కొడుకులు బిడ్డలు

కొడుకులు బిడ్డలు బాకి సంబందంతో పుడతారు. ఒక గురువు చెట్టు క్రింద కూర్చొనీ భక్తి గురించి దేవుని గురించి జన్మ రాహిత్యం గురించి చెబుతున్నాడు. అటుగా వెలుతున్న బాటసారి గురువు చెబుతున్నది వినీ దగ్గరకు వెల్లి తనకు మంత్రోపదేశం ఇవుమని అడిగాడు. గురువు అడిగాడు, నీకు భార్య బిడ్డలు ఉన్నార అని అడిగినాడు. తన బార్య గర్భవతి అని చెప్పాడు. గురువు ఇలా అన్నాడు గురుదక్షణగ నువ్వు నా కేమిస్తావు?అని అడిగాడు గురువు. మీరేదడిగితె అదే ఇస్తాను అన్నాడు సరే నీ భార్యను అడిగిర తనకు పుట్టిన బిడ్డలను నాకు ఇవ్వగలదా? అలా చేస్తే నీకు మంత్రోపదేశం చేస్తాను వెల్లి నీ భార్యను అడిగిర పిల్ల పుట్టిన వెంటనే రక్తం మడుగులో ఉండగానే నాకు ఇచ్చెయ్యాలి అన్నాడు గురువు. అతను వెంటనే ఇంటికి పరుగెత్తి భార్యకు విషయం చెప్పి మన పిల్లలను గురువుకు ఇవ్వగలవ ? అని అడిగాడు. అందుకు ఆమె అలాగే ఇచ్చేద్దాం మన పిల్లలు గురువు వద్ద ఉంటే మంచిదే కదా, అంటు వప్పుంకుంది. ఆ విషయాన్ని గురువుకు చెప్పి వెల్లినాడు. కొద్దిరోజులకీ ఆమె ప్రసవించింది. మగపిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాన్ని నెత్తుటి మడుగులో ఉండగానే తీసుకెళ్లి గురువు చేతిలో పెట్టారు భార్య భర్తలు. గురువు ఆ పిల్లవాన్ని తీసుకెళ్లి గొయ్యి తీసి అందులో పూడ్చేసాడు. తల్లి దండ్రులు బిత్తరపొయి చూస్తు చేసేది ఏమిలేక వెనుతిరిగి వెల్లి పోయారు. ఈ విదంగా రెండో పిలవాన్ని కూడ గొయ్యిలో పూడ్చిపెట్టేసాడు. మూడోసారికీ ఆవిడ వప్పుకోలేదు. ఇదేం గురువయ్యా ? నాకు నచ్చలే నా కొడుకును ఇవ్వను కాక ఇవ్వను అనీ మొండికెత్తుకున్నది. అతను గురువు వద్దకు వెల్లి విషయం చెప్పాడు. గురువు గారే ఆమె దగ్గరకు వెళ్లి ఇలా అన్నాడు. అమ్మ నీ బిడ్డను ఇవ్వన్నావుకదా ఇప్పుడు నీ బిడ్డను నేనేమి చేయను కాని ఒక్క సారిబిడ్డను నా చేతికిచ్చి నావెంటరండి మీ బిడ్డను నేనేమి చేయను మల్లీ మీ బిడ్డను మీకు ఇచ్చేయ్ తాను. అని అన్నాడు. సరేననీ బిడ్డను తీసుకొనీ గురువు వెంట బయలు దేరినారు వారిరువురు. గురువు వీల్లిద్దరినీ ఇంతకుముందు గొయ్యి తీసి పెట్టిన చోటికి తీసకెల్లాడు. ఆ రెండు గొయ్యిల మద్యన తెల్లని గుడ్డ పరిచి ఈ పిల్ల వాడిని వాటిమద్యలో పడుకోబెట్టి చేతిలోకి నీల్లు తీసుకొనీ మంత్రించి ఆ మూడింటి మీద చల్లాడు. తల్లీ దండ్రులను కొంచెం దూరంలో నిలబెట్టి ఆ గొయ్యిలోగొయ్యిలో నుండి వస్తున్న శబ్దాలను వినుమన్నాడు. గొయ్యిలో నుండి మొదటి పిల్లవాడు రెండవవాడిని అడుగుతన్నాడు. ఒరేయ్ వీల్లకు కొడుకుగ పుట్టావు కదా దేనికోసం పుట్టావు వీల్లకి నీకు ఏమిటి సంబందం అని అడిగాడు. రెండో వాడు ఇలా చెబుతున్నాడు. గతజన్మలో వీడు బాకి పడ్డాడు నాకు డబ్బులు ఇవ్వకుండానే పోయాడు. అందుకనీ వీడికి కొడుకునై పుట్టి అందినంత లాగేసుకుందామని వచ్చాను. మరీ నువ్వేందుకొచ్చావు అని అడిగినాడు. వీడు నాకు కూడా ఇవ్వాలిరా నేను కూడా అందుకే వచ్చాను వీడికి కొడుకునై పుట్టి దొరికినంత దోచుకొని వదిలేసి వెల్దామని వచ్చాను కానీ వీడు మనల్ని గురువు చేతిలో పడవేసాడు. ఇంకేముంది? వాడు మనకు పడిన బాకీలన్నీ గురువు తెగ్గొట్టేసాడు. ఇప్పుడు వాడికి మనకి రుణబందం తెగిపోయింది అని వాల్లు మాట్లాడుకుంటున్నారు. ఈ ఇద్దరూ కలిసి బ్రతికి ఉన్న మూడోవాడిని అడిగారు. ఒరేయ్ నువ్వెందుకొచ్చావురా ? అని అప్పుడు బ్రతికి ఉన్న మూడోవాడు ఇలా చెప్పాడు. గతజన్మలో నాకు కొడుకులు బిడ్డలు ఉండికూడ దిక్కు లేకుండా పడిఉంటే వీడు నన్ను చేరదీసి అన్నం పెట్టీ ఆదరించాడు. నేను పోయే వరకు నన్ను పోషించాడు. అందుకే ఈ జన్మలో వీనికి కొడుకునై పుట్టి తల్లి తండ్రులిద్దరినీ వాల్లు బ్రతికినంత కాలం అన్నం పెట్టి వల్లను సంతోషంగా ఉంచి ప్రశాంతమైన జీవితాన్ని వాల్లకు ఇచ్చి వారి రుణం తీర్చుకుందామని వారికి కొడుకునై పుట్టాను. మీరు ఆయన్ని పీడించాలని వచ్చారు గనుక గురువు మిమ్మల్ని గొయ్యిలో పాతిపెట్టాడు. నేను అలా కాదు గనుక నేను బ్రతికి ఉన్నాను అని చెపాడు. ఈ ముగ్గురు మాట్లాడుకున్న మాటలు ఈ తల్లి తండ్రులు విన్నారు గురువు పాదాల మీద పడి క్షెమించమని వేడుకున్నారు...కాబట్టీ గురువులేని పూజ గుడ్డిపూజ అని అర్దం. ఆత్మ జ్ఞానము తెలిసిన గురువును పట్టుకుంటే రుణాను బందాలేకావు జన్మరాహిత్యమే జరుగుతుంది. ఈ జన్మలోనే మోక్షం లబిస్తూంది...మోక్షమంటే చనిపోయిన తర్వాత మోక్షం వస్తుందనీ చాలా మంది అనుకుంటారు. కాని అదికాదు మోక్షం అంటే బ్రతికుండగానే ఆత్మ జ్జానాన్ని పొందటం...దైవం ఏఏరూపాలలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు. ఈ సృష్టి ఏమిటి. ఎలా తయారైయింది. నేనెవరిని. ఎక్కడనుండి వచ్చాను మల్లీ ఎక్కడికి వెలతాను. అసలు మాయ అంటే ఏమిటి???? ఇలా ఎన్నో సృష్టి రహస్యలు బ్రతికుండగానే తెలిసిపోతాయి ఇదే మోక్షం మరు జన్మకి రాకుండా భగవంతుడు తనరూపాన్ని ఇచ్చి తానుగా మార్చుకుంటాడ

::జై శ్రీ మన్నారాయణ జై శ్రీ మన్నారాయణ