మూడు ఆత్మలు ఉంటాయా? భగవద్గీత త్రైతమా? ద్వైతమా? అద్వైతమా??

శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా చెప్పెను!?

"సమస్త ప్రాణుల హృదయాల్లో నివాసం ఏర్పరుచుకుని ఉన్నది నేనే! నావల్లనే జ్ఞానము,జ్ఞాపకాలు,మరపులు కలుగుతున్నాయి! వేద జ్ఞానపు గమ్యాన్ని నేనే,వేదం తెలిసిన వాడిని నేనే!
పురుషులు క్షర(నాశనమయ్యేవాడు) అక్షరులని(నాశనం లేనివాడు) రెండు రకాలుగా ఉన్నాడు! తాత్కాలికంగా ఉండేవాడు క్షరుడైతే,శాశ్వతుడు అక్షరుడు! అయితే ఆ ఇద్దరికన్నా నాశనమే లేని వాడు,ఉత్తముడు ఈశ్వరుడు విశ్వప్రభువై ఉన్నాడు! క్షరునికన్నా మిన్న నేను! అక్షరునికన్నా ఉత్తముడిని,అందువల్ల అన్ని లోకాల్లో,వేదాల్లో పురుషోత్తమునిగా ప్రసిద్ది పొందాను!ఓ అర్జునా! మోహాన్ని విడిచి,నన్ను పురుషోత్తమునిగా తెలుసుకుని అంతా బ్రహ్మమే అనే భావంతో ఉపాసించేవాడు నన్నే చేరతాడు! రహస్యమైన గుప్తశాస్త్రాన్ని నీకు తెలిపాను! దీనిని అర్థం చేసుకున్నవాడు బుద్దిమంతుడు అవుతాడు!" అని అర్జునుడితో చెప్పెను!

భగవద్గీత శ్లోకాల్లో కాని,శ్లోకభావాల్లో కాని ఎక్కడా కూడా "ఆత్మలు" అని బహువచనం లేదు! అనేక శ్లోకాల్లో కేవలం "ఆత్మ" అనే ఏకవచనమే ఉంది!భగవంతుడు జ్ఞానగీతను అర్జునుడికి అద్వైతభావముతో,"ఒక్కటే పరబ్రహ్మను" అనే భావనతో బోదించాడు! అయితే ఈ క్షర,అక్షర,పురుషోత్తములు ఒకటేనా?

భార్యకి యజమాని భర్త!భర్త, భార్యకి యజమాని అయినపుడు ఆ ఇంటికి కూడా యజమాని ఆ భర్తే! అలాగే ఈ విశ్వంతో పాటు ఈ విశ్వంతో ఉన్న మన ప్రపంచానికి యజమాని పరమాత్ముడే! ఈ పంచభూత శరీరాలకు కూడా ఆయనే యజమాని! నాశనమయ్యేది ప్రకృతి! ఆ పరమాత్ముని ఒక అంశ అయిన ఆత్మ చైతన్యం ప్రకృతి లో,త్రిగుణాల కలయికతో శరీరాల్లో జీవాత్మగా,జీవుడిగా చెలామని అవుతుంది!ఈ పంచభూత ప్రకృతి దేహాల్లో "ఆత్మ" ఉండడం వల్ల దానిని జీవుడు లేదా జీవాత్మ అంటారు! ప్రకృతి జీవంలో బంధింపబడిన తరువాత ఆ ఆత్మ జీవాత్మ(జీవ+ఆత్మ) అవుతుంది! ఈ జీవుడిని క్షరుడు అంటారు! ఈ జీవునిలోని ఉన్న అదే ఆత్మ నాశనం లేనిది! కాబట్టి జీవాన్ని విడిచిన ఆత్మ అక్షరమైనది! ఆ అక్షరమైన ఆత్మే మళ్ళీ మరో శరీరంలో బంధింపబడగానే అది క్షరమయ్యే జీవాత్మ అవుతుంది! క్షరమయ్యే ప్రకృతి జీవంలో ఆత్మ ఆధారంగా ఉన్నవారు ఎందరో సాధనతో యోగులుగా మారి అక్షరమైన ఆత్మను జ్ఞానదృష్టితో సాక్షాత్కరించుకుని,నాశనరహితుడైన పురుషోత్తముడిని పొందుకున్నారు! సృష్టి,స్థితి,లయల్లో కర్మప్రకారం శరీరాలు మారుస్తూ ఉండేది ఆ ఆత్మే కాని మాయా ప్రకృతిలో త్రిగుణాల వల్ల బందింపబడిన జీవుడు దానిని తెలిసుకోలేకపోతున్నాడు! ఎవరైతే మానవ జన్మలో అతి రహస్యమైన ఈ గీతా శాస్త్రాన్ని తెలుసుకుని క్షరునిలో,అక్షరుడు అవ్యక్తంగా ఉన్నాడని ఎరిగి ఆ పురుషోత్తముడిని ఏకభావంతో ఉపాసించు వారు ఈ జన్మలో లేదా మరి కొన్ని జన్మల్లోనే ఖచ్చితంగా పరమపదాన్ని చేరుకుంటారు!

(భగవద్గీత 15-15 నుండి 15-20 వరకు గల శ్లోక భావాల ఆధారంగా...)

Image may contain: 2 people