శ్రీశ్రీశ్రీ చెంచులక్ష్మి సమేత పావన నరసింహస్వామి భక్తులకు విన్నపము ఏమనగా!
స్వామి మరియు అమ్మవారికి పూజలు నిర్వహించుటకు ఒక సహాయ అర్చకున్ని నియమించుటకు కమిటి తీర్మానించినది. ఇందుకు గాను భక్తుల సహాకారము కోరుతున్నాము. సహాయ అర్చకుని నిర్వహణ కొరకు ప్రతినెల మీకు తోచినంత రు25/-కు తక్కువకాకుండ ఆపైన ఎంతైన ఇవ్వవచ్చును.లేదా సంవత్సరమొత్తము ఒకేసారి కూడ చెల్లించవచ్చును. ఈ లింకు ద్వారా Pay చెల్లించండి. లేదా బ్యంకు ఖాతాకు నేరుగా కూడ చెల్లించవచ్చును. వివరాలు website లో ప్రచురించబడును *************************
Account Details
*********************
Sri pavana chenchu lakshmi sametha
narasimhaswamy temple,
ravvalakonda,Banaganapalli-518360
Andhra Bank BANAGANAPALLI
A/C NO: 005911100002643
IFSC :ANDB0000059
Balisetty Pavana narasimha murthy
State Bank of India,Banaganapalli
A/c No.: 20356859752
IFSC: SBIN0001179

అర్చకుని కొరకు చందా

మీరు ఎంచుకున్న తేదికి లింకు ద్వారా చెల్లించగలరు.

S NO NAME PERIOD AMOUNT TOTAL AMOUNT
PAID ON TODAY
RENEWAL DATE
TO BE PAID
PAY LINK
1 Y L NARAYANA REDDY
YEMMIGANUR
9885526478
MONTHLY Rs25/- Rs175/- EVERY MONTH
22ND
PAY HERE
2 Y PADMAVATHI
YEMMIGANUR
9885626478
MONTHLY Rs25/- Rs150/- EVERY MONTH
22ND
PAY HERE
3 Y AMARANATHA REDDY
CHENNAI
MONTHLY Rs50/- Rs250/- EVERY MONTH
22ND
PAY HERE
PAY HERE
PAY HERE
PAY HERE
PAY HERE
PAY HERE
PAY HERE
PAY HERE
PAY HERE
PAY HERE
PAY HERE
PAY HERE
PAY HERE
PAY HERE
PAY HERE
PAY HERE
PAY HERE
PAY HERE
PAY HERE
PAY HERE
PAY HERE
PAY HERE
PAY HERE
PAY HERE
PAY HERE
PAY HERE
PAY HERE
PAY HERE
PAY HERE
PAY HERE

WhatsWe:

ప్రొఫెసర్-విద్యార్థులు
******************
ఓ ఫిలాసఫీ ప్రొఫెసర్ తరగతి బల్ల మీద కొన్ని వస్తువులతో నిలుచుని ఉన్నాడు.విద్యార్థులు మౌనంగా,ఆయన చెప్పేది వినడానికి సిద్ధంగా ఉన్నారు.

కొన్ని క్షణాల తర్వాత, ప్రొఫెసర్ తను తెచ్చిన వస్తువుల్లోంచి ఓ పెద్ద ఖాళీ గాజు జాడీని,కొన్ని గోల్ఫ్ బంతులని బయటకి తీసారు.గోల్ఫ్ బంతులని ఒక్కొక్కటిగా జాడీలోకి జారవిడిచారు.క్లాసంతా నిశ్శబ్దం.జాడీ నిండిందా అని విద్యార్థులని అడిగారు ప్రొఫెసర్.
పూర్తిగా నిండిందని వాళ్ళు ఒప్పుకున్నారు.

అప్పుడు ప్రొఫెసర్ తను తెచ్చిన గులకరాళ్ళ కవరు విప్పి,వాటిని కూడా జాడీలో జారవిడిచారు. జాడీని కొద్దిగా కదిలించారు.గులక రాళ్ళన్ని గోల్ఫ్ బంతుల మధ్యకి,అట్టడుగుకి చొచ్చుకుపోయాయి.

క్లాసంతా నిశ్శబ్దం.
జాడీ నిండిందా అని విద్యార్థులని అడిగారు ప్రొఫెసర్.పూర్తిగా నిండిందని వాళ్ళు ఒప్పుకున్నారు.
తర్వాత ప్రొఫెసర్ ఓ పొట్లంలోంచి ఇసుకని తీసి జాడీలోకి ఒంపారు.అది జాడీలోకి నిరాటంకంగా జారిపోయింది.
క్లాసంతా నిశ్శబ్దం.

జాడీ నిండిందా అని విద్యార్థులని అడిగారు.

"నిండింది" అంటూ విద్యార్థులు ఒకే గొంతుతో అరిచారు.అప్పుడు ప్రొఫెసర్ అప్పటి దాకా మూత పెట్టి ఉన్న రెండు కాఫీ కప్పులని దగ్గరికి తీసుకున్నారు. వాటి మీది మూతలను తీసి,కాఫీని జాడీలోకి వొంపారు.ఇసుక రేణువుల మధ్య ఉండే ఖాళీ స్థలంలోకి కాఫీ సులువుగా జారుకుంది.

ఈ చర్యకి విద్యార్థులు విరగబడి నవ్వారు.
నవ్వులు సద్దుమణిగాకా, ప్రొఫెసర్ ఇలా అన్నారు.

'ఈ జాడీ మీ జీవితాన్ని ప్రతిబింబిస్తోందని గ్రహించండి.
గోల్ఫ్ బంతులు ముఖ్యమైనవి.దేవుడు, కుటుంబం, మీ పిల్లలు,మీ అరోగ్యం,స్నేహితులు, ఇంకా మీకు అత్యంత ప్రీతిపాత్రమైన అంశాలూ.. మీ సిరిసంపదలన్నీ పోయినా,ఇవి మీతో ఉంటే మీ జీవితం పరిపూర్ణంగానే ఉన్నట్లే!

గులక రాళ్ళు:-మీ ఉద్యోగం,సొంతిల్లు,కారు వంటివి.
ఇసుక:-అన్ని చోట్ల ఉండే చిన్నా,చితక విషయాలు.
మీరు జాడీని ముందుగా ఇసుకతో నింపేస్తే..
గోల్ఫ్ బంతులకి,గులక రాళ్ళకి అందులో చోటుండదు.
జీవితంలో కూడ ఇంతే..
ప్రాధాన్యత లేని చిన్న చిన్న విషయాలకి అత్యంత ప్రాముఖ్యతనిస్తూ.. అసలైన ముఖ్యమైన
వాటిని విస్మరిస్తుంటాము.

సంతోషం కలిగించే వాటిపై దృష్టి నిలపండి.మీ పిల్లలతో ఆడుకోండి.
మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.అప్పుడప్పుడు మీ జీవిత భాగస్వామిని బయట ప్రపంచంలోకి తీసుకెళ్ళండి.మీరు
పదునెనిమిది ఏళ్ళప్పుడు ఎలా ఉన్నారో,అంతే ఉత్సాహంగా,ఉల్లాసంగా ఉండండని ప్రొఫెసర్ చెప్పగా..

క్లాసురూమ్ లో విద్యార్థులంతా తమ గురువుగారు చెప్పిన గోల్ఫు బంతులు,గులకరాళ్లు,ఇసుక రేణువులు, కప్పు కాఫీ మొదలైన వాటిని ప్రాక్టికల్ గా చూపించిన వాటి ఆంతర్యాన్ని గ్రహించారు.

కాబట్టి మిత్రులారా!ఒక బౌల్లో కేవలం గోల్ఫ్ బంతులే వేసినప్పుడు కేవలం నిండినావనుకోవడం పొరపాటూ..ఆ తర్వాత గులకరాళ్లు,ఇసుక,కాఫీ ఇలా అన్నీ ఆ బౌల్ లోనే సర్దుకున్నాయి.ఇలా మన జీవితంలో కూడా ఇంతే!కష్టాలు,సంతోషాలు,
ఈసడింపులు,బాధలు,
లక్ష్యాలు ఇలా అన్ని కలగలిపిన సంగమమే
జీవితం.ఈ పరమార్థాన్ని
తెలుసుకొని జీవిస్తారని
ఆశీస్తూ...

"శతకోటి నమస్సులతో"

:pray::tanabata_tree::pray::tanabata_tree::pray::tanabata_tree::pray:

ఇట్లు
మీ స్నేహశీలి
కె.లక్ష్మీవెంకటేష్
తెలుగు పండిట్.

ఏప్రిల్ 2009లో జరిగిన యదార్థ సంఘటన, ఇది...


_నేను ఢిల్లీ నుంచి విమానంలో తిరిగి వస్తున్నాను. నా పక్కనే రామకృష్ణ మఠానికి చెందిన ఒక స్వామీజీ కూర్చుని ఉన్నారు. అటుపక్కన అమెరికాకు చెందిన ఒక విలేకరి ఉన్నారు. ముందుగా అనుకున్న ప్రకారం స్వామి పక్కన ఉన్న విలేకరి ఇంటర్వ్యూ చేయడం మొదలుపెట్టారు..._

_విలేకరి : *“స్వామీజీ ఇంతకుముందు మీరు ఇచ్చిన ఉపన్యాసంలో బంధాలు అనుబంధాల గురించి వివరించారు. నాకు సరిగా అర్థం కాలేదు మళ్ళీ వివరించగలరా ?”*_

_దానికి స్వామీజీ నవ్వుతూ ప్రశ్నను దాటవేస్తూ విలేకరిని తిరిగి ఇలా ప్రశ్నించారు *“మీరు న్యూయార్క్ నుంచి వస్తున్నారా ?”*_

_విలేకరి : *“అవును.”*_

_స్వామీజీ : *“మీ ఇంటిలో ఎవరుంటారు ?”*_

_ఈ ప్రశ్న పూర్తిగా వ్యక్తిగతము మరియు అసంబద్ధం కావడంతో, విలేకరి *స్వామీజీ తన ప్రశ్నను దాటవేస్తున్నారు* అనుకున్నారు. అయినప్పటికీ విలేకరి చెప్పసాగాడు... *“అమ్మ చనిపోయారు. నాన్న అక్కడే ఉంటున్నారు. ఇంకా నాకు ముగ్గురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. అందరికీ వివాహం అయింది..."*_

_ముఖంలో చిరునవ్వు చెదిరిపోకుండా స్వామీజీ గారు మళ్లీ ఇలా అడిగారు *“నీవు మీ నాన్నగారితో మాట్లాడుతున్నావా ?”*_

_విలేకరి ముఖకవళికలు మారటం మొదలైంది..._

_స్వామీజీ : *“ఆఖరిసారి ఎప్పుడు మాట్లాడావు ?”*_

_జేవురించిన ముఖంతో విలేకరి ఇలా చెప్పాడు *“సుమారు ఒక నెల అయి ఉండొచ్చు...”*_

_స్వామి గారి ప్రశ్నల పరంపర కొనసాగింది... *“మీ అన్న చెల్లెళ్ళ ను ఎంత తరచుగా కలుసుకుంటారు? ఆఖరిసారిగా కుటుంబమంతా ఎప్పుడు కలిసి ఉన్నారు ?”*_

_ఆ సమయంలో విలేకరి నుదుట నుంచి చెమట కారణం స్పష్టంగా కనిపించింది. అక్కడ ఎవరు ఇంటర్వ్యూ చేస్తున్నారో అర్థం కాకుండా ఉంది. స్వామీజీ నా ? లేక విలేకరా ?? నాకైతే స్వామీజీ విలేకరిని ఇంటర్వ్యూ చేస్తున్నట్లుగా అనిపించింది..._

_ఒక నిట్టూర్పు తో విలేకరి చెప్పాడు *“సుమారు రెండు సంవత్సరాల క్రితం… క్రిస్మస్ సందర్భంలో మేమందరము కలిశాము.”*_

_స్వామీజీ : *“మీరందరూ కలిసి ఎన్ని రోజులు ఉన్నారు ?”*_

_నుదుటన స్వేదబిందువులు తుడుచుకుంటూ విలేకరి అన్నాడు *“మూడురోజులు...”*_

_స్వామీజీ : *“ఎంతకాలం మీ నాన్నగారితో గడిపావు ? ఆయన పక్కనే ఎంతకాలం కూర్చున్నావు ?”*_

_ముఖం కందగడ్డలా మారిన విలేకరి, కాగితంపై పిచ్చిగీతలు గీయడం మొదలుపెట్టాడు..._

_స్వామీజీ : *“నీవు ఎప్పుడైనా మీ నాన్నగారితో కలిసి భోజనంచేసావా ? ఆయన ఎలా ఉన్నారని ఎప్పుడైనా అడిగావా ? మీ తల్లి చనిపోయిన తర్వాత ఆయన రోజులు ఎలా గడుపుతున్నారో అడిగావా ?”* విలేకరి కంటినుంచి కన్నీరు కారటం స్పష్టంగా కనిపించింది..._

_అప్పుడు స్వామీజీ విలేకరి చేతిని ప్రేమతో అందుకని ఇలా అన్నారు *“బాధపడకు. నిన్ను తెలియకుండా బాధించి ఉంటే క్షమించు. కానీ, నీవడిగిన బంధం అనుబంధాలకు సమాధానం ఇదే. మీ నాన్నగారితో నీకు బంధం ఉంది. కానీ అనుబంధం లేదు. అనుబంధం అంటే హృదయానికి హృదయం కలిసిపోవడం.. కలిసి ఉండడం... కలిసి భోజనం చేయడం.. ఒకరిపై ఒకరు ప్రేమ చూపించడం... స్పర్శించటం.. చేతులు కలపడం… కళ్ళలోకి సూటిగా చూడగలగటం… కలిసి సమయాన్ని గడపడం... మీ సోదరులందరితో కూడా నీకు బంధం ఉంది. కానీ అనుబంధం లేదు...”*_

_ఆ విలేకరి కన్నీళ్ళు తుడుచుకుంటూ స్వామీజీతో అన్నారు *“బంధం అనుబంధాల గురించి ఇంత అద్భుతమైన బోధన చేసినందుకు ధన్యవాదాలు...”*_

*ఇదీ నేటి వాస్తవికత !!!*

_సమాజంలో గానీ, ఇంటిలోగానీ, అందరికీ బోలెడు బంధాలు ఉన్నాయి. కానీ అనుబంధాలు కనుమరుగయ్యాయి. ఎవరితో ఎవరికీ సంబంధం లేకుండా, ఎవరి ప్రపంచంలో వారు జీవిస్తున్నారు..._

_మనం కూడా బంధాలకు కాకుండా అనుబంధాలకు ప్రాముఖ్యతను ఇద్దాం..._

_పరస్పర ఆప్యాయతలతో కలిసి మెలిసి ఉందాం... !!!_

_ఇది మీ అందరి కోసం చేసిన..._
_*ఒక ఆంగ్ల సందేశానికి తెలుగు అనువాదం...*_

_చదివి, ఆలోచించి... ఆత్మశోధన చేసుకొని, ఒకరిద్దరమైనా అలవరుచుకుంటే ( నాతోనూ కలిపి... ), నా ఈ చిన్ని శ్రమకు తగిన ఫలితం దొరికినట్టే... :relieved:_

_- మీ స్నేహితుడు_

అమ్మ కథ
******************
నును వెచ్చని సూర్యకిరణాలు అమ్మఒడిలోకి సేదదీరడానికి జారుకున్నాయి.వెన్నెల వెలుగులు విరజిమ్ముతూ హాయినిస్తుంటే మీకోక కమ్మని కథ చెబుతా ఆస్వాదించండి.ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు.వారు అమ్మయెడల చూపే ప్రేమ ఎలాంటిదో చూద్దాం!

అమ్మ సంగతి చెబుతూ అమ్మ తన దగ్గర పదిహేను రోజులు, తమ్ముడి దగ్గర పదిహేను రోజులు ఉంటుందని, అలా బాధ్యతలు పంచుకున్నామని చెప్పాడు. మనస్సు చివుక్కుమంది. ఏ సీజన్ లోనైన ఎండిపోని ధార కన్నీరు బైటకు రాబోయింది. అప్పుడు అనుమానం వచ్చింది. ఏయే నెలల్లో ముప్పయిఒక్క రోజులుంటాయో ఆరోజుల్లో అమ్మ ఉపవాసము ఉండాల్సి వస్తుందా..?
అదృష్టం నా అమ్మను నాతో పంచుకోడానికి నాకు తమ్ముడు లేడు.

నాకు అమ్మ ఒక మధుర జ్ఞాపకం.
తనకు నా ఆకలి ఎప్పుడు చెప్పాల్సిన అవసరం రాలేదు.
కొత్త బట్టలతో బైటకు వెళ్లివస్తే వెంటనే దిష్టి తీసేది.
పరీక్షలకు బయలుదేరితే చిరునవ్వుతో ముందు నిలిచేది.
బాల్యంలో నా పిచ్చి భాషను క్షణంలో పసికట్టేది.
ఇలా ఎన్నో ఎన్నెన్నో?

అమ్మ!తన బిడ్డ ఒక స్తన్యంలో పాలు తాగుతూ,రెండో స్తన్యంలో పలుమార్లు తన్నుతూ ఉంటాడు.
తనను తన్నే వారి కడుపు నింపే ఔదార్యం భగవంతుడు ఒక్కఅమ్మకు మాత్రమే ఇచ్చాడు.

అమ్మ ఒక వేదం..
అమ్మ ఒక భక్తిభావం..
అమ్మ ఒక ప్రేమరూపం..
అమ్మ ఒక సంవేదన..
అమ్మ ఒక భావన..
అమ్మ ఒక పుస్తకం..
అమ్మ ఒక కలం..
అమ్మ ఒక కవిత..
అమ్మ ఒక జ్ఞానం..
అమ్మ ఒక గుడిలో దీపం..
అమ్మ ఒక హారతి పళ్లెం..
అమ్మ ఒక కుసుమం..
అమ్మ ఒక చల్లని చిరుగాలి..
అమ్మ ఒక అన్నపూర్ణ..
అమ్మ ఒక లాలిత్యం..
అమ్మ ఒక చీరకొంగు..
అమ్మ ఒక కరుణ..
అమ్మ ఒక దీవెన..
అమ్మ ఒక అక్షిత..
అమ్మ ఒక వర్షపు బిందువు..
అమ్మ ఒక మధురగేయం..
అమ్మ ఒక శ్వాస..
అమ్మ ఒక ఊపిరి..
అమ్మ ఒక మురళి గానం..
అమ్మ ఒక జోలపాట..
అమ్మ ఒక పచ్చదనం..
అమ్మ ఒక కనురెప్ప..
అమ్మ ఒక దేవత..
అమ్మ ఒక పుడమి..
అమ్మ ఒక స్వచ్ఛత..
అమ్మ ఒక ప్రవచనం..
అమ్మ ఒక వెలుగు...
అమ్మ ఒక సుగుణం..
అమ్మ ఒక నమ్మకం..
అమ్మ ఒక ఆరోగ్యం..
అమ్మ ఒక భద్రత...
అమ్మ ఇలాఎన్నో ఎన్నెన్నో..!

ఇది చదివిన వారికి ఎంత మంది అమ్మలు జీవించివున్నారో, మరణించినారో తెలియదు.కాని ఒక్క మాట చెప్పగలను ఎవరు అమ్మ దగ్గర ఉంటారో వారు అతిసంపన్నులు.అమ్మకు ఎవరు సేవా భాగ్యం కలిగివుంటారో వారు ధన్యులు,అదృష్టవంతులు.

ఇలా అమ్మను గూర్చి చెప్పగానే పరుగెత్తే పదాలు కూడా పరవశిస్తాయి.ఇలా
అమ్మ ఎంత గొప్పదో ప్రపంచానికంతా తెలుసు.
అమ్మ లేనప్పుడు అమ్మ విలువ తెలుసుకోవడం కంటే,అమ్మ ఉన్నప్పుడే ప్రేమతో గౌరవిద్దాం..!
ప్రేమతో పూజిద్దాం..!

కాబట్టి మిత్రులారా మీరందరూ అమ్మను కడదాకా చక్కగా చూసుకుంటారని ఆశీస్తూ..
:pray::rose::pray::rose::pray::rose::pray:

ఇట్లు
మీ స్నేహం
కె.లక్ష్మీవెంకటేష్
తెలుగు పండిట్.

"క్రింద పడిన వానిని చూసి
భూమి ఓ ముద్దిచ్చి
ఇలా చెప్పిందటా..
నువ్వు తొమ్మిది సార్లు
పడిలేచిన వాడివి
ఇక నీకు ఢోకాలేదనీ..
విజయం ఎప్పుడు
నీదేననీ...

వినే ఓపిక లేనివాడు ఎప్పటికీ అజ్ఞానిగానే మిగిలిపోతాడు.
చెప్పే ధైర్యం లేనివాడు ఎప్పటికీ పిరికివాడిగానే ఉండిపోతాడు.

కాళ్లకు తగిలిన గాయం ఎలా నడవాలో నేర్పిస్తుంది.
హృదయానికి తగిలిన గాయం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది"
:tulip::deciduous_tree::rose::deciduous_tree::rose::deciduous_tree::rose:

ఇట్లు
మీ నేస్తం
కె.లక్ష్మీవెంకటేష్
తెలుగు పండిట్.

1

[2:50:01 PM]WhatsWe:

లేడీ టీచర్
****************
భుజాన హ్యాండ్ బ్యాగ్
చేతిలో సెల్ ఫోన్
చీరకట్టులో..
మహాలక్ష్మిని మరిపించే
మూర్తిమత్వం..
అందరితో కలివిడిగా
ఉండే మనస్తత్వం
గళగళ మాటల సవ్వడులు
మనోఫలకంపై..
సమస్యలెన్నో నాట్యం చేస్తున్నప్పటికీ..
మోముకు
కృత్రిమ ఆహార్యంతో నవ్వులు!
ఆమె ఎవరో కాదు!
భావి భారత పౌరులను
తీర్చిదిద్దే లేడీ టీచర్!
సూర్యచంద్రులను తలపించేలా..
ప్రతి రోజూ..
కొనసాగే ఆమె దినచర్య
శృతి,గతి ఎప్పటికీ తప్పదు
సుప్రభాతవేళ..
తమ వారి సేవలోనే
తరిస్తుంది తప్ప
తన గురించి ఒక్క క్షణమైనాఆలోచించదు!
మనసంతా పని ఒత్తిడితో
చిత్తడవుతున్నా..
ఇంట్లో పనులన్నీ
స్వయంగా చక్కబెట్టందే
బడికి బయలుదేరడం కష్టం
బస్సు కోసం నిరీక్షణలు
బస్సెక్కిన పిదప..
గమ్యం చేరేదాకా యాతనలు
ఇవన్నీ లెక్కచేయక..
గడియారంతో పోటీపడి
పరుగులు తీసినా
అప్పుడప్పుడు
బడిలోనూ, ఇంట్లోనూ..
తప్పదు చివాట్ల వర్షం!
గంట గంటకూ..
తరగతులు మారుతూ..
పాఠాలు చెప్పాలి!
ఇష్టం ఉన్నా లేకున్నా..
సహచరుల మాటలతో
శృతి కలపాలి!
హోంవర్క్ పిల్లలకే కాదు..
"నేనుసైతం"అంటూ
బండెడు మోతను
ఇంటికి తీసుకెళ్లాలి!
తన ఇష్టాఇష్టాలతో
పని లేకుండా..
పతి అడుగు
జాడల్లో నడవాలి!
పేరుకే జీతం
ఆమె ఖాతాలో జమ..
ఏటీఎం కార్డు మాత్రం
భర్తజేబులోనే సుమా!
ఉదయం బడికెళ్లేటప్పుడు
సముద్రంపై చినుకుల
తాకిడితో తళుక్కున మెరిసే మెరుపు వోలే
ఉండే ఆమెనవ్వు
సాయంత్రం..
ఇంటికొచ్చేటప్పుడు
వర్షం వెలిశాక
మబ్బులు ఫక్కున నవ్వినట్లు
మంచు పరిమళాలను పంచి..పనికిరాని
గరిక పువ్వులా మారుతుంది!
అయినా..
అలసటను
లోలోనే దాచుకుంటూ..
సాయంకాలపు సేవకూ..
మళ్ళీ సిద్ధమవుతుంది.

కాబట్టి మిత్రులారా!కాలం
కంటే వేగంగా పరిగెత్తే స్త్రీ
మూర్తికి వందనం.. అభివందనం!ఆమె కుటుంబానికి ఒక సేవకురాలిగా, మార్గదర్శిగా,ఇల్లాలుగా,
కోడలిగా,గృహిణిగా
అమ్మగా..ఇలా ఎన్నో.. ఇంకెన్నో బహుముఖ పాత్రలు పోషించే ఆ మాతృమూర్తికి

"నమస్కరిస్తూ"
:pray::deciduous_tree::rose::pray::deciduous_tree::rose::pray:

ఇట్లు
మీ స్నేహరత్నం
కె.లక్ష్మీవెంకటేష్
తెలుగు పండిట్.

WhatsWe:

రాయి-మట్టి-కష్టం
******************
"హృదయ కలం నుండి జాలువారిన ఓ కన్నీటి చినుకులే ఈ రాయి,ఈ మట్టి,ఈ కష్టం.."

"సుత్తితో ఒక దెబ్బ వెయ్యగానే బండరాయి ముక్కలవ్వదు.దెబ్బ వెనుక దెబ్బ వెయ్యాలి..
ఒక్క ప్రయత్నంలోనే విజయం సిద్ధంచదు.
ఎడతెగని ప్రయత్నం కావాలి."

"కులం పంట లాంటిది
మానవత్వం మట్టి లాంటిది
పొలంలో ప్రతిమూడు
నెలలకు ఒకసారి
పంట మారుతూ ఉంటుంది
ఎన్ని పంటలు మార్చినా
మట్టి మాత్రం మారదు
అందుకే ఏ మనిషి అయినా..!
పంటలా కాకుండా..
మట్టిలో కలిసే వరకూ..
మట్టిలోనే బ్రతకాలి..
ఇది సత్యం సుమా..!"

"కష్టం నన్ను చూసి నవ్వుతూ..వీన్ని
ఎంతో కష్టపెడుదామని
కష్టపడుతుంది.
కొన్నిసార్లు నా ముందు
మరి కొన్నిసార్లు నా వెనుక
నీడలా నన్ను వెంబడించింది.
కష్టానికే తెలియని కష్ట మేమిటంటే..కష్టం తన ప్రతి కష్టంలోనూ నన్ను
సానబెడుతుంది.

కష్టం తన కష్టాల సమ్మెట
పోటులతో నన్ను శిల్పంగా
చెక్కుతుంది.కష్టం తన కష్టంతో నన్ను కష్టించి కష్టించి..చివరకు కష్టాలకు
నేను అలవాటైతే..ఇక కష్టం
నన్ను కష్టించడం మానేసింది.

ఎప్పుడైతే కష్టాలకు నేను
లొంగిపోకుండా ఎదురు
నిలిచానో.. అప్పుడు కష్టం
తన మనసు కష్టపెట్టుకొని
నన్ను కష్టించడం మానేసింది.

కాబట్టి మిత్రులారా!సంసార జీవితాన్ని ఈదడమంటే మన మనస్సును రాయిగా దృఢంగా చేసుకోనైనా
కష్టాలను ఎదుర్కొనే
ఆత్మస్థైర్యాన్ని మీకివ్వాలని
ఆశీస్తూ...
"శతకోటినమస్సులతో"
:pray::tanabata_tree::pray::tanabata_tree::pray::tanabata_tree::pray:

ఇట్లు
మీ స్నేహరత్నం
కె.లక్ష్మీవెంకటేష్
తెలుగు పండిట్.

1

[3:25:10 PM]WhatsWe:

జీవిత చక్రం
******************
"జీవితం చాలా చిత్రమైనది.
సైకిల్ తొక్కడం కష్టంగా ఉందని
బైక్ కొనుక్కొనీ..
దానికంటే సౌకర్యవంతంగా
ఉంటుందని
కారు కొనుక్కొనీ..
దానివల్ల పొట్ట పెరిగిందని
జిమ్ కి వెళితే..
అక్కడ నడపడానికి
వీలులేని సైకిల్ ఇచ్చి తొక్కమంటారూ..!
ఏంటో "జీవిత చక్రం"అంటే
బహుశా ఇదేనేమో?

ఏమిటో ఈ జీవితం, ఎటువైపు ఈ పయనం
ఓటమి నీ రాత కాదు
గెలుపు ఇంకొక్కరి సొత్తు కాదు
నిన్న మరచి నేటినే తలచి
శ్రమించు ఆశయం సాధించు.

బాల్యం విలువ అది
గడచి పోతేకానీ తెలియదు.
యవ్వనంలో ఉన్న శక్తి
అది ఉడిగి పోయేదాకా తెలియదు.
సంసార జీవితంలో మన
గురించి ఆలోచించే
సమయం దొరకదు
జీవితం గురించి అర్థం
చేసుకోవాలంటే ఈ జీవితం
సరిపోదు"
:tanabata_tree::tulip::tanabata_tree::tulip::tanabata_tree::tulip::tanabata_tree:

ఇట్లు
మీ మిత్రరత్నం
కె.లక్ష్మీవెంకటేష్
తెలుగు పండిట్.

దేవుడు ఎక్కడ చూస్తున్నాడు?దేవుడు ఎక్కడ ఉంటాడు? దేవుడు ఏం చేస్తాడు? అని మూడు ప్రశ్నలు
చదవగానే ఎంతో బాగా నచ్చింది. అందుకే మీతో పంచుకుంటున్నాను. ఎవరు వ్రాసారో తెలియదు కానీ వారికి నా నమస్సులు.

ఓ దేశాన్ని పాలించే రాజు మనసులో మూడు ప్రశ్నలు ఉదయించాయి. ఆ ప్రశ్నలకు ఎన్నోమార్లు జవాబులు యోచించినా సరైన సమాధానం దొరకలేదు. తన ఆస్థానంలో ఓ రోజు సమావేశమైన పండితులను, శాస్త్రకారులను, మేధావులను ఆహ్వానించాడు.

తాను మూడు ప్రశ్నలు వేస్తానని, వాటికి జవాబులు చెప్పడానికి ముందుకు వచ్చి సరైన సమాధానం చెప్పిన వారికి గొప్ప బహుమతి లభిస్తుందని చెప్పాడు. సరైన సమాధానం చెప్పకపోతే కారాగారం పాలు చేస్తానని చెప్పాడు. దాంతో భయపడి ఎవరూ ముందుకు రాలేదు. ఈ విషయం దేశమంతా చాటింపబడింది.

ఓ కుగ్రామం నుండి పశువుల కాపరి ఒకాయన ముందుకు వచ్చాడు.

రాజాస్థానం చేరుకొన్నాడు. రాజు సభలో ఎందరో మేధావులు శాస్త్ర పండితులు కూర్చొన్నారు. పశువుల కాపరి, రాజుగారి మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పబోయే ముందు రాజుకో విషయం నిర్దేశం చేసాడు.

‘‘చెప్పేవాడు గురువు, వినేవాడు శిష్యుడు. గురువు పైన ఉండాలి, శిష్యుడు క్రింద ఉండాలి’’.

కాబట్టి మహారాజా! మీరు సింహాసనం దిగండి అన్నాడు. రాజు సింహాసనం నుండి క్రిందికి దిగాడు. పశువుల కాపరి సింహాసనం అధిష్ఠించి, ‘‘మహారాజా ఇప్పుడు అడగండి మూడు ప్రశ్నలు’’ అన్నాడు.

మొదటి ప్రశ్న

దేవుడు ఎక్కడ చూస్తున్నాడు?

దీనికి జవాబు చెప్పండి అన్నాడు రాజు.

వెంటనే ఒక దీపాన్ని తెప్పించమన్నాడు గురువు స్థానంలో వున్న పశువుల కాపరి. దీపం తెచ్చి సభ మధ్యలో పెట్టారు.

మహారాజా! ఈ దీపం ఎక్కడ చూస్తుంది? నావైపా? నీవైపా? తూర్పువైపా? పశ్చిమానికా? పైనకా? క్రిందకా? ఎక్కడ చూస్తుందో చెప్పండి? అని ప్రశ్నించాడు.

‘‘అన్నివైపులకు చూస్తుంది’’ అని జవాబిచ్చాడు రాజు.

ఇంత చిన్న జ్యోతి అన్నివైపులా చూడగలిగినపుడు పరంజ్యోతి స్వరూపమైన భగవంతుడు అన్నివైపులా చూడలేడా? సమస్త జీవుల కళ్ళల్లో వెలుగుగా వున్న పరంజ్యోతి పరమాత్మనే.

ఇక రెండవ ప్రశ్న

దేవుడు ఎక్కడ ఉంటాడు?

అన్నాడు రాజు.

‘‘సరే! ఓ చిన్న పాత్రలో పాలు తెప్పించండి’’ అన్నాడు పశువుల కాపరి. పాలు తెచ్చారు.

‘‘మహారాజా ! ఈ పాలల్లో నెయ్యి ఎక్కడ ఉందో చెప్పగలవా?’’ అని అడిగాడు.

‘పాలను బాగా మరుగబెట్టాలి. వాటిని తోడు (మజ్జిగ) కలిపి కొన్ని గంటలు కదలకుండా ఉంచాలి. పెరుగు సిద్ధం అవుతుంది. దాన్ని కవ్వంతో చిలికితే వెన్న వస్తుంది. తర్వాత తయారైన వెన్నను కాస్తే నెయ్యి తయారవుతుంది’’ అన్నాడు రాజు.

‘సరిగ్గా చెప్పారు మహారాజా! అలాగే హృదయం అనే పాలను గురువు అనే నిప్పులపై బాగా మరిగించి, మనస్సు అనే తోడు వేసి, స్థిరంగా ఉంచితే వచ్చే సత్యం అనే పెరుగును సాధన అనే కవ్వంతో చిలికితే జ్ఞానం అనే వెన్న వస్తుంది.

ఆ సాధన ‘అంతర్ముఖం’ అనే నిప్పులపై బాగా కాచినట్లయితే పరమాత్మ అనే నెయ్యి వస్తుంది’’ అన్నాడు కాపరి.

సభలో హర్షధ్వానాలు మిన్నుముట్టాయి.

చివరి ప్రశ్న

దేవుడు ఏం చేస్తాడు? అని.

నేను పశువుల కాపరిని, మీరు మహారాజు. క్రింద వున్న నన్ను సింహాసనం పైన కూర్చోబెట్టారు. పైన వున్న మిమ్మల్ని క్రిందికి దించేశారు. ఇదే పరమాత్మ లీల.

సత్కర్మలు చేసే జీవులను పై జన్మల్లో ఉత్తమ జన్మగా మార్చడం, దుష్కర్మలు చేసే వాళ్ళను మరుజన్మలో క్రింది స్థాయికి పంచడమే పరమాత్మ పని’ అన్నాడు.

సభలో గంభీర వాతావరణం నెలకొంది. రాజు పశువుల కాపరి ముందు పాదాక్రాంతుడయ్యాడు. పశువుల కాపరి రూపంలో ఉన్న పరమాత్మ తాను వచ్చిన దిక్కుగా తిరుగు ప్రయాణం అయ్యాడు.
:triangular_flag_on_post:సర్వేజనా సుఖినోభావంతు:triangular_flag_on_post:

1

[3:30:05 PM]WhatsWe:

*దేవుని లెక్క*

ఇద్దరు వ్యక్తులు కాలక్షేపానికి ఊర్లోఉన్న గుడి దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. అప్పటికి కాస్త చీకటి పడుతోంది. కొంచెం మబ్బుకూడా పట్టింది. ఇంతలో అక్కడికి మరో వ్యక్తి వచ్చాడు. మీఇద్దరితో పాటు నేను మీతో కూర్చోవచ్చా అని అడిగాడు. అందుకు ఆ ఇద్దరు అదేం భాగ్యం ఈ చోటు మాదికాదు, మేము కూడా కాలక్షేపానికే కూర్చున్నాం నువ్వు కూడా కూర్చోమన్నారు. ముగ్గురు కూర్చుని కబుర్లలో పడ్డారు. ఇంతలో గాలి వాన మొదలయ్యింది.
వాళ్లు ఇక అక్కడ నుంచి వెళ్లిపోలేకపోయారు. ఇంతలో మూడో వ్యక్తికి ఆకలేసింది. అదే విషయం మిగిలిన ఇద్దరితో చెప్పాడు. మేము కూడా అదే ఆలోచిస్తున్నాం అతడి దగ్గర మూడు నాదగ్గర ఐదు రొట్టెలున్నాయి ఇవే అందరం పంచుకొని తిందాం అని రెండో వ్యక్తి అన్నాడు. కానీ ఎనిమిది రొట్టెలను మగ్గురు సమానంగా పంచుకోవడం ఎలా అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. అందుకు మూడో వ్యక్తి ఒక ఉపాయం చెప్పాడు. మొత్తం ఎనిమిది రొట్టెలను మూడు మూడు ముక్కలుగా చేద్దాం అప్పుడు వచ్చిన ఇరవైనాలుగు ముక్కలను ముగ్గురం సమానంగా తిందాం అని అంటాడు. అది అందరికి సబబుగా తోచి ఎనిమిది రొట్టెలను మూడు మూడు ముక్కలుగా చేసి తలా ఎనిమిది ముక్కలు తిని ఆకలి తీర్చుకొని నిద్రపోతారు. తెల్లవారి లేచిన తర్వాత మూడో వ్యక్తి వెళ్లిపోబోతూ మీరు రాత్రి నాకు తోడుగా ఉండటమే కాకుండా నాకు మీ రొట్టెలు పెట్టి ఆకలి కూడా తీర్చారు. మీకు చాలా కృతజ్ఞతలు. నా దగ్గరున్న ఎనిమిది బంగారు నాణాలు మీకు ఇస్తాను. మీరిద్దరూ తీసుకోండి అని చెప్పి ఎనిమిది బంగారు నాణాలు ఇచ్చి వెళ్లిపోతాడు. అతడు వెళ్లిపోయాక మొదటి వ్యక్తి నా నాలుగు బంగారు నాణాలు నాకిస్తే నేను వెళ్లిపోతాను అంటాడు రెండో వాడితో. అయితే రెండో వ్యక్తి నీవి మూడు రొట్టెలే నావి ఐదు రొట్టెలు కాబట్టి లెక్క ప్రకారం నాకు ఐదు బంగారు నాణాలు, నీకు మూడు బంగారు నాణాలు చెందుతాయి అని అంటాడు. ఇలా వీళ్లిద్దరి మధ్య వివాదం మొదలవుతుంది. ఈ చిక్కు తీర్చుకోడానికి ఇద్దరు రచ్చబండకెక్కుతారు. అక్కడ న్యాయాధికారి మొత్తం కథ విని బంగారు నాణాలు తన దగ్గర పెట్టమని చెప్పి తీర్పు తెల్లవారికి వాయిదా వేస్తాడు.
రాత్రి పడుకున్న తర్వాత న్యాయాధికారి కలలో దేవుడు కనిపించి ఏం తీర్పు చెప్పబోతున్నావని అడుగుతాడు. నాకు రెండో వాడు చెబుతున్నదే న్యాయంగా తోస్తున్నది అని అంటాడు. అందుకు దేవుడు నవ్వేసి నువ్వు కథ సరిగా విన్నావా అని అడిగి మూడు రొట్టెలు ఇచ్చిన వాడికి న్యాయంగా ఒక్క బంగారు నాణెం మాత్రమే ఇవ్వాలి అని అంటాడు. న్యాయాధికారి అదెలా అని అడుగుతాడు. ఎలాంగంటే మొదటి వాడి దగ్గర ఉన్నవి మూడు రొట్టెలు వాటిని అతడు 9 ముక్కలు చేశాడు. రెండో వాడి దగ్గర ఉన్నవి ఐదు రొట్టెలు వాటిని అతడు 15 ముక్కలు చేశాడు. అయితే మొదటి వాడు వాడి రొట్టెల్లోని 9 ముక్కల్లో 8 అతడే తినేశాడు. కానీ రెండో వాడు తన 15 ముక్కల్లో 7 ముక్కలు మూడో వాడికి పెట్టాడు. కాబట్టి ఏడు నాణాలు రెండో వాడికి చెందాలి ఇదే నాలెక్క, ఇదే న్యాయం కూడా అని తేల్చేశాడు. తెల్లవారి న్యాయాధికారి ఇదే తీర్పు చెప్పాడు. అది విని మొదటి వాడు ఇతడే నయం 3 నాణాలు ఇస్తానన్నాడు మీరు ఒక్కటే ఇస్తున్నారు అని వాపోయాడు. అది విని న్యాయాధికారి అతడికి ఒకటే ఎలా చెందుతుందో వివరించాడు. దీన్ని బట్టి అర్థం అయ్యిందేమిటంటే మనం వేసుకునే లెక్కలు వేరు, దేవుడి లెక్కలు వేరు. మనదగ్గర ఉన్నదాంట్లో మనం ఎంత ఇతరులతో పంచుకోగలుగుతున్నమన్నదే దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు. 30 కోట్లు ఉన్నవాడు 3 లక్షలు దానం చెయ్యడం గొప్పగా దేవుడు పరిగణించడు, 3 వేలు ఉన్నవాడు 300 దానం చెయ్యడాన్నే గొప్పగా భావిస్తాడు. పుణ్యంగా జమకడతాడు. దేవుడి దృష్టిలో మనకెంత ఉంది అన్నది కాదు మనం ఎంత దానం చేశాం అనేదానికే విలువ.

*ఆచార్య. డా.వెలుదండ నిత్యానంద రావు* గారి జన్మదినం సందర్భం గా వారికి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ "చిరు" వ్యాసం.....

*ఐ.చిదానందం*
---------------------------------------------------

సాహిత్యం లో ఏదైనా ఒక రంగం లేదా ప్రక్రియ లో రాయడం కంటె *పరిశోధన* ప్రత్యేకమైనది. ఎందుకంటే పరిశోధన ఏ జానపదం కో ;ఏ కవిత్వం కో ; ఏ విమర్శ కో ; ఏ కవి కో సంభందించినది కాదు. అన్నీ ప్రక్రియల కలబోత పరిశోధన. పరిశోధకుడికీ అన్నీ ప్రక్రియల పై అవగాహన ఉండాలి. అప్పుడే మంచి పరిశోధనలు వస్తాయి. అలాంటి *ఉత్తమ పరిశోధన* అనే భాద్యత ను దశాబ్దాలుగా మోస్తున్న పరిశోధకులు మా గురువు గారు *ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆచార్యులు డా.వెలుదండ నిత్యానంద రావు*

వీరు ఆగస్ట్ 09; 1962 లో మహబూబ్ నగర్ జిల్లా మంగునూరు లో జన్మించారు. వీరి తల్లిదండ్రులు లక్ష్మమ్మ ; రామేశ్వర రావు గార్లు. నిత్యనంద రావుగారు నిత్యము సాహిత్యాభిలాష తో ; నిరంతరం పరిశోధన స్పృహతో నిమగ్నమైన అసాధారణ రచయిత . తెలుగు సాహిత్యమును గమనిస్తే సాహిత్య రంగం కు ఒక సీజన్ ఉంటుంది.ఉదాహరణకు కవిత్వోద్యమాలు తీసుకోండి. భావ కవిత్వం ప్రభావం కొంత కాలం నడిచింది తర్వాత మరోకటి ధోరణీ తో కవిత్వం వచ్చింది ; *ఇలా కవిత్వం ; కథలు ; నవలల యుగం గా నడుస్తున్న కాలం లో అందరికీ భిన్నం గా సాహిత్య చరిత్ర; విమర్శ రంగం ; పరిశోధన రంగం* నిత్యానందం గారిని ఆకర్షించాయి. ఆ ఆసక్తి తోనే వీరు పరిశోధన రంగం పై తనదైన గుర్తింపు వేసారు.

వీరి తొలి రచన వ్యాసంగం విషయం కు వస్తే వీరు సాహిత్య రచనలోకీ అడుగుపెట్టిన తొలినాళ్ళలో పద్య కవిత్వం ; వచన కవిత్వం రాసారు. అలా తొలి సారి వీరు రాసిన రచన *వాగ్దేవి* అనే పద్య కవిత .ఇదీ అదే పేరుతో నాటి రాజమండ్రి పత్రిక *సమాలోచన* (1979) లో ప్రచురితం అయ్యింది. ఇంకా వీరి *తెలుగు వారి సంస్కృత సేవ* అనే వ్యాసం కూడా సమాలోచన లో ప్రచురితం అయ్యింది. ఆ వరుసలోనే తెలుగు వారి వివిధ భాషల సేవలను వరసగా వ్యాసాలు రాసారు. అంతేకాదు తెలుగు అకాడమీ వారు పరిష్కరించిన చాలా గ్రంధాలకు ( *తాలాంక నందిని పరిణయం;శ్రీరంగ మహత్యం* ) వంటి కావ్యాలకు పాద సూచికలు పద్య సూచికలు తయారు చేసి గ్రంధ పరిష్కారణ మెళకువలు నేర్చుకోన్నారు. ఈ క్రమం లోనే భాగవత పద్యం " ఓయమ్మ నీ కుమారుడు మా యిండ్ల" అనే పద్యం కు *రాజకీయ భాగోతం* అనే పేరడీ పద్యం రాసారు. ఇదీ ఆంధ్రప్రభ లో ప్రచురితం అయ్యింది. ఈ పేరడీ మీద ఆసక్తిని వీరి *తెలుగు కవిత్వం లో పేరడీ* అనే పరిశోధన కు దారి తీసింది. ఎప్పుడయితే పరిశోధనలోకీ కాలుమోపారో అప్పటి నుంచి పరిశోధన అనే భాద్యత ను దశాబ్దాలుగా మోస్తున్నారు ఆచార్య డా.వెల్దంద నిత్యానంద రావు గారు. ఇలా వీరు వందల కొద్దీ పరిశోధన వ్యాసాలు రాస్తున్నే ఉన్నారు. ఆ వ్యాసాల లో మనకు తెలియని ఎంతో మంది కవులను గురించి ఎన్నో తెలియని విషయాలను వీలున్నప్పుడల్లా చెబుతూనే వున్నారు.

ఒక వ్యాసం రాయాలంటే ఎంత ఓపిక ఎంత సమాచార సేకరణ ఎంత విశ్లేషణాత్మక దృష్టి ఉండాలి. అంతకు మించి పదింతలు సాహిత్యాభిరుచి కూడా ఉంటేనే మంచి వ్యాసం సాధ్యం. వీరు నవ్యత గల వస్తువులను తీసుకొని వ్యాసాలు రాసారు.అందరు *మరిచిపోయిన మరుగున పడిన కవులను రచయితలను మళ్లీ వెలుగులోకీ తీసుకొని రావడం వీరి సాహిత్య కృషికీ ఉదాహరణ*. వీరు రాసిన వ్యాసాలన్నీ పరిశోధనత్మక అంశాలే. ఏ అంశం ఆయినా సరే హేతుబద్ధంగా నిశితం గా పరిశీలన చేస్తూ చివరికీ ఆ అంశం పై ఎంత వరకు సాధ్యమో ఎంత వరకు ఆమోదయోగ్యమో అంత మాత్రమే వ్యాఖ్యానిస్తారు.

*వీరి రచనలు* :-

1) చంద్రలేఖా విలాపం (1990-ఎమ్.ఫిల్)
2) తెలుగు సాహిత్యం లో పేరడీ (1994-పి.హెచ్.డి)
3) హాస విలాసం (2005 - వ్యాసాలు)
4) భారతీయ జ్వలిత బంకించంద్ర (2006)
5) నిత్య వైవిధ్యం (2007-వ్యాసాలు)
6) నిత్యానుశీలనం (2010- వ్యాసాలు)
7) రాజ నీతిజ్ఞుడు బూర్గుల (2011 - జీవిత చరిత్ర )
8) తెలుగు పరిశోధన (2012)
9) విశ్వ విద్యాలయాలలో తెలుగు పరిశోధన
10) నిత్యాన్వేషణం ( దీర్ఘ వ్యాసాలు - అముద్రితం)

*సంపాదకత్వం*

1) నవ యుగ రత్నాలు (2012 - జీవియస్ అభిప్రాయాల సంచిక)
2) పరిశోధన వ్యాస మంజరి ( 2- భాగములు)
3) ఆధునిక భాషా శాస్త్రం - ప్రకార్య భాష


సాధారణ వ్యాసాలతో పోలిస్తే పరిశోధత్మక వ్యాసాలు రాయడం కష్టం.అందున అందరికి పనికి వచ్చే వ్యాసాంగం రాయడం మరీ కష్టం. అలాంటి క్లిష్టమైన పనిని దశాబ్దాలుగా ఇష్టంగా నిర్వహిస్తున్నారు ఆచార్యులు. వీరి రచనల విషయంకు వస్తే వీరి వ్యాస సంపుటిలో ఒకటి *నిత్య వైవిధ్యం*. దీనిలో మొత్తం గా 19 వ్యాసాలు కలవు. ఇందులో అగ్ని కీ జ్వాలాకు భేదం లేదనట్టు రాధాకృష్ణులు ఏకమైన చైతన్య రూపం అంటూ *శ్రీ చైతన్యులు -సమైఖ్య సూత్రం* వ్యాసం. మరియు విశ్వనాధ గారి నవలలో సినిమాల గురించి చెప్పిన అంశాలన్నీంటిని ఒక దగ్గర రాసి పరిశీలన చేసిన వ్యాసం *కవి సామ్రాట్ తెలుగు సినిమా*. విశ్వనాధ పాటలు రాసిన సిన్మా ఆకాశరాజ

1

[2:51:17 PM]WhatsWe:

. *నిరంతరం రాయటం పరిశోధన చేయటం అనేది తాను చేయడమే కాదు పరిశోధన పై ఆసక్తి వున్న రచన వ్యాసంగం పై ఆసక్తి వున్న మా లాంటి విద్యార్ధులకు ప్రోత్సాహం ఇస్తున్న గురువు* ఎవరైన విద్యార్ధి రచన చేస్తే నిజంగా బాగున్నా స్పందించడానికి సతమతం అయ్యి అతి హుందాకు పోయి గంభీరతను ప్రదర్శించే ఈ రోజుల్లో గురువు గారు నిత్యానంద రావు ఎవరి రచన అయినా బాగుంది అనుకుంటే ఏలాంటి సంకోచాలు లేకుండా విద్యార్ధులను ప్రోత్సాహించడం గొప్ప విషయం. విద్యార్ధులు ఎక్కడ కనిపించినా *ఏమయ్యా బాగున్నావా* అనీ విద్యార్ధులు వందన సమర్పణ కంటె ముందుగా పలకరించడం యోగ క్షేమాలు తెలుసుకోవడం వారి శిష్య వాత్సల్యం కు నిదర్శనం. *విద్యార్ధులకు గురుభక్తి ఉండడం చాలా సహజమైన విషయం. కానీ గురువులు తమ విద్యార్ధుల పై శిష్యవాత్సల్యం కలిగివుండడం చాలా గొప్ప విషయం*. ఉస్మానియా విశ్వ విద్యాలయం చక్కని పరిశోధనలకు నిలయం. ఇక్కడ గురువు గారు *పరిశోధన కు పర్యాయపదంగా మారారు*. ఎంతగా అంటే ఏ అంశం చెప్పిన ; పక్రియ ఏదైనా సరే ; ఆ అంశం పై ఏ పరిశోధన వచ్చింది ; ఏ సంవత్సరం లో ఏ యూనివర్సిటీ నుంచి వచ్చింది. ఇలా టకాటకా చెప్పే వీరి ధారణ శక్తి కీ మేమంతా (యూనివర్సిటీ విద్యార్ధులము) ఎప్పుడూ ఆశ్చర్యపోతునే ఉంటాం. వీరితో మాట్లాడుతుంటే సాహిత్య విశేషాలు పరిశోధన పై ప్రయోగాలు ఇవ్వన్నీ కూడా నేర్చుకుంటాం.

దశాబ్దాలుగా సాహిత్యం ను గమనిస్తూ వ్యాసాలు రాస్తున్న వీరి రచనలు కరదీపికలు గా పనిచేస్తాయి అనడం లో ఏలాంటి సందేహం లేదు. *వీరి శైలి రాజకీయాలకు అతీతమైనది. ఎన్ని పదవులు ; ఎన్ని భాధ్యతలున్న పరిశోధనకే ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తిత్వం వీరిది*

దశాబ్దాలుగా ఎంతో మంది కవులను పరిశోధకులను గమనించి వీరు ఎన్నో వందల కొద్దీ వ్యాసాలు నిరంతరం అలుపెరుగక రాస్తున్నారు. అవన్నీ కూడా ఒక పుస్తకరూపం లో వస్తే అవీ నేటి కాలపు విద్యార్ధులకు ఎంతో ఉపయోగకరం. *గతం లో జీవియస్ గారి వ్యాసాలును ఇతర రచయితల వ్యాసాలు ను పుస్తకరూపం లో ముద్రించిన తెలుగు అకాడమీ వంటి సంస్థలు* వీరి వ్యాసాలను కూడా ముద్రించి విద్యార్ధులకు అందిస్తే అదీ కూడా సాహిత్య సేవయే అవుతుంది

*మనిషి బుద్దిజీవి. కొత్త విషయాలు తెలుసుకోవాలి అనే ఆసక్తి నిరంతర వుంటూనే ఉంటుంది. మనిషి ఎప్పుడు నిత్యాన్వేషిగా సత్యాన్వేషిగా నిత్యం అనుశీలనం చేస్తూ వైవిధ్యం కోసం వెదికితేనే జ్ఞానం పెరుగుతుంది* అలాంటి జిజ్ఞాస తోనే నిత్యం ; నిరంతరం పరిశోధనాలోచనలు చేస్తూ ; మాతో చేయిస్తూ నా లాంటి ఎందరో యువ పరిశోధకులకు స్పూర్తినిస్తున్న మా గురువు గారు ఆచార్య డా.వెలుదండ నిత్యానంద రావు గారికీ మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ.....


*ఐ.చిదానందం*

WhatsWe:

ు. కానీ ఆ తర్వాత ఎందుకనో విశ్వనాధ పాటల పై పట్టు సాధించలేదు. ఇదే విషయం ను చమత్కారంగా వ్యాసం ఉపశీర్షిక గా *తుస్సుమన్న ఆకాశరాజు* అనీ పేరు పెట్టారు. మరో వ్యాసం వేమన తర్వాత అన్నమాచార్యుల మీద ఎంతో మంది లెక్కకు లేని పరిశోధనలు చేసారు. వారందరినీ గురించి తెలుసుకోవడం కష్టం. ఇంకా చెప్పాలంటే ఆరుద్ర గారు రాసిన సమగ్రాంధ్ర సాహిత్యంలో వేమన పై చేసిన పరిశోధకుల గురించి విపులంగా ఇచ్చారు. కానీ అదే అన్నమాచార్యుల పై వారి కుటుంబ కవులను గురించి ఇచ్చారు గానీ వారిపై పరిశోధనలు చేసిన వారిపై పూర్తిగానీ పదప్రయోగాల గురించి గానీ అంతగా చెప్పలేదు. కానీ నిత్యనంద రావుగారు రాసిన వ్యాసం లో *అన్నమయ్య పద ప్రయోగాలు* గురించి వారి పై పరిశోధనల గురించి వివరణ గా రాసారు. భవిష్యత్ పరిశోధకులకు ఇదీ ఉపయోగకరం. భిన్న పక్రియలలో గ్రంధ సమీక్షలన్నింటిని ప్రక్రియల వారిగా సంపుటాలుగా తీసుకుని రాయగలిగితే తెలుగు కు మేలు కలుగుతుంది అంటూ *సాహిత్య విమర్శ - గ్రంథ సమీక్షా* లపై ఒక వ్యాసం ; సేకరించే ఓపికే ఉండాలే కానీ *కృష్ణానది మీద వచ్చిన కవితలతో సిద్దాంత వ్యాసం రాయొచ్చు* అనీ ఒక వ్యాసం ; *అసలీ కాలపు కుర్రాళ్లు కనీసం ప్రేమలేఖలైనా సరిగ్గా రాసుకోగలుగుతున్నారా ? బతికి వుంటే చలానికి డౌట్ వచ్చి వుండేది* అంటూ చిలిపిగా ప్రశ్నిస్తూ మరో వ్యాసం. ఇంకా *యాత్ర చరిత్రలు - ప్రయోజనత్మకత ; వ్యాఖ్యనాలలో అర్ధ నిర్ణయం- సాధక భాధకాలు ; విదేశాలలో రామకథ* ; ఇలా చాలా మంచి అంశాలతో నిత్యవైవిధ్యం గ్రంథం సాగుతుంది.

నిత్యనంద రావు గారి వ్యాస శైలి విశిష్టమైనది. ఏ వ్యాసం రాసిన *ఎంతో నిబద్ధత తో నిరాడంబరంగా సూక్ష్మదృష్టి తో ఏలాంటి గజిబిజి లేకుండా సూటిగా* చెప్పుకుంటూపోతారు. మధ్యలో *హాస్యవంతమైన చమత్కారపూరితమైన వీరి రచన శైలి* వ్యాసాంగం కు ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తాయి. అలాంటి వీరి మరో వ్యాస సంపుటి *నిత్యానుశీలనం*. తెలుగు లిఖిత సాహిత్యము నన్నయ్య కాలం నుంచి నన్నయ్య పూర్వం సంవత్సరాల నుంచి తెలుగు భాష ఉందనీ అందరికి తెలుసు . వీరి పరిశోధన వ్యాసం *క్రీస్తు పూర్వమే తెలుగు వ్యాకరణం* వ్యాసం మనకు ఎన్నో విషయాలను తేల్పుతుంది. ఇదే కాదు *నిజాం పాలన లో వెలవెలబొయిన తెలుగు ; జానపద గేయాలు హాస్యం ; తెలుగు లో అకార గ్రంథాలు*; వంటి 14 వ్యాసాలు కూడా విమర్శ తో కూడి ఆలోచింపచేస్తాయి. అలాగే *హాస విలాసం* అనే వ్యాస సంపుటి లో *తెలుగు వారి హాస్యం ; హాస్య చతురుడిగా విశ్వనాథ ; పేరడీల గారడిలు ; నీ కవిత కు సాటిలేదు సిరిసిరిమువ్వ ; హాస్య తత్త్వ విచారణ* వంటివి హాయిగా నవ్విస్తూ చదివింపచేస్తాయి. నిత్యానంద రావు సర్ వినూత్నాంశాలు సేకరిస్తారు. వివేచన తో రాస్తారు. హేతుబద్ధంగా అలోచిస్తారు. పరిశీలన తో వ్యాఖ్యనిస్తారు. ఎంత వరకు సాధ్యమో ఎంత వరకు ఆమోదయోగ్యమో అంత వరకే చెబుతూ పరిశోధన ను సుసంపన్నం చేస్తున్నారు. *కొందరు వ్యాసం రాస్తే తీసుకొన్న అంశం పై విశ్లేషణ చేసి అందులో సమస్యను ఎత్తి చూపి చేతులు దులుపుకుంటారు. కానీ ఇక్కడ ఆచార్యులు ఇంతటితో వదిలివేయరు*.ఒక వ్యాసం రాస్తే ఆ విషయం పై పూర్తి అవగాహన తో రాస్తూ చివర్లో ఒక మంచి సూచన తో ముగిస్తారు.ఇలా రాసే వారు చాలా అరుదు. వీరు వ్యాసం చివరిలో పుట్ వర్క్ గా ఆధార గ్రంధాలు ఇవ్వడం వీరిని ఖచ్చితమైన పరిశోధకుడి లక్షణం ను తెలియజేస్తుంది.

వీరి మరో గ్రంథం *తెలుగు పరిశోధన వ్యాస మంజరి* ఇదీ 2- భాగములు గా సాగింది. ఇదీ 2005 నుంచి 2009 వరకు వచ్చిన సిద్దాంత వ్యాసాల సార సంగ్రహ సూచీ. దీని తోలి భాగం లో 60 మంది ; ద్వితీయ భాగం లో 143 మంది పరిశోధకుల సిద్దాంత వ్యాసాలపై సాగిన వ్యాఖ్య లా ఉంటుంది. ఇదీ వీరు మాత్రమే చేయగలిగిన సమీక్షలు. ఈ గ్రంథం నాటి మహాభారతం నుంచి నేటి ఆధునిక సాహిత్యం వరకు అప్పుడు వచ్చిన గ్రంధాలపై సార సంగ్రహం. *నేటి కాలపు పరిశోధకలలో ఉన్న విషయసేకరణ అవస్థ ను;విషయ సూచిక నిర్ణయం ను పరిశోధన స్తబ్ధతను తొలగించడంకు* ఉపయోగపడుతుంది.

వీరి మరో గ్రంథరాజం *విశ్వ విద్యాలయాలలో తెలుగు పరిశోధన* ఈ రచన ఏ ఒక్క రచయితనో ఏ ఒక్క పరిశోధకుడో చేయగలిగే సంకలనం కాదు. పుస్తకం చూస్తే కూడా మనకు అలా అనిపించదు. కానీ ఈ పుస్తకం ఒక్క రచయితే సంకలనం చేసారంటే ఆశ్చర్యపోతాము. *ఈ పుస్తకం కు ను పరిశోధకుడి గా పరిశీలిస్తే గురువు గారి పరిశ్రమ ను ; పరిశోధనపై మక్కువ ను ; అచంచల ఆసక్తిని ; పట్టు విడవని పట్టుదలను ప్రశంసించకుండా ఉండలేం.* ఇన్నీ సంవత్సరాల ఇన్నీ పరిశోధనల మధ్య ఏ అంశం పై పరిశోధన చేయాలో ఏ అంశం పై పరిశోధన వచ్చిందో తెలియచేయడమే కాదు. సుదీర్ఘ ముందుమాట లో *పరిశోధన మేథడ్స్* ను కూడా వివరణ ఇస్తూ పరిశోధనకు ప్రాంగణం లా ఉపయోగ పడే ఆ రచనకు ఆ రచయితకు ధన్యవాదములు చెప్పకుండా ఉండలేము. విశ్వ విద్యాలయాలలో తెలుగు పరిశోధన అనే పుస్తకం కొత్త గా పరిశోధన రంగం లో చేరే వారికే కాదు. పరిశోధన లో తలమునకలైన వారికి కూడా విసృతంగా ఉపయుక్తం.

ఇక వ్యక్తిగతం గా గురువు గారి గురించి చెప్పాలంటే వీరు సౌమ్యులు. ఎప్పుడూ ఒక పరుష మాట ఇతరులను అననీ వ్యక్తి