ఎవడు -ఆ సర్వేశ్వరుడు

మూడక్షరాల అన్వేషణ
భగవంతుడు గొప్పవాడు ‘ఈ జగత్తు ఎవరి వల్ల జనిస్తోందో, ఎవరి అధీనంలో ఉందో, ఎవరి కారణంగా నశిస్తున్నదో...’ అంటాడు పోతన. సృష్టికి మూలకారణం ఎవరో, ఆది మధ్య అంతం లేనివారెవరో, అన్నీ తామే అయిన వారెవరో... అంటూ వర్ణిస్తాడు. అలాంటి ఆత్మభవుడై(తనంత తాను జన్మించి)న పరమాత్మను శరణు వేడుతున్నాను’ అంటాడాయన. భక్తుల్లో అలా ఉత్కంఠ పెంచుతూ, ‘ఇన్ని లక్షణాలున్నవాడు పరమాత్మ ఒక్కడే’ అని జవాబు చెబుతాడు. ఎక్కువ ఎవరూ లేరన్నంతగా అన్నిసార్లూ ముక్తాయిస్తాడు. పరమాత్మకు భక్తుడు కాకుండా, ఇక ఆ పాఠకుడు ఎలా తప్పించుకుంటాడు?
అష్టమ స్కంద ప్రారంభంలో ‘ఎవడు’ అనే పదాన్ని రెండు అర్థాల్లో వాడిన తీరు, పోతన రచనా పాటవానికి ప్రతీక. ఎంత వెతికినా, అన్ని లక్షణాలూ ఉన్నవాడు ఆ సర్వవ్యాపి అయిన అంతర్యామి ఒక్కడే! అంత గొప్పవాణ్ని కనుగొన్న జీవుడు ఆరాధించకుండా ఉండలేడు. అందువల్ల అతడు జీవన్ముక్తి పొందగలుగుతాడు.
-

Image may contain: 1 person, standing