రామాయణం సందేశం ఏమిటి?

ఓం శ్రీ రామాయ నమః

రామాయణం సందేశం ఏమిటి?

రావణాసురుడు, విభీషణుడు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేస్తాడు. బ్రహ్మ ప్రత్యక్షమవుతారు. రావణుడు మరణం వద్దని కోరుకోగా, అది జరగనిపని అంటాడు బ్రహ్మ దేవుడు. చివరకు కడుపులో ఒక కుండలో ప్రాణాలు ఉండేలా వరం కోరుకుంటాడు. విభీషణుడు "ఎప్పుడు ధర్మాన్ని ఆచరించేలా, ధర్మాన్ని ఎప్పుడు విడువకుండా ఉండేలా, ధర్మ మార్గంలోనే నడిచేలా వరం ఇవ్వండి" అన్నాడు. సరేనన్న బ్రహ్మ ఈ వరాలతో పాటు "నువ్వు చిరంజీవత్వాన్ని పొందుతావు" అంటూ వరం ఇచ్చాడు.

మరణం వద్దన్నవాడికేమో కుదరదన్నారు, ధర్మమే కావాలన్న వాడు మరణం లేని స్థితిని పొందాడు. ఆనాడు ఆ వరం పొందిన విభీషణుడు ఈనాటికి జీవించి ఉన్నాడు.

పరపరుషుడిని, అందునా పెళ్ళైనా వాడిని కామభావంతో చూసిన శూర్పణక ముక్కు, చెవులు పోయి అందవీహనమైంది. పరస్త్రీని ఎత్తుకుపోయిన రావణాసురుడు సర్వనాశనం అయ్యాడు. అశోకా వనంలో బాధతో కూర్చున్న సీతమ్మను తల్లిలా చూసిన హనుమంతుడు భవిష్యబ్రహ్మై ఈరోజుకు హిమాలయాల్లో మానససరోవరం దగ్గర తపస్సు చేసుకుంటున్నారు.

వాలి మహాపరాక్రమవంతుడు. సుగ్రీవుని భార్యను చెరబట్టాడు. రాముడు సుగ్రీవుని వెనుకాల ఉన్నాడని తెలిసీ, సుగ్రీవునుతో యుద్ధం చేశాడు, రాముని చేతిలో మరణించాడు. అధర్మంగా దేవుడిని నమ్ముకున్నవాడి సొమ్ము దొంగిలించినా, వాడి జోలికి వెళ్ళినవారు ఎంత శక్తివంతులైన వాలిలాగే నాశనమవుతారు.

ఎక్కడ స్త్రీ కంటతడి పెడుతుందో అక్కడ సర్వం నాశనమవుతుంది. లంకలో సీత ఎంతో విలిపించింది. ఆ ప్రభావంతో లంక మొత్త హనుమంతుడి చేతిలో కాలిపోయింది.

ఓం శ్రీ రామాయ నమః