయంలో విష్ణువు లేదా శ్రీమన్నారాయణుడు సర్వలోకైకనాధుడు, పరబ్రహ్మము, సర్వేశ్వరుడు. 

                అటు వంటి శ్రీ మహావిష్ణువు నివాసమున్న వైకుంఠానికి  జయ విజయులు ద్వారపాలకులుగా వున్నారు. శ్రీ మహా విష్ణువును దగ్గరగా వుండి అణునిత్యము సేవిస్తుండేవారు.

                     సనక,సనందన,సనాతన,సనత్కుమారులు బ్రహ్మ యొక్క మానస పుత్రులు. ఒకసారి వీరు మహవిష్ణువును దర్శించాలని వైకుంఠానికి బయలుదేరారు. వయస్సులో పెద్దవారైనప్పటికి చిన్నవారిగా కనిపిస్తారు. వీరు వైకుంఠ ద్వారము వద్దకు చేరుకుని లోపలికి ప్రవేశించబోయారు. ద్వారపాలకులైన జయవిజయులకు సనక ,సనందనాదులు చిన్నవారిగా అగుపించారు. దానితో వీరి ప్రవేశానికి అడ్డు నిలిచారు. స్వామివారి దర్శనము చేయడానికి వీలులేదని,స్వామివారు వేరే పనులందు నిమగ్నమైవున్నారని తెల్పారు. దానిని అగౌరముగా తలచి ఆ మునులు ఆగ్రహించి  జయవిజయులను భూలోకంలో మర్త్యులై సంచరించమని శాపము యిచ్చారు.

                   దానితో జయవిజయులు శ్రీమహావిష్ణువుకు విన్నవించుకున్నారు.వారి శాపం విన్న విష్ణువు "నేను సర్వాంతర్యామిని,అందరు నాతో గడపటానికి సమయము కలదు"అని వారి చేసిన పనికి విచారించి,మహావిష్ణువే స్వయముగా ద్వారము చెంతకు వెళ్ళి ,ఆ మునులను దగ్గరవుండి లోపలికి తీసుకువచ్చి ఉచితాసనముపై కూర్చోబెడతాడు. తర్వాత శాపం ఉపసంహరించుకోమని కోరతారు. దానికి సనక సనందానాది మునులు శాపము వెనక్కి తీసుకునే శక్తి మాకు లేదని,దానికి రెండు మార్గాలు సూచిస్తారు. వారికి పడ్డ శిక్ష గురించి ఏమి నిర్ణయించాలో ఆయనకే వదిలి వేస్తారు.

              అప్పుడు మహా విష్ణువు వారిరువుర్నీ పలుమార్లు విష్ణుభక్తులుగా జనియించి తిరిగి వైకుంఠానికి వస్తారో లేక మూడు సార్లు మహావిష్ణువు ఆగర్భ శత్రువులుగా, ఆయనకు సమానంగా శక్తివంతులుగా జన్మించి ఆయన చేతిలోనే మరణం పొంది వైకుంఠానికి వస్తారో తేల్చుకోమంటాడు. అందుకు వారు ద్వితీయ మార్గాన్నే ఎంచుకుంటారు.

                దాని ప్రకారమే వారు కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్య కశిపులుగా, త్రేతాయుగం లో రావణ కుంభకర్ణులుగా, ద్వాపర యుగం లో శిశుపాల దంతవక్త్రులు గా జన్మించి తిరిగి విష్ణు సాన్నిధ్యం పొందుతారు. కలియుగంలో వారికి శాపవిమోచనం కలిగింది. కాబట్టి చాలా విష్ణు దేవాలయాల్లో జయ విజయులు ద్వారపాలకులు గా చెక్కి ఉండటాన్ని గమనించవచ్చు.

భగవంతుడు సర్వశక్తిమంతుడే అయినా, తనకు తానూ మనకు జ్ఞానాన్ని ఇవ్వలేడు. ప్రకృతిలో మనకు కావాల్సిన గమ్యంతో బాటు ఆ గమ్యం చేరుకోడానికి కావలసిన గమనాన్ని కూడా ప్రకృతిలోనే ఉంచాడు. ఎలాగయితే ఆకలి తీర్చుకోడానికి కావలసిన ఆహారాన్ని ప్రకృతిలోనే ఉంచి ఆ ఆహారాన్ని సంపాదిచడానికి కావలసిన వ్యవసాయాత్మికా బుద్ధిని, ఆ బుద్ధితో వాడుకోడానికి కరణములు మనకు ఇచ్చాడో అదేవిధంగా ఆత్మజ్ఞానాన్ని జగత్తులో తన శక్తిగా ఉంచి అది అందుకోడానికి బుద్ధిని ఇచ్చి జ్ఞానాన్నివేదముల రూపంగా మనకు ఇచ్చాడు. తెలుసుకోవాలన్న ఇచ్చాశక్తినిచ్చి గురుముఖతః ఆ జ్ఞానాన్ని నేర్చుకోమన్నాడు. అన్ని ఇచ్చి ఉద్దరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్  అని మనలను మనమే ఉధ్ధరించుకోమన్నాడు. మన ప్రయత్నం లేకుండా మనకు జ్ఞాన ప్రాప్తి వస్తుందని ఎక్కడా అనలేదు.కాబట్టి సగుణ భక్తి జ్ఞానాన్ని ఇవ్వలేదు. అధ్యాత్మిక సాధనే  జ్ఞానాన్నిస్తుంది

ఎవరైతే, మిత్రులపట్ల మరియు శత్రువుల పట్ల ఒక్కలాగే ఉంటారో, గౌరవము-అపమానముల ఎడ, చలి-వేడిమి పట్ల, సుఖ-దుఖః ముల పట్ల సమబుద్ధితో ఉంటారో, మరియు చెడు సాంగత్యము ను విడిచి ఉంటారో; దూషణ మరియు పొగడ్తని ఒక్కలాగే తీసుకుంటారో, మౌనముగా చింతన చేస్తుంటారో, తమకు లభించిన దానితో తృప్తిగా ఉంటారో, నివాసస్థానము పట్ల మమకారాసక్తి లేకుండా ఉంటారో, ఎవరి బుద్ధి స్థిరముగా భగవంతునియందే  లగ్నమై ఉన్నదో, ఎవరైతే  భగవంతుని యందు భక్తితో నిండిపోయి ఉన్నారో, అటువంటి వ్యక్తులు  భగవంతునికి చాలా ప్రియమైనవారు.

                 ఎవరు,ఏమిటో తెలుసుకోవాలి.భగవంతుడు ఒకరి సొత్తుకాదు.సర్వంతర్యామి . భగవంతుడు అందరివాడు. అలగే తప్పుచేస్తే శిక్ష అనుభవించక తప్పదని ఈ కథ వలన తెలుస్తున్నది.

2 వ స్వాతి కథ

నైవేధ్యము

నైవేధ్యము స్వామివారికి సమర్పించి టెంకాయ కొట్టండి

నీరాజనము (హారతి)

(కర్పూరముతోగాని నూనెవత్తులతోగాని హారతి యివ్వవచ్చును)

రవ్వలకొండ శ్రీనరసింహునికి జయమంగళం
మా తండ్రీ శ్రీ నరహరికి శుభమంగళం
మా అమ్మ చెంచులక్ష్మీకి నిత్యమంగళం
నిత్యం కొలిచే దైవం శ్రీ నరసింహస్వామికి 
మంగళం జయమంగళం మంగళం శుభమంగళం

ఉగ్రనరసింహునిగ అవతరించితివి
హిరణ్యకశిపున్ని తుదముట్టించితివి
ప్రహ్లాదున్ని బ్రోచితివి భక్తుల మనసు దోసితివి
నిత్యం కొలిచే దైవం శ్రీ నరసింహస్వామికి 
మంగళం జయమంగళం మంగళం శుభమంగళం

రవ్వలకొండ శ్రీనరసింహునికి జయమంగళం
మా తండ్రీ శ్రీ నరహరికి శుభమంగళం
మా అమ్మ చెంచులక్ష్మీకి నిత్యమంగళం
నిత్యం కొలిచే దైవం శ్రీ నరసింహస్వామికి 
మంగళం జయమంగళం మంగళం శుభమంగళం

చెంచులక్ష్మీని చేపట్టితివి
చెంచులక్ష్మీసమేతుడవైతివి
రవ్వలకొండపై కొలువైతివి
నిత్యం కొలిచే దైవం శ్రీ నరసింహస్వామికి 
మంగళం జయమంగళం మంగళం శుభమంగళం

రవ్వలకొండ శ్రీనరసింహునికి జయమంగళం
మా తండ్రీ శ్రీ నరహరికి శుభమంగళం
మా అమ్మ చెంచులక్ష్మీకి నిత్యమంగళం
నిత్యం కొలిచే దైవం శ్రీ నరసింహస్వామికి 
మంగళం జయమంగళం మంగళం శుభమంగళం

అర్చన చేద్దాము
మనసు అర్పన చేద్దాము
స్వామికి మదిలో కోవెల కడదాం
నిత్యం కొలిచే దైవం శ్రీ నరసింహస్వామికి 
మంగళం జయమంగళం మంగళం శుభమంగళం

రవ్వలకొండ శ్రీనరసింహునికి జయమంగళం
మా తండ్రీ శ్రీ నరహరికి శుభమంగళం
మా అమ్మ చెంచులక్ష్మీకి నిత్యమంగళం
నిత్యం కొలిచే దైవం శ్రీ నరసింహస్వామికి 
మంగళం జయమంగళం మంగళం శుభమంగళం

స్వామిని పూజించే చేతులే చేతులు
శ్రీమూర్తిని దర్శించే కన్నులే కన్నులు
శ్రీహరి కథలు విన్న చెవులే చెవులు
నిత్యం కొలిచే దైవం శ్రీ నరసింహస్వామికి
మంగళం జయమంగళం మంగళం శుభమంగళం

రవ్వలకొండ శ్రీనరసింహునికి జయమంగళం
మా తండ్రీ శ్రీ నరహరికి శుభమంగళం
మా అమ్మ చెంచులక్ష్మీకి నిత్యమంగళం
నిత్యం కొలిచే దైవం శ్రీ నరసింహస్వామికి 
మంగళం జయమంగళం మంగళం శుభమంగళం

ఎవరైతే యీ పూజ ఆచరించాలనుకుంటారో వారికి పుస్త్రకదానము చేయండి

ఆన్ని దానలలొకెల్ల విధ్యాదనము,అన్నదానము గొప్పది. ఇంతటితో యీరోజు స్వాతిపూజ ముగిసింది.