భాను సప్తమి

భాను సప్తమి..!!
చాలా విశిష్టమైన రోజు..!?

సప్తమి తిథికి అధిపతి సూర్యుడు
సప్తసంఖ్యకు.. సూర్యునికీ అవినాభావ సంబంధం ఉంది. 
అతని జన్మ తిథి సప్తమి. 
అతని రథానికి గుర్రాలు ఏడు. 
తిరిగేది సప్త ద్వీపపర్యంతం. 
అతని కిరణాల్లోని కాంతి ఏడు రంగుల కలయిక.
సూర్యుని నుండే దిక్కులు ఏర్పడుతున్నాయి.

వారాలలో తొలి రోజైన ఆదివారం,
తిథుల్లో సప్తమి- సూర్యారాధనకు ప్రశస్తమని చెప్తారు..

రెండూ కలసి రావడం..
అంటే ఆదివారం రోజున సప్తమి తిథి ఉంటే..
భాను సప్తమి అంటారు

లోకంలోని చీకట్లను పారద్రోలుతూ ,
వెలుగులు పంచే సూర్యుడిని,
ప్రత్యక్ష నారాయణుడుగా భావించి ,
ఆరాధించడమనేది ప్రాచీనకాలం నుంచి వుంది.

ప్రకృతిని ప్రభావితం చేస్తూ ,
ఆ ప్రకృతి ద్వారా జీవరాశికి కావలసిన ఆహారాన్ని అందించేది సూర్యుడే కనుక,
ప్రాచీన కాలంలో సూర్యుడిని ఆరాధించేవారు.
ఆహారాన్ని ... ఆరోగ్యాన్ని అందించే దైవంగా 
ఆయన మానవాళిని ఎంతగానో ప్రభావితం చేశాడు.

ఉదయాన్నే స్నానంచేసి ,
సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి ,
నమస్కరించేవాళ్లు ఎంతోమంది కనిపిస్తుంటారు. 
సూర్యుడికి నమస్కరించడం వలన 
అనేక దోషాలు తొలగిపోతాయనీ ... 
పుణ్యఫలాలు చేకూరతాయనేది 
ఆధ్యాత్మిక గ్రంధాలలో కనిపిస్తుంది.

సూర్య భగవానుడికి ..దోసిటతో అర్ఘ్యం వదిలి ,
ఓ నమస్కారం సమర్పిస్తే సంతృప్తి చెందుతాడు.

అలాంటి మహిమ గల పవిత్రమైన ఈ భానుసప్తమి నాడు మనం కూడా సూర్య భగవానుడుని ప్రార్థన చేసి..
సూర్య స్తోత్రాలు..పఠించి..
ప్రత్యక్ష భగవంతుడైన సూర్య నారాయణుడి 
అనుగ్రహం పొందుదాం..!
ఓం నమో ఆదిత్యాయ నమః..!!?

సర్వే జనా సుఖినోభవంతు..!!?

Image may contain: 1 person



Image may contain: text