నిత్యధీపారాధన

దాతల వివరాలు

Name & Family details start Date Renewal Date Pay link
Y Lakshmi Narayana Reddy
Padmavathi

Amarnatha Reddy
Gotram: veyyi gadapala

01-04-2018 31-03-2019 Pay here to renewal
Get Receipt here
Pay here to renewal

Get Receipt here

Pay here to renewal

Get Receipt here

Pay here to renewal

Get Receipt here

Pay here to renewal

Get Receipt here

Pay here to renewal

Get Receipt here

Pay here to renewal

Get Receipt here

మన పూర్వీకులు గుడికి వెళ్లినప్పుడు దర్శనం అయ్యాక గుడి నుండి బయటకు వచ్చే ముందు కొంతసేపు గుడి మండపంలో కానీ ప్రాకారం లోపల కానీ కొంతసేపు కూర్చుని ఒక చిన్న ప్రార్ధన చేసేవారూ.
అది ఏమిటంటే..!

"అనాయాసేన మరణం
వినా ధైన్యేన జీవనం
దేహాంతే తవ సాన్నిధ్యం
దేహిమే పరమేశ్వరం."

మీరు గుడి లోనికి వెళ్లినప్పుడు దేవుని ముందు నిల్చుని మీ రెండు చేతులను జోడించి, కళ్ళు తెరిచి ప్రశాంతమైన మనసుతో దర్శనం చేసుకోండి.

దర్శనం అయ్యి గుడి బయటకు వచ్చాక గుడి మండపంలో కూర్చుని కళ్ళు మూసుకుని అప్పుడు మళ్లీ భగవంతుని రూపాన్ని గుర్తుకు తెచ్చుకుని ఆయనను ఈ క్రింది విధముగా అడగండి.

"అనాయాసేన మరణం"
*********************
నాకు నొప్పి లేక బాధ కానీ లేని
మరణాన్ని ప్రసాదించు.

"వినా ధైన్యేన జీవనం"
*********************
నాకు ఎవరి మీదా ఆధారపడకుండా,
నేను జీవితంలో ఎవరి ముందూ తలవంచకుండా, ఎవరినీ నొప్పించకుండా, నేను ఎవరి వద్దా చులకన కాకుండా ఉండే జీవితాన్ని ప్రసాదించు.

"దేహాంతే తవ సాన్నిధ్యం"
***********************
మృత్యువు నావద్దకు వచ్చినప్పుడు నేను
నిన్ను దర్శించుకునే విధంగా దీవించు.

"దేహిమే పరమేశ్వరం"
*********************
ఓ ప్రభూ నాకు ఈ క్రింది మూడు వరములను ప్రసాదించమని నిన్ను ప్రార్ధిస్తున్నాను.

1)అనుక్షణం నీ ప్రార్ధనలొనే గడిపే విధముగా అనుగ్రహించు.నీ ప్రార్ధనతో నన్ను ఉత్తమమైన మార్గంలోకి తీసుకు వెళ్ళు.
2)ఎప్పుడూ కూడా నేను నిన్ను నాకు కానీ నా బిడ్డలకు కానీ సంపదలు కానీ పేరు ప్రఖ్యాతులు కానీ ఇవ్వమని అడగను కానీ నాకు నీవు ఉత్తమమైన నీ సాన్నిధ్యాన్ని అనుగ్రహించు.
3) నాకు ఎప్పుడూ కూడా నీవు సదా అండగా
ఉండి నన్ను ఉత్తమమైన మార్గంలో నడిపించు.
ఇలా మీరు ఎప్పుడు గుడికి వెళ్లినా ఇప్పుడు చెప్పిన విషయాలు గుర్తుంచుకొని ప్రవర్తిస్తే మనకు ఏమి కావాలో అవి అన్ని కూడా మనం అడగకుండానే ఆయనే ప్రసాధిస్తాడని మరువకండి.
" లోకా సమస్తా సుఖినో భవంతు..!!

పాదరస లక్ష్మీదేవి

‘పాదరస లక్ష్మీదేవి’ని పాదరసంలో మూలికలు కలిపి లక్ష్మీదేవి ప్రతిరూపాన్ని నియమ నిష్ఠలతో అనుభవమున్నవారు తయారుచేస్తారు. పూర్వం ఇంద్రుడు, కుబేరుడు, దిక్పాలకులు, వశిష్టుడు, విశ్వామిత్రుడు, ఆదిశంకరాచార్యుల వారు పాదరస లక్ష్మీదేవిని పూజించారని శాస్త్రాలు చెబుతున్నాయి. పాదరస లక్ష్మీదేవి విగ్రహాలు గొప్ప అతీంద్రియశక్తి కలిగి ఉంటాయి. యజుర్వేదంలో 108 రకాల లక్ష్మీదేవి అమ్మవారి విశిష్టతను తెలిపారు అందులో పాదరస లక్ష్మీ దేవి విశిష్టత గురించి కూడా తెలియజేశారు.

అక్షయతృతీయ, దీపావళి, వరలక్ష్మీ పూజలోను, శుక్రవారాలలో ఉదయాన్నే స్నానం చేసిన తరువాత పూజామందిరంలో బియ్యపు పిండి ముగ్గుతో స్వస్తిక్ గుర్తు వేసి దాని పైన అష్టలక్ష్మీ పీఠాన్ని గాని, శ్రీ యంత్రాన్ని గాని ఉంచి ఎరుపు రంగు వస్త్రం పరచి దానిపైన రాగి గాని ఇత్తడి ప్లేటు గాని ఉంచి స్వస్తిక్ ఆకారంలో పూలతో,అక్షితలతో అలంకరించి పాదరస లక్ష్మీ దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి.అనంతరం బంగారు వర్ణంకలిగిన నాణేలను అమ్మవారి ముందు ఉంచి ధీపారాధన చేసి ధ్యాన,ఆవాహనాధి విదులతో పూజించి ధూప దీప నైవేద్యాలు సమర్పించి లక్ష్మీ అష్టోత్తర శతనామానంతరం కమల మాలతో,శంఖ మాలతో,వైజయంతి మాలతో, “ఓం ఐం ఐం శ్రీం శ్రీం హ్రీం హ్రీం పారదేశ్వరీ సిద్ధమ్ హ్రీం హ్రీం శ్రీం శ్రీం ఐం ఐం ఓం”అనే మంత్రాన్ని 108 సార్లు పఠిస్తూ పాదరస లక్ష్మీదేవి విగ్రహాన్ని పవిత్రమైన కుంకుమతో కుంకుమార్చన చేస్తూ పుష్పాలు,సుగంధ ద్రవ్యములు ,గంధం,స్వీట్స్,పండ్లు, తామరమాల మొదలైన పూజా ద్రవ్యములు ఉపయోగించి పూజించవచ్చును.. శ్రీసూక్తం మంత్రం ఉపయోగించి తామరమాలతో జపం చేయవలెను.పూజ అనంతరం పూజాక్షిత లను,పుష్పాలను శిరస్సున ఉంచి తీర్ధ ప్రసాదాలు స్వీకరించిన పిదప పాదరస లక్ష్మీ దేవి విగ్రహాన్ని బీరువాలో గాని, ధనం,నగలు,బంగారం ఉండే చోట భద్ర పరచుకోవాలి.

పాదరస లక్ష్మీదేవిని నిత్యం పూజచేసిన వారికి దీర్ఘకాలం సంపదను కలిగిస్తుంది. సమాజంలో గౌరవాలను, సంపదను, ఉన్నతవిద్యను కలిగిస్తుంది. మంచి ఉద్యోగం లభిస్తుంది.పాదరస లక్ష్మీ దేవి ఇంటిలో ఉంటే డబ్బు కొరత రాదు.మనస్సు ప్రశాంతంగా ఉండటమే కాకుండా చంచలత్వం కూడా ఉండదు. పాదరస లక్ష్మీదేవిని పూజించి కార్యసాదనలో ఎన్ని ప్రయత్నాలు చేసిన విజయం పొందని వారు కూడా కార్యసాధనలో విజయం పొందవచ్చును. జీవితంలో ఒడుదుడుకులు లేకుండా చేస్తుంది.పాదరస లక్ష్మీదేవి వాణిజ్య,వ్యాపార ప్రయోజనాల కోసం ప్రత్యేక ప్రాధాన్యత కలిగి ఉంది.షాపు లేదా వ్యాపారస్ధలంలో పాదరస లక్ష్మీదేవిని ఉంచిన నిరంతర వ్యాపారాభివృద్ధి ఉండటమే కాకుండా ధనాభివృద్ధిని కలిగిస్తుంది.

అమ్మవారు స్వయంగా చెప్పిన పూజలు వ్రతాలూ ఏమిటి?

ప్రతి రోజు సాయంత్రం / ప్రదోష కాలం లో అమ్మవారు , శివుడు ఆనంద తాండవం చేస్తూ ఉంటారు అంట. ఈ సమయమా లో చేసే పూజలు అంటే అమ్మవారికి చాల ఇష్ఠం అంట. అవి ఆర్ద్రనతకరి అని , అనంత తృతీయ, రసకల్యని అని వ్రతం చాలా ఇష్టం అని పురాణ వచనం. ప్రతి శుక్రవారం అమ్మవారికి అర్చన చేయటం అత్యంత ప్రీతికరమ్.
ప్రతి మంగళవారం అమ్మవారిని సేవించడం, పూజ చేయటం, అర్చన చేయటం , వ్రతం చేయటం కూడా విశేషం అని అమ్మవారు చెపుతుంది. ఎవరు మంగళవారం అమ్మవారిని పూజ చేస్తారో వారికీ శత్రు పీదలు ఉండవు , రోగ నివారణ , అప్పులు , రుణాలు తీరిపొతాయి అని , కుజ గ్రహ దోషాలు జాతకం లో ఎక్కడ ఉన్న కూడా దోష పరిహారం అవుతుంది అని, అమ్మవారికి అత్యంత ప్రీతికర్మయిన రోజు ఈ బౌమవారం (మంగళవారం) అని చెపుతారు. ఎవర్ని అయితే అమ్మవారు కరునిస్తుందో వారి ఇంటికి అమ్మవారు కదిలి వస్తుందంట. పిలవని పేరంటం ఎవరు వస్తారో వారే అమ్మవారి స్వరూపమ్ గా చెపుతారు.
కృష్ణ చతుర్దశి (బహుళ చతుర్దశి ) , ప్రతి మాసం లో అమావాస్య కంటే ముందు వచ్చే చతుర్దశి రోజున అమ్మవారిని స్తుతించటం వలన అమ్మవారి కృపకి పాత్రులు కావచ్చు.
నవరాత్రి ద్వయం అంటే శరనవరాత్రులు ( దుస్సేర నవరాత్రి ) , వసంత నవరాత్రులు ( ఉగాది నుంచి శ్రీ రామ నవమి వరకు చేసేది). అమ్మవారికి అత్యంత ప్రీతికరమయిన నవరాత్రులు.
వసంత నవరాత్రులు ఎందుకు అమ్మవారికి ఇష్టం అంటే దేవి భాగవతం లో " శ్రీ రామో లలితాంబికా , శ్రీ కృష్ణో శ్యామలంబ " అంటారు, అంటే శ్రీ రాముడు ఎవరో కాదు లలితా పరమేశ్వరే , స్వరూపం రాముడు, అవతారం లలితాంబ అని చెపుతారు. శ్రీ రాముడకి పూజ చేసిన అమ్మవారికి పూజ చేసినట్టే. అందుకనే శ్రీ రామ నవరాత్రులలో కూడా అమ్మవారికి పూజ చేస్తారు.
అమ్మవారు మనల్ని ఎలా ఏ రూపం లో అనుగ్రహిస్తుంది ?
కాలి , చండి , బాల, లలిత , దుర్గ అనేక రూపాలలో ఉండి మనని నడిపిస్తుంది , కరుణిస్తుంది అని అనుమానం?
ఒకటి అని కాదు అమ్మవారు సకల వ్యాప్తం అయి ఉంది . మాత్రు రూపం , శాంతి రూపం , ఆకలి రూపం లో , జాతి రూపం లో , చైతన్య స్వరూపం , నిద్ర రూపం లో , దయా రూపం లో , బుద్ది రూపం లో కూడా అమ్మవారు ఉంది మనని నడిపిస్తుంది.
అమ్మవారిని ఏమి కోరుకోవాలి?
కొందరు పిల్లలు కావాలి అని , ఇల్లు కట్టుకోవాలి అని , పెళ్లి కావాలని రక రకాల కోరికలు కోరతం. కానీ ఏది కోరిన మల్లి దాని వలన కలిగే సుకం అల్పం , క్షణికం . అది తీరగానె మల్లి ఇంకో కోరిక వస్తుంది. మరి ఏమి కోరాలి ? శంకరాచార్య అంటారు " నన్ను కరుణించు , నాతో ఉండు" మోక్షం వద్దు , విద్య వద్దు , సంపదలు వద్దు , కానీ నీ నామ స్మరణ చాలు , నాతో ఉండాలి. ఎప్పుడు నీ పాదాల చెంత భక్తీ కలిగి ఉండాలి , ఎప్పుడు కరునిస్తూ ఉండాలి , నన్ను ధర్మమయిన మార్గం లో నడిపించాలి నాయి కోరుకోవాలి.