రవ్వలకొండ శ్రీశ్రీశ్రీ చెంచులక్ష్మీ సమేత పావన నరసింహస్వామి స్వాతి మనొభీష్ట పూజ విదానము

1 వ స్వాతి మనొభీష్ట పూజ

పూజ ప్రారంభము

                     ముందుగా శుభ్రమైన వస్రము పరచి పటాలను ఉంఛండి. పటాలకు కుంకుమ లేదా చందనము బొట్లు పెట్టండి. పూలమాల వేసి,ధీపము వెలగించండి.అగరబత్తీలు కూడా వెలిగించండి.విడిపూలు అష్టోత్తరశతనామావళికి సిద్ధముగా ఉoచుకోండి.అరటి పండ్లు పెట్టండి. నైవేధ్యము సిద్ధముగా ఉoచుకోండి . ఇప్పుడు పూజ ప్రారంభించుకుందాము

ప్రార్థన

శుక్లాం భరదరం విష్ణుం, శశివర్ణం చతుర్భుజం,
ప్రసన్న వదనం ద్యాయేత్ , సర్వ విగ్నోప శాంతయే .
అగజానన పద్మార్కం, గజానన మహర్నిశం ,
అనేక దంతం భక్తానాం, ఏకదంతం ఉపాస్మహే

(తెల్లని వస్త్రములతో  అంతటా వ్యాపించిన వాడై, చంద్రుని వంటి ప్రకాశం కలవాడై,నాలుగు భుజములు(చేతులు) కలవాడై,  ప్రసన్నమైనటువంటి ముఖముకలవాడిని  ధ్యానించుచున్నాము. నాయకత్వం లేని మాకు నాయకుడివై మమ్ములను నడిపించు. కొన్ని కోట్ల జీవరాశులు భక్తితో  ఏక దంతుడవైన నిన్ను ఉపాసన చేయుచున్నాము)

శ్లో|| ఏకేన చక్ర మపరేణ కరేణ శంఖ - మన్యేన సిన్దు తనయా మవ లంబ్య తిష్ఠన్

వామేతరేణ వరదాభయ పద్మచిహ్నం - లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||

( దేవా! చతుర్భుజుడవగు నీవు ఒక చేత శంఖమును, ఒకచేత చక్రమును, ఒక చేత లక్ష్మీ దేవిని ధరించి, ఒక కుడి చేతితో అభయము నిచ్చు హస్తముద్రను దాల్చి యుందువు. అట్టి మహానీయుడవగు నృసింహ దేవా! చేయూతనోసగి నన్ను కాపాడుము)

శ్లో|| సంసార యోగి సకలే ప్సిత నిత్యకర్మ సంప్రాప్య దుఃఖ సకలన్ద్రియ మృత్యునాశ -

సజ్కల్ప సిందు తనయాకు చ కు జ్క మాజ్క ! లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||

( ఓ దేవా! లేనిపోని కోరికలకు సంసారమే కారణము. ఆ కోరికలు నేరవేరుటకై నిత్యమూ ఏవో  చేయవలసి వచ్చుచున్నది. అందువలన నీవు సంకల్పించినచొ అవి అన్నియు నశించును. లక్ష్మీ దేవి యొక్క కుచ కుంకుమచే చిహ్నితమగు వక్ష స్స్థలముకల నృసింహదేవా! నా సంసార బాధలను పోగొట్టి నన్ను రక్షింపుము.)

సత్యజ్ఞాన శివస్వరూప మమలమ్ క్షీరాబ్ధి మధ్యస్థితం
యోగారూఢ మతిప్రసన్న వదనమ్ భూషా సహస్రోజ్వలమ్|
త్ర్యక్షం చక్ర పినాక సాభయ వరాన్విభ్రాణమర్కచ్ఛవిమ్
ఛత్రీభూత ఫణీన్ద్ర మిన్దు ధవళమ్ లక్ష్మీనృసింహం భజే||

సంకల్పం

(మీరు దేని విషయమై ఈ పూజచేయుటకు సంకల్పించుకున్నారొ -ఆ కోరికలు భక్తి,శ్రద్ధలతో స్వామికి విన్నవించుకోవాలి.మీ సంకల్పము నెరవేరేవరకు  ప్రతి స్వాతికి యీ సంకల్పమే విన్నవించుకోవాలి.సంకల్పము మార్చకండి. వీలైతే ఒక పేపరుమీద రాసి వుంచుకోండి )

ధ్యానము

(స్వామివారిపై దృష్టిని కొద్దిక్షణాలు నిలిపి కళ్ళుమూసుకొని స్వామివారిని రెండు నిమిషాలు ధ్యానము చేయాలి. తర్వాత మెల్లగా కళ్ళు తెరచి స్వామిని దర్శించుకొని నమస్కరించాలి.)

స్వామి అష్టోత్తర శతనామావళి శ్రద్ధతో ఆచరించాలి. ప్రతి నామానికి ఒక పుష్పము(పూలు లేని యడల ఒక అక్షింత) స్వామివారి పాదాలపైన మాత్రమే ఉంచాలి. పూజ ముగిసిన తర్వాత యీ పూలను పారవేయకుండ మీ గృహము దుష్టశక్తులు రాకుండ చల్లుకోండి

శ్రీ నరసింహ స్వామి అష్టోత్తర శతనామావళి

(ప్రతి నామానికి ఒక పువ్వు స్వామివారి పాదాలచెంతనుంచాలి

ఓం నారసింహాయ నమః

ఓం మహాసింహాయ నమః

ఓం దివ్య సింహాయ నమః

ఓం మహాబలాయ నమః

ఓం ఉగ్ర సింహాయ నమః

ఓం మహాదేవాయ నమః

ఓం స్తంభజాయ నమః

ఓం ఉగ్రలోచనాయ నమః

ఓం రౌద్రాయ నమః

ఓం సర్వాద్భుతాయ నమః || 10 ||

ఓం శ్రీమతే నమః

ఓం యోగానందాయ నమః

ఓం త్రివిక్రమాయ నమః

ఓం హరయే నమః

ఓం కోలాహలాయ నమః

ఓం చక్రిణే నమః

ఓం విజయాయ నమః

ఓం జయవర్ణనాయ నమః

ఓం పంచాననాయ నమః

ఓం పరబ్రహ్మణే నమః || 20 ||

ఓం అఘోరాయ నమః

ఓం ఘోర విక్రమాయ నమః

ఓం జ్వలన్ముఖాయ నమః

ఓం మహా జ్వాలాయ నమః

ఓం జ్వాలామాలినే నమః

ఓం మహా ప్రభవే నమః

ఓం నిటలాక్షాయ నమః

ఓం సహస్రాక్షాయ నమః

ఓం దుర్నిరీక్షాయ నమః

ఓం ప్రతాపనాయ నమః || 30 ||

ఓం మహాదంష్ట్రాయుధాయ నమః

ఓం ప్రాఙ్ఞాయ నమః

ఓం చండకోపినే నమః

ఓం సదాశివాయ నమః

ఓం హిరణ్యక శిపుధ్వంసినే నమః

ఓం దైత్యదానవ భంజనాయ నమః

ఓం గుణభద్రాయ నమః

ఓం మహాభద్రాయ నమః

ఓం బలభద్రకాయ నమః

ఓం సుభద్రకాయ నమః || 40 ||

ఓం కరాళాయ నమః

ఓం వికరాళాయ నమః

ఓం వికర్త్రే నమః

ఓం సర్వర్త్రకాయ నమః

ఓం శింశుమారాయ నమః

ఓం త్రిలోకాత్మనే నమః

ఓం ఈశాయ నమః

ఓం సర్వేశ్వరాయ నమః

ఓం విభవే నమః

ఓం భైరవాడంబరాయ నమః || 50 ||

ఓం దివ్యాయ నమః

ఓం అచ్యుతాయ నమః

ఓం కవయే నమః

ఓం మాధవాయ నమః

ఓం అధోక్షజాయ నమః

ఓం అక్షరాయ నమః

ఓం శర్వాయ నమః

ఓం వనమాలినే నమః

ఓం వరప్రదాయ నమః

ఓం అధ్భుతాయ నమః ll 60 ll

ఓం భవ్యాయ నమః

ఓం శ్రీవిష్ణవే నమః

ఓం పురుషోత్తమాయ నమః

ఓం అనఘాస్త్రాయ నమః

ఓం నఖాస్త్రాయ నమః

ఓం సూర్య జ్యోతిషే నమః

ఓం సురేశ్వరాయ నమః

ఓం సహస్రబాహవే నమః

ఓం సర్వఙ్ఞాయ నమః 

ఓం సర్వసిద్ధ ప్రదాయకాయ నమః II70II

ఓం వజ్రదంష్ట్రయ నమః

ఓం వజ్రనఖాయ నమః

ఓం మహానందాయ నమః

ఓం పరంతపాయ నమః

ఓం సర్వమంత్రైక రూపాయ నమః

ఓం సర్వమంత్ర విధారణాయ నమ:

ఓం సర్వతంత్రాత్మకాయ నమః

ఓం అవ్యక్తాయ నమః

ఓం సువ్యక్తాయ నమః 

ఓం భక్ర వత్సలాయ నమ: II80II

 ఓం వైశాఖ శుక్ల భూతోత్ధాయ నమః

ఓం శరణాగత వత్సలాయ నమః

ఓం ఉదార కీర్తయే నమః

ఓం పుణ్యాత్మనే నమః

ఓం మహాత్మనే నమ:

ఓం దండ విక్రమాయ నమః

ఓం వేదత్రయ ప్రపూజ్యాయ నమః

ఓం భగవతే నమః

ఓం పరమేశ్వరాయ నమః

ఓం శ్రీ వత్సాంకాయ నమః || 90 ||

ఓం శ్రీనివాసాయ నమః

ఓం జగద్వ్యాపినే నమః

ఓం జగన్మయాయ నమః

 ఓం జగత్పాలాయ నమః

ఓం జగన్నాధాయ నమః

ఓం మహాకాయాయ నమః

ఓం ద్విరూపభ్రుతే నమః

ఓం పరమాత్మనే నమః

ఓం పరజ్యోతిషే నమః

ఓం నిర్గుణాయ నమః || 100 ||

ఓం నృకేసరిణే నమః

ఓం పరతత్త్వాయ నమః

ఓం పరంధామ్నే నమః

ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః

ఓం లక్ష్మీనృసింహాయ నమః

ఓం సర్వాత్మనే నమః

ఓం ధీరాయ నమః

ఓం ప్రహ్లాద పాలకాయ నమఃII108II

ఓం లక్ష్మీనరసింహ అష్టొత్తర శతనామావళి సంపూర్ణం

అష్టోత్తర శటనామావళి పూర్తి అయిన తర్వాత ఇక్కడ స్వామి వారి స్వాతి కథలు పారాయణం చేయాలి. ప్రతి స్వాతికి ఒక కథ చొప్పున పారణం చేయవచ్చు. లేదా మీ వీలును బట్టి అన్ని కథలు కూడ పారాయణము చయవచ్చును. కాని ప్రతి స్వాతీకి ఒక కథను శ్రద్ధగ,ఏకాగ్రతతో చేయండి. ఫలితం త్వరగా లభిస్తుంది.

మొదటి స్వాతి కథ

                                  మానవ సృష్టి జరిగి ఎన్నో లక్షల సంవత్సరాలు అయ్యింది.రాతి యుగము నుంచి ఇప్పటి వరకు మానవాభివృద్ది ఎంతో జరిగింది. మానవ మేదస్సును పరిపూర్ణముగా వినియోగించుకుంటున్నాడు. ఎంత ప్రగతి సాధిస్తున్నాడో అంతే పతనానికి దారి తీస్తున్నాదు. కారణం ఒక్కటే-అంతా నాకే కావాలనుకోడం,ప్రక్కవాడి పతనాన్ని కోరుకోవడం, స్వార్థం,ద్వేషం,అసూయను జయించలేక పోవడం. నేను ఎందుకు పుట్టానో తెలుసుకోడానికి ప్రయత్నము చేయకపోవడం.ఆకాశములో ఏర్పడిన మేఘాలు,ఆ ఆకాశాన్ని కప్పివేసినట్లు,నిప్పునుంచి వచ్చిన నివురు ఆ నిప్పునే కప్పివేసినట్లుగా, భగవంతునిచే సృష్టింపబడిన యీ సమస్త సృష్టియే ఆ భగవంతునుని కనిపించకుండచేస్తున్నది. ఆ భగవంతుని చెంతకు పోకుండా అడ్డుపడుతున్నాయి. వీటిని గుర్తించి వాటిని తెంచుకొని భగవంతుని చెంతకు చేరుటకు మనం ప్రయత్నము చేయాలి.ముందుగా మాయతో కప్పివేయబడిన యీ విశ్వాన్ని తెలుసుకోవాలి.అప్పుడే భగవంతుని తత్వం గ్రహించ వీలగును.
                               భగవంతుని తత్వాన్ని తెలుసుకోడానికి మనం ఏమి చేయాలి.సత్యాన్ని గ్రహించాలి. సత్యాన్ని ఆశ్రయించాలి-సత్యాన్ని ఆచరించుటకు పూనుకోవాలి. మన ధర్మాన్ని చక్కగా ఆచరించాలి. నీకు కాని దానికి ప్రాకులాడకూడదు. మనం తోటి వారికి ఆదర్శప్రాయంగవుండాలి.అపుడే భగవంతుని తత్వం చక్కగా తెలుసుకోవీలవుతుంది.
                             సమస్త సృష్టికి ఆధారభూతుడైన ఆ భగవంతుడు సమస్తము ఆవరించివున్నాడు. సమస్తము ఆవరించివున్న ఆయనను ఇక్కడ,ఎక్కడ,అక్కడ కాకుండ నీలోనే వెతుకు. నిన్ను తెలుసుకో-నిన్ను నీవు ఎపుడైతే తెలుసుకుంటావో-ఆ భగవంతుడు నీలోనే కనిపిస్తాడు. అలాగే ప్రతివాడిలోను భగవంతుడిని దర్శించడానికి ప్రయత్నము చేయాలి.

                                  మానవ జన్మ లక్ష్యం బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించడం, జన్మను సార్ధకత చేసుకోవడం. విశ్వమంతా బ్రహ్మం ఉంది. బ్రహ్మం తప్ప మరేమీ లేదు. అయినా , అది ఎక్కడ చూసినా కనిపించదు, వినిపించదు. బ్రహ్మం = సత్యం = జ్ఞానం = అనంతం.. ఇదీ ఉపనిషత్తులు ఇచ్చిన అర్థం. బ్రహ్మం అంటే సత్యం. సత్యం అంటే జ్ఞానం. జ్ఞానం అంటే అనంతం. అంటే.. ఇవేవీ వేర్వేరు కాదు. అన్నీ ఒకటే.

                                మీ జీవితంలో ఏమి జరుగుతున్నా కృతజ్ఞతతో మెలగండి. కష్టంగా ఉంటే దుష్కర్మల బరువు తొలగించ బడుతోందని, సుఖంగా ఉంటే సత్కర్మల అడ్డు పక్కకు జరుగుతున్నది అని గ్రహించండి. రెండూ దైవీకృప కారణంగానే మీ జీవితంలో జరుగగలవని అర్ధం చేసుకుంటే కృతజ్ఞతతో ఉండడం సాధ్యం అవుతుంది.

                            *ప్రేమ, సత్యం, అందం, మేధస్సు మరియు సామరస్యాన్ని ప్రదర్శించే ఆత్మ యొక్క కోణాలకు మీరు శ్రద్ధ వహిస్తే, ఆ అంశాలు మీ జీవితంలో విస్తరిస్తాయి.*

                           మానవులు ధర్మ, అధర్మ విచక్షణ లేకుండా చేసిన కర్మల ఫలితములు తప్పించు కోవడానికి వీలు లేదు. ప్రతి విషయములోనూ ధర్మమునకు వ్యతిరేకముగా పనిచేసి, ధర్మాన్ని ఎన్ని రకాలుగా మడతలు పెట్టినా ధర్మము మడతలు పడదు. కాలము మడతలలో జీవి చేసిన తప్పులన్నీ ఇమిడి ఉంటాయి.*

*మనము అన్నదంతా పడవలసినదే. అధర్మముగా తిన్నదంతా కక్కవలసినదే. ఇందులో సత్యమున్నదని గ్రహించి ఆచరించేవారు బుద్ధిమంతులు.*

                           అపుడే మానవునిగా జన్మించినందుకు సార్థక మరియు భగవంతునున్ని చేరుకోడానికి మార్గము సుమగము అవుతుంది.

సంకీర్తన

ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని రెండు నిమిషాలు జపించుకోవాలి

నైవేధ్యము

నైవేధ్యము స్వామివారికి సమర్పించి టెంకాయ కొట్టండి

నీరాజనము (హారతి)

(కర్పూరముతోగాని నూనెవత్తులతోగాని హారతి యివ్వవచ్చును)

మంగళం జయమంగళం

మంగళం శుభమంగళం

 శ్రీనరసింహునికి జయమంగళం
మా తండ్రీ శ్రీ నరహరికి శుభమంగళం
మా అమ్మ చెంచులక్ష్మీకి నిత్యమంగళం

నిత్యం కొలిచే దైవం శ్రీ   హరికి
మంగళం జయమంగళం

మంగళం శుభమంగళం

ఉగ్రనరసింహునిగ అవతరించితివి
హిరణ్యకశిపున్ని తుదముట్టించితివి
ప్రహ్లాదున్ని బ్రోచితివి భక్తుల మనసు దోసితివి

నిత్యం కొలిచే దైవం శ్రీ హరికి 
మంగళం జయమంగళం

మంగళం శుభమంగళం

 

చెంచులక్ష్మీని చేపట్టితివి
చెంచులక్ష్మీసమేతుడవైతివి
రవ్వలకొండపై కొలువైతివి

నిత్యం కొలిచే దైవం శ్రీ హరికి 
మంగళం జయమంగళం

మంగళం శుభమంగళం

 

అర్చన చేద్దాము
మనసు అర్పన చేద్దాము
స్వామికి మదిలో కోవెల కడదాం

నిత్యం కొలిచే దైవం శ్రీ హరికి 
మంగళం జయమంగళం

మంగళం శుభమంగళం

 

స్వామిని పూజించే చేతులే చేతులు
శ్రీమూర్తిని దర్శించే కన్నులే కన్నులు
శ్రీహరి కథలు విన్న చెవులే చెవులు

నిత్యం కొలిచే దైవం శ్రీ హరికి 
మంగళం జయమంగళం

మంగళం శుభమంగళం

రవ్వలకొండ శ్రీనరసింహునికి జయమంగళం
మా తండ్రీ శ్రీ నరహరికి శుభమంగళం
మా అమ్మ చెంచులక్ష్మీకి నిత్యమంగళం

నిత్యం కొలిచే దైవం శ్రీ హరికి 
మంగళం జయమంగళం

మంగళం శుభమంగళం

ఎవరైతే యీ పూజ ఆచరించాలనుకుంటారో వారికియీ పూజాపుస్త్రక దానము చేయండి

ఆన్ని దానలలొకెల్ల విధ్యాదానము,అన్నదానము గొప్పది. ఇంతటితో యీరోజు స్వాతిపూజ ముగిసింది.

ప్రశాంత మనస్సుతో గడపంది. మీ మనోభీష్ట రవ్వలకొండ శ్రీ నరసింహస్వామి తప్పక తీర్చుతాడు.
ఓం నమో నారాయణాయ నమ:
అందరికి శుభం  కలుగు గాక!