ప్రత్యేక పూజ - అన్నదానము

దాతల వివరాలు

Name & Family details Event & Date Sponcers Pay link
Meenashi Birthday
02-05-2018
Smt & sri A Sujathamma & Narayana
Vanaparthi
Pay here to renewal

Get Receipt here

Y Lakshmi Narayana Reddy
Padmavathi
Gotram: veyyi gadapala
Marrage Day
28-08-2018
Y AmarnathaReddy (son)
Aswini(Daughter)
Pay here to renewal

Get Receipt here

Pay here to renewal

Get Receipt here

Pay here to renewal

Get Receipt here

Pay here to renewal

Get Receipt here

Pay here to renewal

Get Receipt here

Pay here to renewal

Get Receipt here

Pay here to renewal

Get Receipt here

బొడ్డు తాయెత్తు .....

పురాతన కాలంలో పిల్లల బొడ్డు తాడు దాచి పెట్టేవాళ్ళు. నిజమేనా?

తాయత్తుని మనం చాలా అవహేళన చేస్తున్నాం, వెక్కిరిస్తున్నాం. గతంలో పుట్టిన ప్రతి బిడ్డ ఊడిన బొడ్డును (Umbilical cord) ఈ తాయత్తులలో పెట్టి మొలతాడుకు కట్టేవారు. దానికే మరొక పేరు "బొడ్డు తాయత్తు" మందులు లేని, వైద్యానికి అందని ఎన్నో రోగాలు ఈ బొడ్డుని అరగతీసి నాకిస్తే తగ్గేవి. ఎవరి బొడ్డు వారికే పనికొచ్చేది కనుక దాన్ని వారికి అందుబాటులో ఉంచటంకోసం చాలా తేలికైన ఖర్చులేని పని ఒక తాయత్తు చేసి దానిలో పెట్టి ఎవరి బొడ్డుని వారి మొలకే కట్టేవారు. స్తోమత ఉన్నవారు, వెండి తాయత్తులు చేయించుకునేవారు, లేనివారు ఏ రాగివో వాడుకునేవారు. ఏ మందుకు తగ్గని వ్యాధి ఎలా తగ్గిందంటే "తాయత్తు మహిమ" అనేవారు. ఈ "తాయత్తుమహిమ" అనే పదానికి అసలైన అర్థమిదే. ఈ బొడ్డుతాడు ను పరీక్షించి వ్యక్తికి భవిష్యత్తులో రాబోయే వ్యాధులను గుర్తించవచ్చట. కొన్ని రకాలా క్యాన్సర్లకు మూలకణాల చికిత్స చేస్తారు. అప్పుడు ఆ వ్యక్తి తోబుట్టువుల మూలకణాలు అవసరమవుతాయి. అన్ని సందర్భాల్లో తోబుట్టువులు అందుబాటులో ఉంటారని అనుకోలేము. ఎవరి జీవితం ఎప్పటికి ముగుస్తుందో చెప్పలేరు. అందుకే బొడ్డుతాడుని దాస్తే, అది ఆ వ్యక్తికి భవిష్యత్తులో అవసరమవుతుంది. అది కూడా ఆ వ్యక్తి దగ్గరే ఉంటే, ఆపాత్సమయంలో వెతికే అవసరం ఉండదు. త్వరగా దొరుకుతుంది, మారిపోయే అవకాశం ఉండదు. అదేకాక వెండిలో చుట్టించి కట్టడం వెనుక ఆయుర్వేదం కూడా దాగి ఉంది.

ఆధునిక సైన్సుకూడా దీనినే నిరూపించి, ఈ స్టెం సెల్స్ క్యాన్సర్, జుట్టు ఊడిపోవటం, కిడ్నీ, రక్త సంబంధ వ్యాధులు, ఎముకల సమస్యలకి ఇలా ఎన్నో అంతుబట్టని, ఒక పట్టాన తగ్గని రోగాలకు కూడా పని చేస్తుందని ప్రచారం చేసుకుంటూ వాటిని భద్రపరచటానికి బ్యాంకులు తెరిచి కోట్ల వ్యాపారం చేస్తున్నారు.

ఈవాళ ఒక బొడ్డుని భద్రపరచటానికి ఒక బ్యాంకు లాకర్ అద్దే సుమారు 20,000 రూపాయలుంది. ఆ అవసరం లేకుండా తాయత్తులో పెట్టుకుని మొలకు చుట్టుకుంటే అనాగరికమయింది. అవహేళన చేయబడుతుంది. వెక్కిరించబడుతు
ంది.

అతి ప్రాచీన కాలంలో కూడా పిల్లల బొడ్డుతాడుని దాచి పెట్టేవాళ్ళు. కారణాలు మాత్రం ఎవరికీ తెలియవు. చెప్పగలిగిన పెద్దవాళ్ళు కనిపించలేదు. పూర్వ కాలంలో అలా ఎందుకు చేసేవాళ్ళో తెలియదు. అందుకేనేమో ఆ తర్వాత మూఢ నమ్మకాలు ప్రబలాయి. పిల్లల్లేనివాళ్ళు ఈ బొడ్డు తాడు మింగితే వారికి సంతానం కలుగుతుందని కొందరు సంతానం కోరి దీనిని మింగేవాళ్ళు. కొందరు దీనిని తాయత్తులలో వేయించి పిల్లలకి కట్టేవాళ్ళు.
అనేక పరిశోధనల తర్వాత ఈ మధ్య బొడ్డు తాడు విలువను గుర్తించి వాటిని దాచి పెట్టటానికి ఒక బేంక్ పెట్టారు. దీనిలో 40 సంవత్సరాల వరకూ బొడ్డుతాడుని దాచిపెట్టవచ్చు. అ.యితే ఇప్పుడు మనకు కారణాలు తెలుసు. ఆధునిక పరిశోధనలలో తేలింది ఏమిటంటే, బొడ్డు తాడులో వున్న మూల కణాల సహకారంతో ఆ వ్యక్తికి భవిష్యత్ లో ఏదైనా పైద్ద వ్యాధి వచ్చినప్పుడు వైద్య చికిత్స చెయ్యవచ్చు, దానితో అద్భుతమైన ఫలితాలు రాబట్టచ్చని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు.

పూర్వకాలంలో (అప్పుడు మన దగ్గర కేవలం ఆయుర్వేద వైద్యం మాత్రమే వుండేది) మన పెద్దలు, మన వైద్యులు ఎంత శాస్త్ర జ్ఞానాన్ని కలిగి వున్నారో తెలుస్తోంది. బహుశా వాళ్ళు ఈ వైద్యం చేసేవాళ్ళేమో. అయితే మనకి ఆధారాలు లేవు.

తులసి కవచం

ఈ కవచమును ప్రతినిత్యము పాత్ర:కాలమందు పారాయణము చేయువరాలకు ఆరోగ్యము, ఆయుర్దాయము,అభివృద్ది చెందును.
అకాల మరణములు దరిచేరవు. సంతానవృద్ది,పశువృద్ది, ధనవృద్ది, సర్వజన వస్యము
లభించును. నిరుద్యోగులకు ఉద్యోగము, ఉద్యోగులకు ఉద్యోగ అభివృద్ది కలుగును. స్త్రీలకు ఈ కవచం పారాయణం
చేయటం వలన సౌభాగ్యం వృద్ది చెందును.
తులసీ మహాదేవీనమ: పంకజధారిణీ
శిరోమే తులసీపాతు సాలం పాతు యశస్వినీ
దృశోమే పద్మనయనా శ్రీసఖీ శ్రవణౌమమ
ఘ్రాణం పాతు సుగంధమే నఖంచ సుముఖీమమ .
“జిహ్వాం పాతు శుభదా కంఠవిద్యామయో మమ
స్కందౌ కల్హారిణీ పాతు హృదయం విష్ణువల్లభా
పుణ్యదాపాతుమే మధ్యం నాభిం సౌభాగ్యదాయినీ
కటికుండలినీ పాతు ఊరూ నారద వందితా “
జననీ జానునీ పాతు జంఘే సకల వందితా
నారాయణప్రియా పాదౌ సర్వాంగం సర్వరక్షిణీ
సంకటే విషమే దుర్గే భయే వాదే మహాహవే
నిత్యే సాధ్యౌవ:పాతు తులసీ సర్వదా సదా
ఇతీదం పరం గుహ్యం తులస్యాకవచామృతం
మృత్యోరమృతార్ధాయ భీతానామభయాయచ
మోక్షాయచ ముముక్షూణాం ధ్యానినాం ధ్యాన యోగకృత్
పశాయచ విశ్వకామానం విద్యావై వేద వాదినామ్
ద్రవిణాం దరిద్రాణాం పాపినాం పాపశాంతయే
అన్నాయ క్షుధితీనాం చ స్వర్గమిచ్చతాం
భక్త్యర్ధం విష్ణు భక్తానాం విష్ణో సర్వాంతరాత్మని .
జాప్యం త్రివర్గ సిద్యర్ధం గృహస్థేన విశేషతతులసి కవచం

Image may contain: 1 person

ఆషాఢమాసం - ప్రత్యేకతలు

ఆషాఢమాసం అనగానే చాలా మందిలో దుర్ముహుర్తాలు మొదలు కానున్నాయి అనే భావన ఉంటుంది. నిజానికి అలాంటిది ఏమి ఉండదు. పైగా ఆషాఢమాసం చాలా పవిత్రమైనది కూడానూ. ఉదాహరణకు అత్యంత శక్తివంతురాలు అయినటువంటి పార్వతీదేవి యొక్క వివిధ స్వరూపాలకు ఈ మాసం లోనే అనేక పూజలు జరుగుతాయి. ఈ మాసం లోనే తెలంగాణా ప్రాంతం లో అమ్మవారికి బోనాల జాతర జరుగుతుంది. మిగిలిన ఆంధ్ర్ర రాష్ట్రం లో కూడా అమ్మవారు ( విజయవాడ కనక దుర్గ తో సహా ) శాకంబరీ దేవి రూపంలో వివిధ పూజలు అందుకుంటుంది.
అంతే గాక ఆషాడమాసం లోనే పవిత్రమైనటువంటి "తొలి ఏకాదశి" పండుగ వస్తుంది. వేదోపనిషత్తుల రూప కర్త సాక్షాత్ విష్ణు స్వరూపుడు అయినటువంటి వేద వ్యాసులు కూడా ఈ మాసం లోనే జన్మించారు.
తొలి ఏకాదశి : ఆషాఢమాసం లో వచ్చే ఈ పండుగ చాలా పవిత్రమైనది. ఆషాఢమాసం శుద్ధ ఏకాదశి నాడు ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ నాడు "చాతుర్మాస్య వ్రతం" మొదలవుతుంది. ఈ వ్రతాన్ని నాలుగు నెలల పాటు ఆచరించవలసి ఉంటుంది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. ఆషాఢ మాసం లో మొదలైన ఈ వ్రతం శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తికం లో ముగుస్తుంది. ఒక్కో నెలలో ఒక్కొక్క విధమైన నియమాలతో ఉపవాస దీక్షను ఆచరించ వలసి ఉంటుంది.
పూరి జగన్నాథ రథ యాత్ర : భారత దేశం లో జరుపుకునే ఈ పండుగ ఆషాఢమాసం శుద్ధ విదియ నాడు వచ్చేదే. ఒరిస్సా రాష్ట్రం లోని "పూరి" అనే ప్రాంతంలో ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుతారు. రథ యాత్ర లో మొత్తం మూడు రథాలలో జగన్నాథుని గా వెలసిన శ్రీ కృష్ణుడు, బలరాముడు మరియు వారి సహోదరి సుభద్రలను ఊరేగిస్తారు. వీరు ఉన్న ఆలయం నుండి మూడు కిలోమీటర్ల వరకు ఈ రథ యాత్ర కన్నుల పండుగ గా కొనసాగుతుంది. భక్తులు వేలాది సంఖ్యలో పాల్గొంటారు. అలా ఊరేగించి తీసుకెళ్ళిన వారిని వారి పిన్ని గృహంలో ఒక వారం రోజుల పాటు వుంచి మళ్లీ తిరిగి స్వస్థానాలకు తీసుకెళ్తారు. ఈ రథయాత్ర యొక్క అంతరార్థాన్ని"క
ఠోపనిషత్తు " లో చక్కగా వర్ణించారు కఠ మహర్షుల వారు.
"ఆత్మనాం రాతినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధిం తు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవ చ".
భావం: శరీరం రథము, ఆత్మయే అందులో ప్రతిష్టితమైన భగవంతుడు. నీకున్న జ్ఞానమే నీ మనస్సుని ఆలోచనలను సమన్వయ పరుస్తూ నిన్ను ముందుకు నడిపే రథ సారథి.
గురు పౌర్ణమి : సకల వేదాలను భారతావనికి అందించినటువంటి మహానుభావుడు శ్రీ వ్యాస భగవానుడు జన్మించిన రోజును నేటికి గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటారు. ఆషాఢమాసం పౌర్ణమి రోజున వ్యాసుడు జన్మించాడు.
ఉజ్జయిని మహంకాళి జాతర: సికింద్రాబాదు లో కొలువై ఉన్నఉజ్జయిని మహంకాళికి ప్రజలు భక్తి శ్రద్ధలతో సమర్పించుకునే బోనాలు ఆషాఢమాసం లోనే జరుపుతారు. ప్రతి ఏటా ఆషాఢమాసం లోని మూడవ ఆది వారము నాడు ఈ జాతరను భక్తులు భక్తి పారవశ్యం తో జరుపుకుంటారు. ఇక్కడి ఆలయంలో ప్రతిష్టించిన అమ్మవారి విగ్రహాన్ని పూర్వం ఉజ్జయిని ప్రాంత శిల్పులతో చెక్కించి తీసుకు రావటం వాళ్ళ ఈ మహంకాళీ అమ్మ వారు ఉజ్జయిని మహంకాళీ గా పిలువ బడుతుంది. ఇంతకంటే ముందు వారమే అనగా ఆషాఢమాసం రెండవ ఆది వారం నాడు గోల్కొండ కోటలో సమర్పించే బోనాలతో తెలంగాణా ప్రాంతం లో బోనాల ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. ఇక నాల్గవ ఆదివారం మిగిలిన నగర వాసులు తమ తమ ఊళ్లలో వెలసిన అమ్మవార్లకు బోనాలు సమర్పించుకుంటారు. అలా తెలంగాణా లోని అన్ని ప్రాంతాల ప్రజలు దసరా, దీపావళి పండుగల వరకు తమ వీలుని బట్టి ఏదో ఒక ఆదివారం నాడు బోనాలు జరుపుకుంటూనే వుంటారు.
ఆషాఢమాసం లో వివాహాలు ఎందుకు జరుపుకోరు? : ఆషాఢమాసం లో వర్షాకాలం ప్రారంభం అవుతుంది. జ్వరాలకు, వివిధ రోగాలకు ఇది అనువైన కాలం. బంధువులు, మిత్రులు లేదా ఇంట్లో వారు అనారోగ్యం తో వుండే అవకాశాలు ఎక్కువ. అప్పట్లో వైద్యం కూడా సరిగ్గా అందుబాటులో ఉండేది కాదు. మరణాలు కూడా సంభవించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉండేవి. కావున ఆ రోజుల్లో వాళ్ళకి ఇదొక పెద్ద సమస్య గానే ఉండేది. ఇక రెండో కారణం, పూర్వాకాలంలో వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఎన్నో ఉండేవి. కాబట్టి వాళ్ళకు వ్యవసాయ పనులకు ఇది చక్కటి సమయం. ఊళ్ళో వాళ్ళంతా వారి వారి పొలం పనులలో మునిగి తీరిక వుండేది కాదు. ఈ రోజుల్లో జరుపుకుంటున్నాం కాని వెనుకటి రోజుల్లో ఊళ్ళో వాళ్ళు లేకుండా పెళ్లి అంటే వాళ్లకు కొంచెం ఆలోచించవలసిన విషయమే. కాబట్టి ఈ మాసం లో పెళ్లిళ్లకు వాళ్ళు అంతగా ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళు కాకపోవచ్చు. అంతే గాక మూడో కారణం, ఇదే మాసంలో వచ్చే తొలి ఏకాదశి పండుగ తో ప్రారంభించే చాతుర్మాస్య వ్రతం లో ఆచరించ వలసిన ఆహారనియమాలు పెళ్లి విందు భోజనాలకు అనువైనవి గా ఉండేవి కాకపోవచ్చు.
ఆషాఢమాసంలో కొత్తగా పెళ్ళైన యువతి భర్తకు గానీ అత్తకు గానీ దూరంగా ఉండాలా? : అవసరమే లేదు. ఈ విషయాలు కూడా శాస్త్రాలలో ఎక్కడా కనిపించవు. కేవలం అపోహలే. వ్యవసాయం పనులు చక్కగా చేసుకొనే అనువైన సమయంలో కొత్త భార్య పక్కన వుంటే పనులు జరగవేమో అన్న కారణం అయి ఉండవచ్చు.

Image may contain: 1 person