గోదావరి జిల్లాల్లో ప్రభల విశిష్టత.

కనుమ ప్రభల తీర్థం-జగన్నతోట..?

కోనసీమ అంటేనే అందం.
అది వేదసీమా అని పెద్దల ఉవాచ.
శ్రీశైల పర్వతసానువుల తరువాత తొందరగా మనోలయమయ్యే ప్రదేశాలు కోనసీమ దైవ క్షేత్రాలు

కోనసీమలో తరతరాలనుండి సంక్రాంతికి వెలుగుల్లో వైభవోపేతంగా ప్రభలీనుతున్న ఉత్సవాలు జగ్గన్నతోట ప్రభల తీర్థాలు.
మకర సంక్రమణ ఉత్తరాయణ మహా పుణ్యకాలంలో సంక్రాంతి పండుగ మూడవ రోజున జరుపుకునే కనుమపండుగ దినాన చారిత్రాత్మకమైనదీ 
ప్రభల తీర్థం.

ప్రభల అలంకారంలో దేవాంగులది విశిష్ట పాత్ర.?
కోనసీమ ప్రభల తీర్థం అంటే తెలియని వారు ఉండరు. 
ఎన్నో ఎళ్ళుగా ఈ ప్రాంతంలో ప్రభల తీర్థం అత్యంత వైభవంగా అన్ని వర్గాలవారు కలిసి రమ్యంగా నిర్వహిస్తారు. 
కనుమ పండగ వస్తుండంటే ప్రభలను వీక్షించడానికి దేశ, విదేశాల నుండి కోనసీమ రావలిసిందే.

ప్రభలను ధర్శించి కొలుస్తే ఆ యింట శాంతి, సమృద్ది, ఐశ్వర్యం ఉంటందని భక్తుల ప్రగాడ నమ్మకం.

అందుకే ఏళ్ళ సంవత్సరాల నుంచి నిరాటంకంగా 
ఈ ఉత్సవం జరుగుతూ వస్తుంది. 
ఇంత వరకు బాగానే ఉన్నా ..
ప్రభను కర్రలతో చేసేది ఒకరైతే, 
మోసేది ఇంకొకరైతే.. 
ప్రభలను అందంగా అలంకరించేది 
దేవాంగ కులస్థులు అని తెలిసింది. 
ఏదో సంధర్భంలో అంబాజీపేట, కె. పెదపూడి గ్రామం వెళ్తే అక్కడున్న దేవాంగులు ప్రభల అలంకరణ పనిలో నిమఘ్నమైన సంధర్భాన్ని గమనించవచ్చు.

విషయాన్ని స్థానికంగా ఆరాతీయగా.. 
ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభల అలంకారణ స్తానికంగా చేస్తున్నారని, 
అత్యంత నిష్ఠానిరతితో చేయవలిసిన పూర్వికుల ఆచారాన్ని తాము కొనసాగిస్తున్నమని బదులిచ్చారు. ప్రభల తీర్థం విజయవంతానికి అన్ని వర్గాలవారు సమిష్టి కృషి చేసినా దేవాంగులకు ఉన్నటువంటి చేనేత నైపుణ్యం వలన వస్త్రాలంకారణ దేవాంగులు చేయడం ప్రతీతి. 
దేవతులకే అంగవస్త్రాలు నేసిన దేవాంగులు సాంస్కృతి, సాంప్రదాయాలు కొనసాగించడంలో ముందు ఉంటారనడానికి ఇదొక నిధర్శనం.

కోనసీమ నడుమ తరతరాలనుండీ జరుగుతున్న "జగ్గన్నతోట" ప్రభల తీర్థం వైభవాన్ని ఇంతింతా అని చెప్పరానిది.
మకర సంక్రమణ ఉత్తరాయణ మహా పుణ్యకాలంలో సంక్రాంతి కనుమ నాడు కోనసీమలోని..
కోనసీమలోని అంబాజీపేట మండలం,
మొసలిపల్లి శివారు జగ్గన్నతోట" లో జరిగే 
ఏకాదశ రుద్రుల సమాగమము అత్యంత ప్రాచీనమైన, 
చారిత్రాత్మకమైన, 
అతిపురాతనమైన,
పవిత్రమైన సమాగమము.

ప్రాచీన కాలంలో మొట్టమొదటి గా 
ఈ తోటలోనే ఈ పదకొండు గ్రామాల రుద్రులు సమావేశమయ్యారని ప్రతీతి.
ఈ తోటలో ఏ విధమైన గుడి గానీ, గోపురం గానీ వుండవు.
ఇది పూర్తిగా కొబ్బరి తోట.
ఈ ఏకాదశ రుద్రులు సంవత్సరానికి ఒకసారి ఇక్కడ సమావేశం అవ్వడంతో ఈ తోట విశేష ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇది ఏకాదశ రుద్రుల కొలువు.
హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారము ఏకాదశ రుద్రులు ఒక్కచోట కొలువు తీరేది ప్రపంచం మొత్తం మీదా,
ఈ భూమండలం మొత్తానికీ ఒక్క చోటే..
అదీ వేదసీమ అయినటువంటి కోనసీమలోనే.

లోక కల్యాణార్ధం ఈ పదకొండు గ్రామాల శివుళ్ళు సమావేశం అయ్యి లోక విషయాలు చర్చిస్తారని ప్రతీతి.
సుమారు 400 సంవత్సరాల క్రితం నుండీ 
ఈ సంప్రదాయం వుందనీ తీవ్రమైన పరిస్థితులు వచ్చిన 17 వ శతాబ్ధములో ఈ 11 గ్రామాల రుద్రులు ఈ తోటలోనే సమావేశం అయ్యి లోక రక్షణ గావించారనీ ప్రతీతి.
అప్పటి నుండీ క్రమం తప్పకుండా ప్రతీ సంవత్సరమూ కనుమ రోజు ఎన్ని అవాంతరాలు ఎదురైనా , భూమి తల్లక్రిందులైనా ఈ రుద్రులను ఒక్కచొట చేర్చుతారు ఈ గ్రామస్తులు.

సంస్థానదీశులైన శ్రీ రాజా వత్సవాయి జగన్నాధ మహారాజు కు చెందిన ఈ తోట జగ్గన్న తోట అనే పేరుతో స్థిరపడింది.

ఈ ఏకాదశ రుద్రులు కొలువైన గ్రామాలు ఆ రుద్రుల పేర్లు వరుస గా
1-వ్యాఘ్రేశ్వరం-శ్రీ వ్యాఘ్రేశ్వర స్వామి (బాలాత్రిపురసుందరీ)

2-పుల్లేటికుర్రు-అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి
(బాలా త్రిపుర సుందరి)

3-మొసలపల్లి-మధుమానంత భోగేశ్వర స్వామి

4-గంగలకుర్రు-చెన్నమల్లేశ్వరుడు

5-గంగలకుర్రు(అగ్రహారం)-వీరేశ్వరుడు

6-పెదపూడి-మేనకేశ్వరుడు

7-ఇరుసుమండ-ఆనంద రామేశ్వరుడు

8-వక్కలంక-విశ్వేశ్వరుడు

9-నేదునూరు--చెన్న మల్లేశ్వరుడు

10-ముక్కామల-రాఘవేశ్వరుడు

11-పాలగుమ్మి-చెన్న మల్లేశ్వరుడు.

ఇవీ గ్రామాలు ఆ గ్రామాల రుద్రుల నామాలు.
ఈ స్వామి వారలను "ప్రభలపై" అలంకరించి 
మేళ తాళాలతో,మంగళ వాయిద్యాలతో,
భాజా బజంత్రీలతో "శరభా శరభా" 
హర హర మహాదేవ" అంటూ ఆయా గ్రామాల నుంచి వీరిని మోస్తూ ఈ తోటకు తీసుకువస్తారు.

ఈ తోట మొసలపల్లి గ్రామములో వుంది కనుక 
దీనికి ఆతిధ్యము మొసలపల్లి కి చెందిన మధుమానంత భొగేశ్వరుడు మిగతా గ్రామ రుద్రులకు ఆతిధ్యము ఇస్తారు. 
ఈ రుద్రుడు అన్ని ప్రభల కన్నా ముందే తోటకు చేరుకుని అందరు రుద్రులూ తిరిగి వెళ్లిన తరువాత వెళ్లడం ఆనవాయితీ.

ఈ ఏకాదశ రుద్రులకు అద్యక్షత వహించేది వ్యాఘ్రేశ్వారానికి చెందిన రుద్రుడు
"శ్రీ వ్యాఘ్రేశ్వరుడు".
ఈ వ్యాఘ్రేశ్వరుడు కి చెందిన ప్రభ తోటలోకి రాగానే మిగతా రుద్ర ప్రభలన్నింటినీ మర్యాదా పుర:స్సరంగా ఒక్కసారి లేపి మళ్ళి కిందకు దించుతారు. 
ఈ 11 శివుళ్ళకు వ్యాఘ్రేశ్వరుడు అధిష్టానము.

గంగలకుర్రు అగ్రహారం- వీరేశ్వరస్వామి ప్రభా వాహనం అన్ని ప్రభల కన్నా చివరన తీర్థంలోనికి ప్రవేశిస్తుంది. 
ఈ వీరేశ్వరస్వామి వచ్చేవరకు మిగిలిన ప్రభలన్నీ ఎదురు చూస్తుంటాయ. 
నిండు ప్రవాహంలో వీరేశ్వరస్వామి వారిని ఓలలాడిస్తూ కౌశికను దాటించే తీరు కనుల పండుగగా ఉంటుంది.

ఇక్కడ మరో విశిష్టత ఏమిటీ అంటే గంగలకుర్రు మరియూ గంగలకుర్రు(అగ్రహారం) రుద్ర ప్రభలు 
ఈ తోట కి రావాలంటే మధ్యలో కాలువ(కౌశిక) దాటాలి.
ఆ ప్రభలు ఆ కాలువలోంచి ఏ మాత్రం తొట్రూ లేకుండా "హరా హరా" అంటూ తీసుకువచ్చే 
ఆ గ్రామస్తుల ధైర్యం చూడడానికి రెండు కళ్ళు చాలవు. 
ఎందుకంటే కాలువలో మామూలుగానే నడువలేము. అలాంటిది ఒక 30 మంది మోస్తే కానీ లేవని ప్రభ 
ఆ కాలువలోంచి తోటలోకి తీసుకువచ్చే సన్నివేశం చూసేవారికి ఒల్లు గగుర్పొడుస్తుంది.

ఇక ఆ కాలువలోకి వచ్చే ముందు ఒక వరి చేనుని 
ఆ ప్రభలు దాటవలిసి వస్తుంది. 
ఆ చేను ని తొక్కుతూ పంటను తొక్కుతూ వచ్చినా రైతులు భాదపడక సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడు తమ చేల గుండా వెళ్ళడం పూర్వజన్మ సుకృతం గా భావిస్తారు. 
అలా ఏక కాలం లో ఏకాదశ రుద్రుల(11)దర్శనం చేస్తుంటే కళ్ళు ఆనందాశ్రువులు రాలుస్తాయి.

నమస్తే అస్తు భగవన్
విశ్వేశ్వరాయ
మహాదేవాయ
త్ర్యంబకాయ 
త్రిపురాంతకాయ
త్రికాగ్నికాలాయ
కాలాగ్నిరుద్రాయ
నీలకంఠాయ
మృత్యుంజయాయ
సర్వేశ్వ’రాయ
సదాశివాయ
శ్రీమన్-మహాదేవాయ నమః’ అంటూ రుద్రం లో ఏకాదశ రుద్రుల గురించి ప్రస్తావన ఉంటుంది.

ఆ ఏకాదశ రుద్రులు ఏకకాలం లో సమాగం అయ్యే సన్నివేశం చూస్తే మనసు పులకిస్తుంది
ఈ తీర్థము ను దర్శించడానికి ప్రపంచవ్యాప్తం గా స్థిరపడిన కోనసీమ ప్రజలే కాక,దేశ విదేశీయిలు వచ్చి దర్శించి తరిస్తారు.

ఈ జగ్గన తోట ప్రభలను వీక్షించడం పూర్వ జన్మ పుణ్యంగా భావిస్తారు.
ఈ సారి మీరూ దర్శించి తరించవలిసినది ప్రార్ధన.
ఓం నమః శివాయ..!!?

లోకా సమస్తా సుఖినోభవంతు..!!?

Image may contain: outdoor