కార్తీక పురాణం -1 వ అధ్యాయం 

కార్తీక మహత్యం గురించి జనకుడు ప్రశ్నించుట 
================================ ==
శ్రీమద్ అఖిలాండకొటి బ్రహ్మానడమందు ఆర్యవర్తమందు నైమిశారణ్యంలో శౌనకాది మహామునులతో వొక ఆశ్రమం నిర్మించుకొని సకల పురాణాలు పుణ్య చరిత్రలు వినిపిస్తూ సూతమహాముని కాలం గడుపుచుండెను .వొకనాడు శౌనకాది మహామునులు సూతుని గాంచి కార్తీక పురాణాన్ని వివరించి దాని ఫలము తెలుపగోరమనగా అప్పుడు సూత మహాముని వొకనాడు నారదుడికి బ్రహ్మ దేముడు ,విష్ణుమూర్తి లక్ష్మి దేవికి , సాంబ శివుడు పార్వతీదేవికి తెలియచేసిన విదముగా ఆ గాధను వినిపించెను. ఈ కధను వినుటవలన మానవులకు ధర్మార్ధములు కలగటమే కాక ఇహమందును పరమందును సకల ఐశ్వర్యములతో తులతుగెదరు అంటూ స్కాంద పురాణంలో చెప్పినట్లుగా తనకు గురుపూజ జరిగిన అనంతరం వసిష్ట మహాముని మిదిలాదీసుడగు జనకమహరాజుకు జనకమహారాజ నేనొ క మహాక్రతువు చేయతలపెట్టాను అర్ధ బలం అంగబలం తో క్రతువు ప్రారంబిద్దామని వచ్చాను అనగా ..జనకుడు అలాగే అని చెప్పి కార్తీక మాసం ఏల అంత గొప్ప? ఏల అంత పవిత్రత? వివరించగలరు అనగా వసిష్ట మహాముని ఇది సకల జనులు ఆచరించే వ్రతం ..సకల పాప హరం.. హరిహర స్వరూపం అంటూ ఏ మనవుద్యేనా ఏ వయసు వాడ్యేన ఉచ్చ నీచ బేదాలు లేకుండా సూర్యబగవానుడు తులరాసిలో వుండగా వేకువజామునే లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నాన మాచరించి దాన ధర్మాలు చేసిన మంచి ఫలితాలు పొందవచ్చు... విష్ణు సహస్ర నామ పారాయణ.. శివలింగార్చన చేస్తూ ప్రారంభమున కార్తీక మాస ప్రత్యది దేవత దామోధరునికి.... వో దామోదర కార్తీక వ్రతానికి ఎలాంటి ఆటంకాలు రాకుండా చేయి తండ్రి అంటూ వ్రతం ప్రారంబించవలెను 
కార్తీక స్నాన విధానం 
================
వ్రతమాచరించే దినాలలో సూర్యోదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని నదికి పోయి స్నానం చేసి గంగకు శ్రీమన్నారాయునికి పరమేశ్వరునికి భైరవునికి నమస్కరించి సంకల్పం చెప్పుకొని నీటమునిగి సూర్యబగవానునికి ఆర్గ్య మొసగి పితృదేవతలకు తర్పణం వొదిలి గట్టుప్యే మూడు దోసేల్ల నీళ్ళు పొయెవలెను... పుణ్య నదుల్యెన గంగ, గోదావరి ,కృష్ణ ,కావేరి, తుంగబద్ర, యమున నదుల్లో స్నానం గోప్పఫలం... తడిబట్టలు వీడి మడి బట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పూలు స్వయంగా కోసి నిత్య ధూప దీప నైవేద్యములతో పూజ చేసి గంధం సమర్పించి బొట్టు పెట్టుకొని అతిధి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదం పెట్టి తన ఇంటివద్దకాని దేవాలయం వద్దకానీ లేక రావిచెట్టు వద్ద కూర్చొని కార్తీక పురాణం చదవవలెను సాయంకాలం సంధ్యావందనం చేసుకొని శివాలయంలో కాని విష్ణాలయం లోకాని తులసి కోటలో కాని దీపరాదన చేసి శక్తిని బట్టి నైవేద్యం పెట్టి స్వామికి సమర్పించి అందరికీ పెట్టాక తాను బుజించవలెను... మరునాడు మ్రుస్టాన్నంతో బూత త్రుప్తి చేయవలెను.... ఈ విదంగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుతజన్మమందును చేసిన పాపం పోయి మోక్షం అర్హత కలుగును.... వ్రతం చేయుటకు అవకాశం లేనివాళ్ళు ఈ వ్రతంచేసిన వారలను చూచి నమస్కరించినచో వారికి అంతే ఫలము కలుగును 
ఇది స్కాంద పురాణ అంతర్గత వసిష్ఠ ప్రోక్త కార్తీక మాహత్యమందలి మొదటి అధ్యాయం మొదటిరోజు పారాయణం సమాప్తం ........ఓం నమః శివాయ 

ఈరోజు ఉల్లి ,ఉసిరి ,చద్ది ,ఎంగిలి ,చల్లని వస్తువులు నిషిద్దము ----నెయ్యి బంగారం దానం----- స్వధా అగ్నిని పూజించాలి------- ఓం జాతవేదసే స్వధాపతే స్వాహ అన్న మంత్రం జపించాలి -----తెజోవర్ధనం ఫలితం దక్కుతుంది.
courtesy by
Deepthi