మంత్ర జపం యోగజపం

మంత్ర జపం యోగజపం కృత్వ పాప నివారణమ్,
పరం మోక్ష మవాప్నోతి మానుషో నాత్ర సంశయః!

మానవుడు జ్ఞానమునకు నిధి, మంత్ర జపము వలన పాప నివారణ జరుగును.అటువంటి మంత్ర సాధన మానవ జన్మ వలనే సాధ్యమగును. దాని వలనే తత్వ జ్ఞానము సిధ్దించును.

Mantra Japa: Chanting the name of Lord
ఇతర జీవులలో జ్ఞాన గుణము లేదు. కేవలం పుణ్యము చేయుట వలనే మనుష్య జన్మ లభించుచున్నది. అటువంటి మనుష్యుడు సాధన చేతనే దేవతా సమానమగుచున్నాడు. దేహము లేనిదే పురుషార్ధము సిధ్ధించదు. కనుక ఈ శరీరమును రక్షించుకొనుచూ జ్ఞాన ప్రాప్తికి సాధన చేయవలెను...

మననం చేయడం వలన కాపాడేది మంత్రం మనస్సుకు చాంచల్య స్వభావం (ఒకచోట ఉండకుండా అనేకరకాలుగా ఏదో ఒకటి చేయాలి చేయాలి అంటూనే వుంటుంది)

ఈ చంచల స్వభావం మానసిక వృత్తులను చిందరవందర చేస్తుంది. ఈ మానసిక వృత్తులు అన్నీ ఒకచోట చేరినప్పుడే అపారమైన శక్తి ఒకచోట చేరుతుంది. అప్పుడు ఆ శక్తి దైవశక్తి వలె పనిచేయడం ప్రారంభిస్తుంది. మంత్రానికి అంతఃకరణానికి సంబంధం వుంది.

మంత్రజపం వలన మనస్సుని వశపరచుకోవచ్చు. నాడీ శుద్ధి జరుగుతుంది.
కుండలిని శక్తి జాగృతమౌతుంది. వ్యాధులు దూరమౌతాయి. మంత్ర సాధన వల్ల దేవతలు తమకు తామై దిగివస్తారు. నానావిధ సిద్ధులు సిద్ధిస్తాయి. మంత్రజప సాధన వలన సిద్ధులు కలుగుతాయని యోగా దర్శనం చెబుతుంది

ఎందరో మునులు, ఋషులు ఈమంత్రజపం వలనే సిద్ధులు సాధించారు.

సాధన వలన అధర్మపరుడిని ధర్మపరుడిగా, దానవుణ్ణి మానవునిగా, పాషండుని సదాచార పరాయనునిగా, దుఃఖ వంతుడిని, సుఖవంతుడిగా, కోపిని శాంతునిగా, ధరిద్రుడిని ధనవంతుడిగా, లోభిని త్యాగిగా, కాముని, జితేంద్రియునిగా, నాస్తికుడిని ఆస్తికుడిగా, తెజోవిహీనుడిని తేజోవంతునిగా, రోగిని ఆరోగ్యవంతునిగా, చేస్తుంది.

అంధకారం నుండి ప్రకాశం వైపు మృత్యువు నుండి అమృతం వైపు, నరకం నుండి స్వర్గం వైపు, హింస నుండి అహింస వైపు, దిర్భుద్ధి నుండి సద్బుద్ధి వైపు,తీసుకొనిపోతుంది. మంత్రమే దేవతా రూపాన్ని పొంది అత్మసక్షాత్కారాన్ని కలిగిస్తుంది.

జపం అనేది మూడు విధాలు

1.బాహ్య జపం 2.ఉపాంశు జపం 3.మానసికజపం

1.బాహ్య జపం

ఒక జపమాల తీసుకుని దానిని ఒక నామాన్నో లేక మంత్రాన్నో ఉచ్ఛరిస్తూ కనుక విధిగా అభ్యాసం చేసినట్లైతే అది బాహ్య జపం !!

2.ఉపాంశు జపం

ఈ దశలో జపం జరిగే సమయంలో మాల తిరుగుతుంది, పెదవులు కదులుతుంటాయి కాని శబ్దం బయటకు వినపడకుండా సాగుతుంది !!

3.అంతరంగ జపం

ఇక్కడ ఈ స్థితిలో జపం నిరంతరాయమానముగా కొనసాగుతూనే ఉంటుంది ...

జపమాల తిరుగుతూనే ఉంటుంది కాని పెదవులు నాలుక కదలవు కేవలం మనసులో మాత్రమే నామస్మరణ (మంత్ర జపం) సాగుతూ ఉంటుంది

జపంతో నిరంతరం భగవన్నామ స్మరణ చేయడం వల్ల, పరిపరి విధాలా పరుగులుదీసే ఇంద్రియాలు స్థిమితపడతాయి. మనం ఏ మంత్రాన్నైతే జపిస్తున్నామో అది మన మనసులోకి అంతకంతకూ గాఢంగా చొచ్చుకుపోతుంది. తొలుత బలవంతంగా కనిపించే ఈ ప్రక్రియ ఒక సాధనగా మారిపోతుంది.

ఇలా కొన్నాళ్లు సాధన చేసిన పిమ్మట సాధకుడు 'అజపజపం' అనే స్థితిని చేరుకుంటాడు. అంటే జపం చేయకున్నా కూడా మనసులోని ఒక భాగంలో నామస్మరణ నిర్విరామంగా సాగిపోతూనే ఉంటుంది.

మిగతా జీవుల సంగతేమో కానీ మనిషికి శబ్దానికీ మధ్య గాఢమైన సంబంధం ఉంది. మనిషి శబ్దం ద్వారానే తన భావాలను వ్యక్తపరుస్తాడు. శబ్దాన్ని వినడం ద్వారానే ఎదుట ఏం జరుగుతోందో అవగతం చేసుకుంటాడు. మనిషి వినే మాటకి అనుగుణంగా అతనిలోని మనసు ప్రతిస్పందిస్తుంది.

ఈ సృష్టి యావత్తూ ఓంకారం అనే శబ్దం నుంచి ఉత్పన్నం అయిందన్న వాదనలు హిందూ ధర్మంలో వినిపిస్తుంటాయి. అలాంటి శబ్దాన్ని ఉపాసించడం ద్వారా మనసుని లయం చేసుకోవడమే జపంలోని అంతరార్ధం.

అది నిర్విరామంగా సాగినా, జపమాల సాయంతో సాగినా.... మన జీవితాన్ని దైవ చైతన్యంతో అనుసంధానం కావడానికి, తనను తాను తరింప చేసుకోవడానికి ఒక నామాన్ని తలచుకోమని చెప్పడమే జప/మంత్ర సాధనలోని పరమార్థం.

Image may contain: 1 person, sitting and outdoor


Image may contain: text